P Venkatesh
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లే వారికి బిగ్ అలర్ట్. నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్ విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వెళ్లే వారికి బిగ్ అలర్ట్. నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కేబుల్ బ్రిడ్జిపై ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్ విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
P Venkatesh
హైదరాబాద్ మహానగరంలో పర్యాటక ప్రాంతాలకు కొదవ లేదు. నగరవాసులతో పాటు వరల్డ్ వైడ్ గా పర్యాటకులు భాగ్యనగరానికి చేరుకుని ఇక్కడి చారిత్రక కట్టడాలను పర్యాటక ప్రాంతాలను చూసి ఎంజాయ్ చేస్తుంటారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీగా అవతరిస్తున్న వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మౌళిక సదుపాయాల కల్పనతో పాటు పలు ప్రాంతాలను అత్యంత సుందరంగా అభివృద్ధి చేస్తోంది. దీనిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి. ఐటీ కారిడార్ లో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జికి పర్యాటకుల తాకిడి ఎక్కువే. కాగా కేబుల్ బ్రిడ్జిని సందర్శించేందుకు వెళ్లే వారు ఇకపై అలా చేస్తే భారీగా ఫైన్ విధిస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ఒకటి. రోజూ వందలాది మంది ఇక్కడికి చేరుకుని సందడి చేస్తుంటారు. కేబుల్ బ్రిడ్జిపై బర్త్ డే వేడుకలు చేసుకునేందుకు యువత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే దీని వల్ల ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. సాధారణ జనానికి ఇబ్బంది కలుగుతోంది. ఈ క్రమంలో కొన్ని సార్లు రోడ్డు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కేబుల్ బ్రిడ్జిపై సెల్ఫీలు తీసుకుంటుండగా కారు ఢీకొట్టడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగర పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపైకి వచ్చే వారు సెల్ఫీలు దిగితే ఫైన్‌తో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరించారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించినా, బర్త్ డే వేడుకలు జరుపుకున్నా రూ.1000 జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని పోలీసులు వెల్లడించారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలకు వెనకాడబోమని పోలీసులు హెచ్చరికలు జారీచేశారు. కేబుల్ బ్రిడ్జిపై ఏవిధమైన ప్రమాదాలు చోటుచేసుకోకుండా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మరి కేబుల్ బ్రిడ్జిపై పుట్టిన రోజు వేడుకలపై ఆంక్షలు విధించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.