P Venkatesh
హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. నగరంలో నేడు, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ కారణంతో ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో అంటే?
హైదరాబాద్ లోని వాహనదారులకు బిగ్ అలర్ట్. నగరంలో నేడు, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆ కారణంతో ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఇంతకీ ఏయే ప్రాంతాల్లో అంటే?
P Venkatesh
హైదరాబాద్ మహానగరంలో నిత్యం ట్రాఫిక్ రద్దీ ఉంటుంది. ఆఫీస్ లకు వెళ్లే ఉద్యోగులు, ఇతర వృత్తుల వారు వేల సంఖ్యలో తమ వాహనాలతో రోడ్లపైకి చేరడంతో ట్రాఫిక్ హెవీగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కిలోమీటర్ ప్రయాణానికి కూడా అరగంట నుంచి గంట వరకు సమయం పట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక నగరంలో ట్రాఫిక్ పోలీసులు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. పండగలప్పుడు, శోభాయాత్రలు, ప్రధాని, రాష్ట్రపతి వంటి నాయకులు సందర్శించినప్పుడు ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో ఏయే ప్రాంతాల్లో ఆంక్షలు ఉన్నాయో తెలియక వాహనదారులు అటువైపు వెళ్లి ఇబ్బందులు పడుతుంటారు. తాజాగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు బిగ్ అలర్ట్ ఇచ్చారు. నగరంలో నేడు, రేపు ఆ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
హైదరాబాద్ లోని వాహనదారులారా నేడు, రేపు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. అటువైపు వెళ్తే చిక్కుల్లో పడతారు. ప్రతీఏడు మృగశిర కార్తె ప్రారంభం అయ్యాక హైదరాబాద్ లో బత్తిని సోదరులు చేపమందు పంపిణీ చేస్తారనే విషయం తెలిసిందే. అయితే ఈ చేపప్రసాదం కోసం ఇరు తెలుగు రాష్ట్రాల నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ప్రజలు హైదరాబాద్ కు తరలివస్తుంటారు. ఈ క్రమంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో నేడు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానున్నది. చేప ప్రసాదం పంపిణీ సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శని, ఆదివారాల్లో ట్రాఫిక్ మళ్లింపు ఉంటుందని సిటీ సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి తెలిపారు.
ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే ట్రాఫిక్‌ను అబిడ్స్, జీపీఓ మీదుగా మళ్లిస్తారు. ఎంజే బ్రిడ్జ్, బేగంబజార్ ఛత్రి నుంచి నాంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్‌ను అలస్క్ నుంచి దారుస్సాలం, ఏక్‌మినార్ వైపు డైవర్ట్ చేస్తారు. కార్లను గృహకల్ప, గగన్ విహార్, చంద్రవిహార్లో పార్కు చేయాల్సి ఉంటుంది. చేప ప్రసాదం కోసం గేట్ నంబర్–2 నుంచి వెళ్లాలి. వీఐపీ కారు పాసులు ఉన్నవారు ఎంజే మార్కెట్ నుంచి అజంతా గేట్, గాంధీభవన్ లెఫ్ట్ టర్నింగ్ నుంచి గేట్ నంబర్–1, సీడబ్ల్యూసీ గేట్ద్వారా గ్రౌండ్లోకి వెళ్లాలి. ఎంజే మార్కెట్ నుంచి వచ్చే టూవీలర్లను మనోరంజన్ కాంప్లెక్స్, గృహకల్ప, బీజేపీ ఆఫీస్ రూట్‌లో పార్క్ చేయాలి. ఆటోలను షేజాన్ హోటల్, భవానీ వైన్స్, జువెనల్ కోర్టు, ఎక్సైజ్ ఆఫీస్ లెఫ్ట్ సైడ్ రూట్‌లో పార్క్ చేయాల్సి ఉంటుంది.