SNP
CM Revanth Reddy, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. అయితే.. ఈ ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ రెడ్డి సీఎం కాకముందే 2016లో అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
CM Revanth Reddy, N Convention, HYDRAA: మదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను హైడ్రా కూల్చివేసింది. అయితే.. ఈ ఎన్ కన్వెన్షన్ గురించి రేవంత్ రెడ్డి సీఎం కాకముందే 2016లో అసెంబ్లీలో ప్రస్తావించారు. ఆ విషయం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తోంది హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్సాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ). చెరువులు, కుంటలను ఆక్రమించి.. కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తూ.. మహానగరంలో కబ్జాదారులకు నిద్రలేకుండా చేస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న చర్యల్లో ఈ ఏజెన్సీ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే నగరంలో చాలా చోట్ల అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. తాజాగా మదాపూర్‌లోని ఎన్ కన్వెన్షన్‌ను సైతం కూల్చివేశారు హైడ్రా అధికారులు. భారీ బందోబస్తు ఏర్పాటుచేసి.. పెద్ద పెద్ద జేసీబీలతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి.
2016లో డిమాండ్..
కబ్జాలు, అక్రమ నిర్మాణాలు, చెరువుల ఆక్రమణలను అరికట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డికి ముందు నుంచి ఒక నిర్ధిష్ట ప్రణళిక ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే.. ఆయన 2016లోనే ఆయన హైదరాబాద్‌లో చెరువుల కబ్జా, భూముల ఆక్రమణపై అసెంబ్లీ సాక్షిగా సమస్యను లేవనెత్తారు. ఆ సమయంలో పర్టిక్లర్‌గా ఎన్ కన్వెన్షన్ గురించి కూడా ఆయన మాట్లాడారు. ఆ వీడియో తాజాగా సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతోంది. దాదాపు 8 ఏళ్ల కిత్రమే హైదరాబాద్ మహానగరంలో చెరువులు కబ్జాకు కురవుతూ.. కుశించుకుపోతున్నాయని, అందుకే వరదలు సంభవిస్తున్నాయని అప్పట్లోనే రేవంత్ రెడ్డి గుర్తించారు. దానిపై అసెంబ్లీలో కూడా మాట్లాడారు.
అయితే.. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత.. అప్పుడు అసెంబ్లీలో ఏం అయితే మాట్లాడారో.. దాన్ని ఇప్పుడు నిజం చేసి చూపిస్తున్నాడు. అక్రమ కట్టడాలపై, భూముల ఆక్రమణ, చెరువుల కబ్జాలపై ఉక్కుపాదం మొపుతూ.. ఒక విజన్‌తో ముందుకు వెళ్తున్నారు. భూములను కబ్జా చేసిన వారు ఎంత పెద్ద వ్యక్తులైనా సరే లెక్క చేయకుండా.. భారీ నిర్మాణాలను నేలమట్ట చేస్తున్నారు. అధికారం, ధనబలంతో యథేచ్ఛంగా చెరువులు, నాలాలు, కుంటలు ఆక్రమించి.. భారీ భారీ నిర్మాణాలు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవడమే కాకుండా.. వాటిని యుద్ధ ప్రతిపదికన కుల్చివేస్తున్నారు. ఈ కూల్చివేతల కోసం హైడ్రా అనే పవర్ ఫుల్ ఏజెన్సీని ఏర్పాటు చేసి.. ప్రభుత్వ భూములను, చెరువులను రక్షించే కార్యక్రమం చేపడుతున్నారు. మరి చెరువుల కబ్జాల గురించి 2016లో మాట్లాడి.. ఇప్పుడు ఆ మాటలకు కట్టుబడి పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిపై, అలాగే హైడ్రా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
The process of demolishing the N Convention Center, situated in Madhapur and owned by actor #Nagarjuna, has begun. This action was taken by Hydra officials after receiving complaints alleging that the construction of the convention center involved illegal encroachment upon… pic.twitter.com/baC35gj6j7
— TOI Hyderabad (@TOIHyderabad) August 24, 2024