రేషన్ తీసుకునేవారికి శుభవార్త.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

రేషన్ తీసుకునేవారికి శుభవార్త.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం

రేషన్ సరుకులపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ సరుకులు తీసుకునే వారికి తిపి కబురును అందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

రేషన్ సరుకులపై కీలక వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రేషన్ సరుకులు తీసుకునే వారికి తిపి కబురును అందించారు. మీడియాతో మాట్లాడిన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను నెరవేర్చేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే కొన్ని హామీలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్.. ఆరు హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతోంది. ఇటీవలె రైతులకు యాసంగికి సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదే విధంగా రైతు భరోసా కింద 15 వేల సాయాన్ని త్వరలోనే ఇస్తామని మంత్రి ప్రకటించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రేషన్ తీసుకునే వారికి శుభవార్తను అందించారు.

ఇవాళ మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ బియ్యంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేషన్ షాపుల్లో సన్న బియ్యంతో పాటు మరికొన్ని సరుకులను అందిస్తామని తెలిపారు. పేదలను ఆదుకునేందుకు తక్కువ ధరకే ఎక్కువ సరుకులను పంపిణీ చేస్తామని వెల్లడించారు. కొత్త రేషన్ కార్డులు అందిస్తామని తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర రైతాంగానికి తీపి కబురును అందించారు. రైతురుణ మాఫీపై ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని తెలిపారు. రైతులను ఒకేసారి రుణవిముక్తులను చేస్తామని స్పష్టం చేశారు.

రైతుల సమస్యలపై చర్చించి, పరిష్కరించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతామని చెప్పారు. పంటలకు మద్దతు ధర అందిస్తామని వెల్లడించారు.ఇక రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే. 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ 13 సీట్లు గెలుపొందుతామని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఎన్నికలు ముగిసిపోవడంతో పాలనపై దృష్టి సారిస్తామని వెల్లడించారు.

Show comments