P Krishna
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో తనదైన మార్క్ చాటుకుంటున్నారు.
P Krishna
తెలంగాణలో నూతనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. నాటి నుంచి తనదైన దూకుడు కొనసాగిస్తున్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో రెండు గ్యారెంటీలు ఇప్పటికే అమలు చేశారు. మిగతా వందరోజుల్లో పూర్తి చేస్తామని అంటున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు. తాజాగా డ్రగ్స్ స్మగ్లింగ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. వివరాల్లోకి వెళితే..
నేడు సచివాలయంలో జరిగిన అన్ని జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్రంలో డ్రగ్స్, భూ కబ్జాలు అనే మాటలు వినిపించకూడదని అధికారులకు సూచించారు. రాబోయే న్యూ ఇయర్ వేడుకల్లో యువత పార్టీల పేరుతో డ్రగ్స్ వాడుతూ నానా రచ్చ చేస్తున్నారని.. దురదృష్టం ఏంటంటే ఇందులో సెలబ్రెటీలు, రాజకీయ నేతల వారసుల పేర్లు కూడా వినిపించడం శోచనీయం అన్నారు. న్యూయర్ వేడుకల్లో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుడండా చూడాలని అన్నారు.
డగ్స్ విషయంలో కఠినంగా వ్యవహరించకుంటే తెలంగాణ రాష్ట్రం మరో పంజాబ్ లా తయారు అవుతుందని అన్నారు. నకిలీ విత్తనాలు టెర్రరీజం కన్నా మహా ప్రమాదం.. నకిలీ విత్తనాల అమ్మే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు తెలిస్తే.. వారిపై ఉక్కపాదం మోపాలని అన్నారు. అధికారులు చిత్తశుద్దిగా వ్యవహరిస్తే.. ఎలాంటి అన్యాయాలు, అక్రమాలు జరగవని అన్నారు. నిబద్దతలో లేని అధికారులను ఏమాత్రం క్షమించబోమని హెచ్చరించారు. సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత డ్రగ్స్ దందాలపై దృష్టి సారించారు. ఇప్పటికే నగరంలో ఈ దందాలను అరికట్టేందుకు ట్రైనింగ్ పొందిన స్నీఫర్ డాగ్స్ ని రంగంలోకి దింపిన విషయం తెలిసిందే.