P Krishna
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ విజయంతో ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ విజయంతో ముఖ్యమంత్రిగా డిసెంబర్ 7న ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు.
P Krishna
తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి పరిపాలన విషయంలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, అర్హులైన వారికి రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద పది లక్షల భీమా సౌకర్యం కల్పించారు. ఈ నెల 28 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం పేరుతో ఆరు గ్యారెంటీల పథకాలకు కోసం ధరఖాస్తు చేసేందుకు ప్రజాపాలన కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజే అనూహ్య స్పందన వచ్చింది.. ఒక్కరోజే ఏకంగా 7 లక్షల 46 వేల 414 దరఖాస్తులు వచ్చాయి. వరుస కార్యక్రమాల్లో పాల్గొంటున్న సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..
తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఆరు గ్యారెంటీ పథకాల హామీ ఇచ్చారు. అధికారం లోకి వచ్చిన వెంటనే సీఎం రేవంత్ రెడ్డి తొలి సంతకం దానిపైనే చేశారు. అంతేకాదు ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. ఇక ప్రజాపాలన కార్యక్రమ ద్వారా డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాల కోసం దరఖాస్తులు చేసుకునే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి భారీ స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మద్యనే అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆయన జ్వరం, దగ్గు, గొంతు నొప్పితో బాధపడగా.. ఇంటివద్దే ఫ్యామిలీ డాక్టర్లు ఆయనను పరీక్షించి మెడిసన్లు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.
వరుస కార్యక్రమాల్లో బిజీగా ఉండటం, చలి వాతావరణం ప్రభావంతో మరోసారి ఆయన స్వల్ప అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఆయన శుక్రవారం జూబ్లీ హిల్స్ లోని తన నివాసంలో రెస్ట్ తీసుకున్నట్లు తెస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అభయహస్తం కింద ఆరు గ్యారెంటీ పథకాలైన మహాలక్ష్మి, చేయూత, రైతు భరోసా, గృహ జ్యోతి, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన దరఖాస్తులను అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో విద్యాశాఖ పనితీరుపై రేవంత్ రెడ్డి.. స్కూల్, కాలేజ్ తో పాటు హయ్యర్ ఎడ్యూకేషన్ అధికారులతో సమగ్రంగా చర్చించేందుకు శనివారం సమావేశం కాబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి లేకపోవడంతో ముఖ్యమంత్రి ఆ శాఖ పనితీరుపై రివ్యూ చేయడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.