నిరుద్యోగులకు CM రేవంత్ గుడ్ న్యూస్.. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాలు

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. త్వరలో పోలీస్ శాఖలో 15 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ అందించారు. త్వరలో పోలీస్ శాఖలో 15 వేల పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.

తెలంగాణలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ అన్ని వర్గాల అభిృద్ధే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతోంది. ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు రచిస్తోంది రేవంత్ సర్కార్. ముఖ్యంగా గత ప్రభుత్వంలో నిరాశ నిస్పృహలకు గురైన నిరుద్యోగులకు ఊరటనిచ్చేలా సీఎం రేవంత్ ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించారు. ఇటీవల ఉద్యోగాల భర్తీపై సంబంధిత అధికారులతో సమీక్ష చేసిన సీఎం రేవంత్ ఏవిధమైన అవకతవకలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేపట్టాలని ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణలో త్వరలోనే ఉద్యోగాల జాతర మొదలుకానుంది.

నిరుద్యోగులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభవార్తను అందించారు. త్వరలో పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే 15,000 పోలీసు ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సీఎం రేవంత్ తెలిపారు. సీఎం ప్రకటనతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ ఉద్యోగాలతో పాటు ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సీఎం రేవంత్ వెల్లడించారు. గతంలో ఉద్యోగాల భర్తీలో అవకతవకలకు కేంద్రంగా నిలిచిన టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేశామని తెలిపారు. దీనిలో భాగంగా కొత్త చైర్మన్‌, సభ్యులను నియమించామని అన్నారు.

త్వరలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేస్తామని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. ఇక నిన్న(బుధవారం) ఎల్బీ స్టేడియంలో స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు అందించేందుకు కార్యక్రమం ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైజరైన సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ఎంపికైన 6,956 మంది స్టాఫ్‌ నర్సులకు నియామకపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య తెలంగాణ నిర్మిచడంలో స్టాఫ్‌ నర్సులే కీలకమని సీఎం రేవంత్ తెలిపారు.

Show comments