బ్రేకింగ్: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ దశాబ్దకాలం పాటు పరిపాలన కొనసాగించింది. ఈ మధ్య తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోె కాంగ్రెస్ గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ దశాబ్దకాలం పాటు పరిపాలన కొనసాగించింది. ఈ మధ్య తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోె కాంగ్రెస్ గెలిచి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించి కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలం పాటు బీఆర్ఎస్ పరిపాలన కొసాగించింది. ప్రచార సమయంలో ప్రజల నమ్మకాన్ని పొందలేక ఓటమి పాలయ్యింది. కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చాటుకుంటున్నారు. గత ప్రభుత్వం నిర్ణయాలు లపై సమీక్షలు నిర్వహిస్తు.. సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే గతంలో బీఆర్ఎస్ నేతలు ఏదైనా అక్రమాలకు పాల్పపడితే.. వారి విషయంలో ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుందని సీఎం చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే..

మాజీ బీఆర్ఎస్ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పై శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసు తో పాటు 420 చీటింగ్ కేసు నమోదైంది. గంగారామ్ నే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు రిజిస్ట్రర్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 47 ఎకరాల గిరిజనుల భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని, ఎన్నికల సమయంలో రాత్రికి రాత్రే గిరిజనులును భయపెట్టి, బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని బాధిత గిరిజనులు శామీర్ పేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో మల్లారెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాదు మల్లారెడ్డితో ఈ వ్యవహారానికి సహకరించిన శామీర్ పేట్ తహశీల్దార్, ఆయన అనుచరులు తొమ్మిది మందిపై కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని రంగంలోకి దిగిన అధికారలుు ఈ వివాదంపై విచారణ ప్రారంభిచినట్లు తెలుస్తుంది.

గతంలో కూడా మల్లారెడ్డిపై భూ ఆక్రమణలపై పలు కేసులు నమోదు అయిన విషయం తెలిసిందే. మల్లారెడ్డికి సంబంధించిన రెండు హాస్పిటల్స్ కి మధ్య ఉన్న భూమిని కబ్జా చేసేందుకు యత్నించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇతరుల భూములు ఆక్రమించడమే కాదు.. అధికారుల సహకారంతో వాటికి సంబంధించిన నకిలీ పత్రాలు సృష్టించి భూములు కబ్జా చేసినట్లు గతంలో మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments