Dharani
Bhatti Vikramarka-New Ration Cards After Aug 15th: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
Bhatti Vikramarka-New Ration Cards After Aug 15th: కొత్త రేషన్ కార్డుల పంపిణీపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. ఆ వివరాలు..
Dharani
రేషన్ కార్డు.. మన దేశంలో చాలా మందికి ఇది ప్రాణవాయువు లాంటిది. ప్రభుత్వం అందించే అనేక పథకాలకు రేషన్ కార్డు కీలకం. దీని ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. తాము ప్రవేశపెట్టిన అనేక పథకాలకు సంబంధించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఆరోగ్య శ్రీ, ఫీజు రీయంబర్స్‌మెంట్, ఇల్లు కావాలంటే రేషన్ కార్డు ఉండాల్సిందే. కీలకమైన పథకాలకు రేషన్ కార్డు ప్రమాణీకంగా మారింది. రేషన్ కార్డుని కేవలం దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇస్తారు. ఇది ఉన్నవారికి.. రేషన్ దుకాణాల్లో బియ్యం, పప్పు, ఉప్పు, నూనె వంటి పదార్థాలను అతి తక్కువ ధరకే అందజేస్తారు. ప్రస్తుతం రేషన్ కార్డు మీద కుటుంబంలోని ఒక్కో వ్యక్తికి ఆరు కేజీల బియ్యం ఉచితంగా అందిస్తున్నారు.
రేషన్‌తో పాటు.. ఇతర సంక్షేమ పథకాలు పొందాలన్నా.. రేషన్ కార్డే ప్రమాణీకం. అయితే తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత.. ఈ పదేళ్ల కాలంలో ఇప్పటి వరకు కొత్తగా ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదు. ఇక తాజాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తామని ప్రకటించింది. అందుకు తగ్గట్టుగానే.. ప్రజాపాలన ద్వారా.. కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దరఖాస్తులు స్వీకరించింది. లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలో అమలవుతోన్న ఆరు గ్యారెంటీలు అందుకోవాలంటే.. రేషన్ కార్డు ప్రధానం. ఉచిత కరెంట్, 500 రూపాయలకు గ్యాస్, ఇందిరమ్మ ఇల్లు, ఆరోగ్యశ్రీ రావాలంటే రేషన్ కార్డే కీలకం. అందుకే కొత్త రేషన్‌కార్డుల కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దీనిపై తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. రేషన్ కార్డుల జారీ తేదీ రివీల్ చేశారు. ఆ వివరాలు..
తాజాగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీపై కీలక ప్రకటన చేశారు. త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తామన్నారు. అసెంబ్లీలో కొత్త రేషన్ కార్డుల పంపిణీపై ప్రశ్నించగా.. అందుకు భట్టి బదులిస్తూ.. ఇప్పటికే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉన్నట్లు తెలిపారు. దీనిపై క్యాబినెట్ సబ్ కమిటీ వేసినట్లు పేర్కొన్నారు.
త్వరలోనే రేషన్ కార్డుల జారీకి సబంధించి మార్గదర్శాలు, విధివిధానాల గురించి చర్చించి.. ఆ తర్వాత పంపిణీ మొదలు పెడతాము అన్నారు. అంతేకాక ఆగస్టు 15 వరకు రైతు రుణమాఫీ ప్రక్రియ జరుగుతుందని.. అది ముగిసిన వెంటనే రేషన్ కార్డుల మంజూరు కార్యక్రమం ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రజాపాలన ద్వారా వచ్చిన దరఖాస్తుల్లో అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు చెప్పుకొచ్చారు.