సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆటో డ్రైవర్ నామినేషన్! ఆయన స్టోరీ ఇదే!

సామాన్యులు ఎన్నికల్లో నామినేషన్లు వేయడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ఇంకా చెప్పాలంటే కూలీ చేసుకునే వాళ్లు, రైతులు, బిచ్చగాళ్లు సైతం పలు ఎన్నికలలకు నామినేషన్లు వేసిన సందర్భాలు అనేక  ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఓ ఆటో డ్రైవర్ పోటీ చేయనున్నారు.

సామాన్యులు ఎన్నికల్లో నామినేషన్లు వేయడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ఇంకా చెప్పాలంటే కూలీ చేసుకునే వాళ్లు, రైతులు, బిచ్చగాళ్లు సైతం పలు ఎన్నికలలకు నామినేషన్లు వేసిన సందర్భాలు అనేక  ఉన్నాయి. తాజాగా సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి ఓ ఆటో డ్రైవర్ పోటీ చేయనున్నారు.

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సందడి కనిపిస్తుంది. రెండు రాష్ట్రాలకు చెందిన అన్ని ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తున్నాయి. ఇక నామినేషన్లు ఈ రోజే చివరి రోజు కావడంతో అభ్యర్థులు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయానికి క్యూ కడుతున్నారు. ఈ రోజే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేగా నామినేషన్ దాఖలు చేశారు. అలానే మరికొందరు అభ్యర్థులు నామినేషన్ లు దాఖలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలోని సికింద్రబాద్ పార్లమెంట్ కు ఓ ఆటో డ్రైవర్ నామినేషన్ వేశారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

గతేడాది డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. ఆ  ఎన్నికల సమరం ముగిసిన కొన్ని నెలలకే లోక్ సభ ఎన్నికల సమరం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సికింద్రాబాద్, మల్కాజ్ గిరి, హైదారాబాద్ పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. ఇక సికింద్రాబాద్  నుంచి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి పోటీలో ఉన్నారు. అలానే అధికార కాంగ్రెస్ నుంచి దానం నాగేందర్ ఉన్నారు. ఇది ఇలా ఉంటే ఇదే స్థానం నుంచి ఓ సామాన్యుడు నామినేషన్ దాఖలు చేశాడు. ఓ ఆటో డ్రైవర్ సికింద్రాబాద్ లోక్ సభ స్థానానికి నామినేషన్ వేశారు.

సామాన్యులు ఎన్నికల్లో నామినేషన్లు వేయడం మనం చాలా సందర్భాల్లో చూశాం. ఇంకా చెప్పాలంటే కూలీ చేసుకునే వాళ్లు, రైతులు, బిచ్చగాళ్లు సైతం పలు ఎన్నికలలకు నామినేషన్లు వేసిన సందర్భాలు అనేక  ఉన్నాయి. అలానే నామినేషన్ వేసే సమయంలో వెరైటీగా ఆఫీస్ కు వచ్చి.. అభ్యర్థులు నామినేషన్లు వేస్తుంటారు. ఇటీవలే యూపీలో బండిపై సమోసాలు అమ్ముకునే ఓ వ్యక్తి కూడా స్థానిక పార్లమెంట్ స్థానం నుంచి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఆ సమయంలో ఆయన చెప్పిన మాటలు అందరిని ఆకట్టుకున్నాయి. తాజాగా సమోసా బండి నడుపుకునే వ్యక్తి మాదిరిగానే తెలంగాణ రాష్ట్రంలో ఓ ఆటో డ్రైవర్ నామినేషన్  వేశారు.

సికింద్రాబాద్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా మహ్మద్ ఇబ్రహీం ఆటో డ్రైవర్ నామినేషన్ దాఖలు చేశారు. వారసిగూడకు చెందిన మహ్మద్  ఇబ్రహీం నిత్యం ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఆయనక ఆటో నడుపుతూనే కుటుంబ పోషణ గడుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడికి ఎలాంటి న్యాయంచేయడం లేదని అందుకోసమే తాను నామినేషన్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు. సామాన్యుడినైనా తనను ప్రజలు ఆశీర్వదించి పార్లమెంట్ కు  పంపిస్తే ప్రజల కోసం పోరాటం చేస్తానని చెప్పారు. మరి.. ఇలా ఎన్నికల్లో పోటీ చేసే సామాన్యుల సంఖ్యంగా బాగా పెరుగుతోంది.

Show comments