సాయం చేస్తానని స్టేషన్‌కి పిలిచిన SI.. ఆపై అలా చేయడంతో..

తనకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే.. సాయం చేస్తానని పిలిచి సీఐ.. చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో బాధితుడు ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్థానికంగా ఈ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది.

తనకు అన్యాయం జరిగిందని పోలీసులను ఆశ్రయిస్తే.. సాయం చేస్తానని పిలిచి సీఐ.. చిత్రహింసలకు గురి చేశాడు. దీంతో బాధితుడు ఆత్మహత్య లేఖ రాసి అదృశ్యమయ్యాడు. స్థానికంగా ఈ మిస్సింగ్ కేసు సంచలనం సృష్టిస్తోంది.

ప్రజలు.. తమకు ఏదైనా అన్యాయం జరుగుతుందంటే తొలుత ఆశ్రయించేది పోలీసులనే. ఏ సమయంలో కష్టం వచ్చినా తమను ఆదుకునేది వాళ్లేనని భావిస్తుంటారు. అక్కడకు వెళితే న్యాయం జరుగుతుందన్న భావన జనాల్లో బలంగా ఉంది. కానీ సినిమాల ప్రభావం వల్ల పోలీసులను చూస్తేనే భయపడిపోతున్నారు. కొంత మంది అవినీతి పోలీసుల కారణంగా ఆ మొత్తం వ్యవస్థకు కూడా చెడ్డ పేరు వస్తూ ఉంటుంది. అయినప్పటికీ పోలీసులపై నమ్మకంతో.. తమకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో పోలీస్ స్టేషన్ మెట్లెక్కుతున్నారు ప్రజలు. కానీ హసన్ పర్తి పోలీస్ స్టేషన్ సీఐ సాయం కోరి వచ్చిన వ్యక్తిని హింసించడంతో బాధితుడు దారుణ నిర్ణయం తీసుకున్నాడు.

సూసైడ్ నోట్ రాసి.. అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం ఈ మిస్సింగ్ స్థానికంగా చర్చనీయాంశమైతోంది. దీంతో అతడి భార్య సీపీకి ఫిర్యాదు చేయడంతో పాటు తన భర్తకు ఏదైనా జరిగిందంటే.. హాసన్ పర్తి పోలీస్ స్టేషన్ సీఐ కారణమంటూ వీడియోలో పేర్కొంది. ఇంతకు వీడియోలో ఆమె తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. హనుమకొండ జిల్లాలోని హనన్ పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో భార్యా భర్తలు ప్రశాంత్ కుమార్, శ్యామల జీవిస్తున్నారు. వంగపాడు గ్రామానికి చెందిన ముసుగు వీరేశం అనే వ్యక్తికి ప్రశాంత్ కొంత డబ్బు అప్పు రూపంలో ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరగా.. వీరేశం చంపేస్తానంటూ ప్రశాంత్‌ను బెదిరించాడు. దీంతో ఏం చేయాలో తోచక డయల్ 100 కాల్ చేసి పోలీసుల సాయం కోరాడు. కానీ ఏ సాయం అందలేదు. దీంతో అతడు హసన్ పర్తి సీఐను ఆశ్రయించాడు.

సాయం చేస్తానని చెప్పి.. పోలీస్ స్టేషన్‌కు రమ్మనారు సీఐ. ప్రశాంత్ అక్కడకు వెళ్లాక..తన ఫోన్, వాచ్ లాక్కొని, అతడిని చిత్ర హింసలకు గురి చేశారు. దౌర్జన్యంగా కొట్టారు. ఈ అవమానాన్ని తట్టుకోలేక పోయిన ప్రశాంత్ ఆత్మహత్య లేఖ రాసి.. ఇంట్లో నుండి వెళ్లిపోయాడు. ఆ ఆత్మహత్య లేఖలో వివరాలన్నీ పొందు పరిచాడు ప్రశాంత్. దీంతో  ఆవేదన చెందుతోంది భార్య శ్యామల. తన భర్తకు ఏదైనా జరిగితే హసన్ పర్తి సీఐ యే కారణమని ప్రశాంత్ భార్య వాపోతుంది. కాగా, తమకు న్యాయం చేయాలంటూ సీపీకి ఫిర్యాదు చేసింది. కాగా, ఇప్పుడు ప్రశాంత్ మిస్సింగ్ ఇప్పుడు స్థానికంగా సంచలనం కలిగిస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు.. బాధితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Show comments