Now Send Voice Message To Meta AI: ఇక వాయిస్ మెసేజులతోనూ మెటా ఏఐతో చాట్ చేయచ్చు! వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌

ఇక వాయిస్ మెసేజులతోనూ మెటా ఏఐతో చాట్ చేయచ్చు! వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్‌

WhatsApp Brings New Voice Message Feature To Chat With Meta AI: వాట్సాప్ యూజర్స్ అభిరుచికి తగ్గట్టు, యూజర్స్ అటెన్షన్ ని డ్రా చేసేలా సరికొత్త ఫీచర్స్, అప్డేట్స్ తో వస్తుంది. తాజాగా వాట్సాప్ సరికొత్త ఫీచర్ పై పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై పని చేస్తుంది. ఈ ఫీచర్ వస్తే పని మరింత సులువు కానుంది.

WhatsApp Brings New Voice Message Feature To Chat With Meta AI: వాట్సాప్ యూజర్స్ అభిరుచికి తగ్గట్టు, యూజర్స్ అటెన్షన్ ని డ్రా చేసేలా సరికొత్త ఫీచర్స్, అప్డేట్స్ తో వస్తుంది. తాజాగా వాట్సాప్ సరికొత్త ఫీచర్ పై పని చేస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ పై పని చేస్తుంది. ఈ ఫీచర్ వస్తే పని మరింత సులువు కానుంది.

వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్ ని, అప్డేట్స్ ని తీసుకొస్తుంది. యూజర్స్ కి అనుగుణంగా, అభిరుచికి తగ్గట్టు బెస్ట్ ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇప్పటికే మెటా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో మెటా ఏఐ ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంకా డెవలప్మెంట్ దశలో ఉంది. మరిన్ని ఫీచర్స్ ని డెవలప్ చేస్తుంది. ప్రస్తుతానికైతే అడిగిన సమాచారాన్ని ఇస్తుంది. సెర్చ్ ఇంజిన్ లా పని చేస్తుంది. ఏ రంగానికి సంబంధించిన సమాచారాన్ని అయినా అందిస్తుంది. పదాలను, వాక్యాలను అనువాదం చేస్తుంది. అనేక భాషల్లో ఇది అందుబాటులో ఉంది. అయితే తెలుగు భాషలో ఇన్పుట్స్ ఇస్తే మాత్రం ఫలితాలు ఇవ్వడం లేదు. మెటా సంస్థ తెలుగు సహా అన్ని భాషల్లో మెటా ఏఐని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

ఇక మెటా ఏఐలో ఇమాజిన్ మీ అనే కొత్త ఫీచర్ ని తీసుకొస్తున్నట్లు మార్క్ జుకర్ బర్గ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్ తో ఎవరైనా తమను తాము నచ్చినట్టు ఊహించుకోవచ్చు. ఆ ఊహించిన ఇమేజ్ ని మెటా ఏఐ ప్రదర్శిస్తుంది. ఈ ఫీచర్ గురించి తెలుసుకునేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.తాజాగా వాట్సాప్ మెటా ఏఐతో మరింత సులువుగా సంభాషించేలా మరో కొత్త ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ఫోటోలకి రిప్లై ఇచ్చేలా, అలానే ఫోటోలను ఎడిట్ చేసేలా మెటా ఏఐని డెవలప్ చేస్తుంది. ఈ ఫీచర్ వస్తే మీరు మెటా ఏఐకి పంపిన ఫోటోలకి, అలానే మెటా ఏఐ మీకు పంపిన ఫోటోలకి రిప్లై ఇస్తుంది. ప్రస్తుతం అయితే చాట్ టెక్స్ట్ వరకూ రిప్లై వర్క్ అవుతుంది. ఇమేజ్ లకి రిప్లై ఇచ్చి సమాచారం కావాలని అడిగితే స్పందించడం లేదు.

ప్రస్తుతం ఈ ఫీచర్ మీద వాట్సాప్ పని చేస్తుంది. ఫోటోలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని గుర్తించేలా, ఇమేజెస్ లో ఉన్న సందర్భాన్ని గురించి మెటా ఏఐని అడిగితే సమాధానం చెప్పేలా ఫీచర్ ని డెవలప్ చేస్తుంది. అదనంగా యూజర్లు ఫోటోలను చాట్ విండోలోనే క్విక్ ఎడిట్స్, అడ్జస్ట్ మెంట్స్ చేసుకోవచ్చు. అదనంగా మరొక ఫీచర్ ని కూడా తీసుకొస్తుంది. ఇన్నాళ్లు మెటా ఏఐని ఏదైనా సమాచారం అడగాలంటే టెక్స్ట్ ప్రాంప్ట్ ఇవ్వాల్సి వచ్చేది. టెక్స్ట్ టైప్ చేస్తే దానికి మెటా ఏఐ స్పందించేది. అయితే ఇప్పుడు మెటా ఏఐతో వాయిస్ మెసేజెస్ ని షేర్ చేసుకోవచ్చు.

మీ వాయిస్ ని రికార్డ్ చేసి పంపిస్తే అది మన వాయిస్ ని విని దానికి తగ్గ సమాచారాన్ని అందిస్తుంది. ప్రస్తుతం వాట్సాప్ ఈ ఫీచర్ ని డెవలప్ చేస్తున్నట్లు వాట్సాప్ బీటా ఇన్ఫో తెలిపింది. అంటే మీరు కాంటాక్ట్ లిస్ట్ లో ఉన్న వారికి వాయిస్ మెసేజ్ లు పంపుతున్నట్టే మెటా ఏఐకి కూడా వాయిస్ మెసేజులు పంపవచ్చు. ఫ్యూచర్ లో సాధారణ చాట్ లో ఉన్న ఫీచర్స్ అన్నీ మెటా ఏఐ చాట్ బాట్ లో తీసుకొస్తుందేమో చూడాలి. ఇప్పటివరకూ టెక్స్ట్ మెసేజులతో మ్యాజిక్ చేసిన యూజర్స్ ఇక వాయిస్ తోనూ మ్యాజిక్ చేయవచ్చునన్న మాట. ఇది కదా అప్డేట్ అంటే!

Show comments