Vinay Kola
Vivo Y300 Pro: వివో తన లేటెస్ట్ వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చైనా దేశంలో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ ప్రకటించింది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి కూడా రాబోతుంది.
Vivo Y300 Pro: వివో తన లేటెస్ట్ వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే చైనా దేశంలో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ ప్రకటించింది. త్వరలో ఇండియన్ మార్కెట్లోకి కూడా రాబోతుంది.
Vinay Kola
వివో కంపెనీ తన లేటెస్ట్ సూపర్ మోడల్ వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్ ని లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే అది చైనా దేశంలో లాంచ్ చేస్తున్నట్లు ఈ ఫోన్ ప్రకటించింది. అతి త్వరలో ఇండియన్ మార్కెట్లోకి కూడా రాబోతుంది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు అదిరిపోయే విధంగా ఉన్నాయి. ఇది 6.77 ఇంచెస్ 120Hz 3D అమోల్డ్ డిస్ప్లే కలిగి ఉంటుంది. ఈ డిస్ప్లే 5000 నైట్స్ దాకా పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కొం స్నాప్ డ్రాగన్ 6 జెన్ 1 SoC తో పని చేస్తుంది. దీనికి 12 జీబీ దాకా ర్యామ్ ఉంటుంది. ఈ ఫోన్ 52 మెగా పిక్సల్ బ్యాక్ కెమెరా కలిగి ఉంటుంది. 32 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంటుంది.
వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్లో ఇంకో ఆకట్టుకునే అంశం ఏమిటంటే.. ఇది వాటర్ ప్రూఫ్, డస్ట్ ప్రూఫ్ మొబైల్. ఈ ఫోన్ ఏకంగా 12 గంటల పాటు వాన చినుకులు తట్టుకునే సామర్ధ్యం కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇది IP65 డస్ట్ అండ్ వాటర్ ప్రూఫ్ తో వస్తుంది. ఈ ఫోన్ కేవలం 7.69 మీ.మీ. మందం కలిగి ఉంటుంది. ఇందులో అన్నిటి కంటే ఆకట్టుకునే అంశం ఏంటంటే.. దీని బ్యాటరీ అనే చెప్పాలి. ఈ బ్యాటరీ ఏకంగా 6500 ఎంఏహెచ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. ఇప్పటి దాకా వివో కంపెనీ ప్రవేశపెట్టిన పవర్ఫుల్ బ్యాటరీ ఇదే కావడం విశేషం. ఇది 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఈ బ్యాటరీపై కంపెనీ 5 ఇయర్స్ వారంటీ సర్వీస్ అందిస్తుంది.
ఇక వివో వై300 ప్రో స్మార్ట్ ఫోన్ ఇంటర్నల్ స్టోరేజ్ విషయానికి వస్తే.. ఇది 128GB / 256GB / 512GB (UFS2.2) ఇంటర్నల్ స్టోరీజి కలిగి ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ కలర్స్ విషయానికి వస్తే.. ఇది బ్లాక్, వైట్, గోల్డ్ అండ్ టైటానియం కలర్స్ తో లాంచ్ అయ్యింది. ఇక త్వరలో ఈ ఫోన్ ఇండియాలో కూడా లాంచ్ కానున్నట్లు తెలుస్తుంది. దీని ధర విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ ధర 21 వేల నుంచి 30 వేల మధ్య ఉండే అవకాశం ఉంది. వేరియంట్ల బట్టి దీని ధర మారుతూ ఉంటుంది. ఇక చైనాలో ఈ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 14 నుంచి స్టార్ట్ అవుతాయి. మరి సూపర్ బ్యాటరీ కెపాసిటీ గల ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.