Top Foldable Smartphones: మార్కెట్లో టాప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్.. ఏది తక్కువ ధరకు వస్తుందంటే?

మార్కెట్లో టాప్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్.. ఏది తక్కువ ధరకు వస్తుందంటే?

Top Foldable Smartphones: పెద్ద స్క్రీన్ టూ చిన్న స్క్రీన్ కలిగిన ఫోల్డబుల్ ఫోన్స్ ఒకవైపు, స్మార్ట్ ఫోన్ లో సగం సైజులో ఉండేలా ఫ్లిప్ ఫోన్లు మరోవైపు.. ఈ రెండు రకాల ఫోన్లు ఇప్పుడు అందరి అటెన్షన్ ని డ్రా చేస్తున్నాయి. అయితే మార్కెట్లో టాప్ బ్రాండెడ్ ఫోన్లు ఏవి? వీటిలో ఏది తక్కువ ధరకే వస్తుంది? అనే వివరాలు మీ కోసం.

Top Foldable Smartphones: పెద్ద స్క్రీన్ టూ చిన్న స్క్రీన్ కలిగిన ఫోల్డబుల్ ఫోన్స్ ఒకవైపు, స్మార్ట్ ఫోన్ లో సగం సైజులో ఉండేలా ఫ్లిప్ ఫోన్లు మరోవైపు.. ఈ రెండు రకాల ఫోన్లు ఇప్పుడు అందరి అటెన్షన్ ని డ్రా చేస్తున్నాయి. అయితే మార్కెట్లో టాప్ బ్రాండెడ్ ఫోన్లు ఏవి? వీటిలో ఏది తక్కువ ధరకే వస్తుంది? అనే వివరాలు మీ కోసం.

భవిష్యత్తు అంతా ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్లదే అని టెక్ నిపుణులు చెబుతున్నారు. పెద్ద స్క్రీన్, చిన్న స్క్రీన్ ఏది కావాలంటే అది చేసుకునేలా ఉండడం, జేబులో ఇమిడిపోయేలా చిన్న సైజులో ఉండడం వంటి కారణాల వల్ల ఈ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్ లు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి. అయితే ఈ ఫోల్డబుల్, ఫ్లిప్ ఫోన్స్ లో టాప్ బ్రాండ్ ఏది? ఏది తక్కువ ధరకి లభిస్తుంది? వంటి వివరాలు మీ కోసం.  

వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో:

ఇది కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్. ఫోల్డబుల్ కెమెరా డివైజ్. దీని స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్ కారణంగా ఇది శామ్ సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5, వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్స్ కి గట్టి పోటీ ఇస్తుంది. దీని మరో ప్రత్యేకత ఏంటంటే.. ఫోల్డింగ్ ఫోన్స్ లోనే అతి ఎక్కువ బ్యాటరీ సామర్థ్యంతో ఇది రావడం. 5700 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. దీని అసలు ధర రూ. 1,69,999 కాగా ఆన్ లైన్ లో ధర రూ. 1,59,999గా ఉంది. వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.   

గెలాక్సీ జడ్ ఫోల్డ్5:

మార్కెట్లో ప్రస్తుతం యూజర్స్ ని బాగా ఆకర్షిస్తున్న స్మార్ట్ ఫోన్ ఇది. బిజినెస్ యూజర్స్ కి బెస్ట్ ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ గా ఉంది. జనరేటివ్ ఏఐ టెక్నాలజీతో వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్.. విస్తృత స్థాయిలో గెలాక్సీ ఏఐ సామర్థ్యాలను సపోర్ట్ చేస్తుంది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఆపరేటింగ్ సిస్టం మీద వన్ యూఐ 6.1 ని రన్ చేస్తుంది. స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 గెలాక్సీ ఎస్23 అల్ట్రా కంటే పవర్ ఫుల్ స్మార్ట్ ఫోన్ గా ఉంది. దీని ధర రూ. 1,59,999గా ఉంది. అమెజాన్ లో రీఫర్బిష్డ్ జడ్ ఫోల్డ్ 5 ధర 1,20,998 రూపాయలు పడుతుంది. శామ్ సంగ్ గెలాక్సీ జడ్ ఫోల్డ్ 5 స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.     

వన్ ప్లస్ ఓపెన్:

హై ఎండ్ అపీరెన్స్ ఫోల్డబుల్ ఫోన్ కోసం ఎదురుచూసే వారికి వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ బెస్ట్ ఆప్షన్. పెరిస్కోప్ జూమ్ లెన్స్ తో వన్ ప్లస్ నుంచి వచ్చిన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్ ఇది. దీని అసలు ధర రూ. 1,49,999 కాగా ఆఫర్ లో రూ. 1,39,999కే అందుబాటులో ఉంది. వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.     

గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5:

శామ్ సంగ్ గెలాక్సీ ఫోల్డ్ 5, వివో ఎక్స్ ఫోల్డ్ 3 ప్రో స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే ఈ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 ఫోన్ కాస్త బడ్జెట్ అనే చెప్పవచ్చు. స్టైలిష్ స్మార్ట్ ఫోన్ కోసం చూసేవారికి జడ్ ఫ్లిప్ 5 ఫోన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఇది కూడా స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఐపీఎక్స్8 రేటింగ్ వచ్చింది. రీఫర్బిష్డ్ జడ్ ఫ్లిప్ 5 ఫోన్ అసలు ధర రూ. 1,02,999 కాగా ఆఫర్లో రూ. 75,998కే లభిస్తుంది. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.     

మోటోరోలా రేజర్ 40:

మిగతా ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ తో పోలిస్తే ఏ మోటోరోలా రేజర్ ధర రీజనబుల్ అని చెప్పుకోవాలి. ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్ అన్నిటికంటే ఇదే తక్కువ ధర కలిగి ఉంది. ఇది స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది 4,200 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. క్విక్ వైర్ అండ్ వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. ఫోల్డబుల్ ఫోన్ కొనాలి అని అనుకునేవారికి ఈ మోటోరోలా రేజర్ 40 ఒక ఉత్తమ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఈ మోటోరోలా రేజర్ 40 ఫ్లిప్ ఫోన్.. శామ్ సంగ్ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 5 ఫోన్ లానే ఉంటుంది. దీని అసలు ధర రూ. 99,999 కాగా ఆఫర్ లో రూ. 44,999కే లభిస్తుంది. మోటోరోలా రేజర్ 40 ఫ్లిప్ ఫోన్ స్మార్ట్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.          

గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3:

ఫోల్డబుల్ ఫోన్స్ లో మోటోరోలా రేజర్ 40 తర్వాత బడ్జెట్ లో దొరికే ఫోన్స్ లో ఈ గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 ఫోన్ ఒకటి. క్వాల్ కామ్ ఎస్ఎం8350 స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్ తో వస్తుంది. దీని అసలు ధర రూ. 95,999 ఉండగా ఆఫర్ లో రూ. 44,999కే సొంతం చేసుకోవచ్చు. గెలాక్సీ జడ్ ఫ్లిప్ 3 ఫోన్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై కిక్ చేయండి.

Show comments