భారీగా పెరగనున్న ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్.. కారణం ఏంటంటే?

మొబైల్ ఫోన్ వాడే వారికి టెలికాం కంపెనీలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలో భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ప్లాన్ ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే?

మొబైల్ ఫోన్ వాడే వారికి టెలికాం కంపెనీలు షాక్ ఇవ్వబోతున్నాయి. త్వరలో భారీగా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఇంతకీ ప్లాన్ ధరలు పెరగడానికి గల కారణం ఏంటంటే?

స్మార్ట్ ఫోన్ మానవ జీవితంలో భాగమైపోయింది. నిద్ర లేచింది మొదలు మళ్లీ పడుకునేంత వరకు ఫోన్ తోనే గడిపేస్తున్నారు. ఏ పని జరగాలన్నా ఫోన్ కీలకంగా మారింది. ఏదైనా సమాచారం అందించాలన్నా.. పొందాలన్నా ఫోన్ ద్వారా క్షణాల్లోనే పని జరిగిపోతుంది. కాల్స్ మాట్లాడుకునేందుకు, ఎంటర్ టైన్ మెంట్ వీడియోలు, సినిమాలు చూసేందుకు ఫోన్ల వాడకం ఎక్కువైపోయింది. అయితే ఈ సౌకర్యాలను వినియోగించాలంటే మొబైల్ నెంబర్ కు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. అయితే త్వరలోనే మొబైల్ ఫోన్లు వాడే వారికి టెలికాం కంపెనీలు బిగ్ షాక్ ఇవ్వబోతున్నాయని తెలుస్తోంది. ఫోన్ రీఛార్జ్ ప్లాన్స్ ను భారీగా పెంచేందుకు ప్లాన్ చేస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచనుండడానికి కారణం ఏంటంటే?

ప్రస్తుతం నెల రోజుల వ్యవధికి రీఛార్జ్ చేయాలంటే దాదాపు 300 వెచ్చించాల్సి ఉంటుంది. టెలికాం కంపెనీలన్నింటిలో ఇదే పరిస్థితి. ఎయిర్ టెల్, జియో, వొడఫోన్ ఐడియా అన్నింటిలో రీఛార్జ్ ప్లాన్ ధరలు ఎక్కువగానే ఉన్నాయి. అయితే నిర్వహణ ఖర్చులు పెరగడంతో ఆదాయాలను పెంచుకునేందుకు మొబైల్ యూజర్ల నెత్తిన భారం మోపనున్నాయి టెలికాం కంపెనీలు. 5జీపై దృష్టి పెట్టిన కంపెనీలు ఖర్చులను భర్తీ చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు చూస్తున్నాయి టెలికాం కంపెనీలు.

టెక్నాలజీపై భారీగా పెరిగిన పెట్టుబడితో మొబైల్ కనెక్షన్‌పై సగటు ఆదాయం క్షీణించినట్లు కంపెనీలు చెబుతున్నాయి. దీంతో మొబైల్ రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. అయితే ఛార్జీల పెంపు ప్రస్తుత ధరల కంటే 25 శాతం వరకు పెరగొచ్చని సమాచారం. కంపెనీల నిర్ణయంతో మొబైల్ యూజర్ల జేబులకు ఖాయమంటున్నారు నిపుణులు. ప్రస్తుతం ఫోన్ నెంబర్ యాక్టివ్ గా ఉండాలంటే రీఛార్జ్ తప్పనిసరిగా చేయాల్సిందే. రీఛార్జ్ చేయకపోతే అవుట్ గోయింగ్ కాల్స్ కూడా చేయలేరు. ఇక రీఛార్జ్ ప్లాన్ ధరలు పెరగనున్న నేపథ్యంలో కొందరు ముందుగానే వార్షిక ప్లాన్ లను రీఛార్జ్ చేయించుకుంటున్నారు.

Show comments