Dharani
Moto G04: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మోటో మీ కోసం భారీ బంపరాఫర్ ప్రకటించింది. సుమారు ఏడు వేల రూపాయల ఖరీదైన ఫోన్‌ను 1749 రూపాయలకే పొందవచ్చు. ఆ వివరాలు..
Moto G04: స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. మోటో మీ కోసం భారీ బంపరాఫర్ ప్రకటించింది. సుమారు ఏడు వేల రూపాయల ఖరీదైన ఫోన్‌ను 1749 రూపాయలకే పొందవచ్చు. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో చేతిలో ఫోన్ లేకుండా బయటకు అడుగుపెట్టడం అంటే.. కారు చీకట్లో కారడవిలో చిక్కుకున్నట్లే. అంతలా స్మార్ట్ ఫోన్ మన జీవితాల్లో భాగం అయ్యింది. చేతిలో మొబైల్ లేకపోతే.. ఏదో పొగొట్టుకున్న ఫీలింగ్. ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే. కరోనా తర్వాత ఆన్‌లైన్ క్లాసుల వల్ల పిల్లలకు కూడా మొబైల్ వాడకం తప్పనిసరి అయ్యింది. గత రెండేళ్లుగా మన దేశంలో స్మార్ట్ ఫోన్‌ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ఇక కస్టమర్లను ఆకర్షించడం కోసం మొబైల్ కంపెనీలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా మోటో కంపెనీ భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఏడువేల రూపాయల ఖరీదైన ఫోన్‌ను రూ.1,749కే పొందే అవకాశం కల్పిస్తుంది. ఆ వివరాలు..
మోటరోలా కంపెనీ తాజాగా మోటో జీ04 ఫోన్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. రెండు వేరియంట్‌లలో లభిస్తోన్న ఈ ఫోన్ ధర రూ.6,999, రూ.7,499 ఉంది. ప్రస్తుతం వీటిని ఆన్‌లైన్ రిటైల్ స్టోర్లు ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయడానికి అవకాశం ఉంది. ఈ ఫోన్ కాంకర్డ్ బ్లాక్, శాటిన్ బ్లూ, సీగ్రీన్, సన్‌రైజ్ ఆరెంజ్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది. అంతేకాక ఇది రెండు స్టోరీజ్ ఆప్షన్‌లలో వస్తుంది. ఒకటి 4 జీబీ రామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కాగా.. మరొకటి 8 జీబీ రామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యాలలో లభిస్తుంది. ఈ మొబైల్‌లో ఆండ్రాయిడ్ 14, డాల్బీ అట్మాస్ సపోర్ట్ స్పీకర్లు ఉన్నాయి.
ఇక 4 జీబీ రామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న మోటో జీ04 ఫోన్ ధర 6,999 ఉండగా.. దీనిపై భారీ బంపరాఫర్ ప్రకటించింది. ఆఫర్ తర్వాత రూ.1749కే కొనుగోలు చేయవచ్చని ప్రకటించింది. మోటరోలా జీ04 ఫోన్ 64జీబీ ఫోన్ మీద రూ.750 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. దానివల్ల వినియోగదారులు ఈ వేరియంట్‌ను రూ.6,249కి కొనుగోలు చేయవచ్చు. రిలయన్స్ జియో వినియోగదారులు ఈ ఫోన్ కొనుగోలుపై రూ. 2,500 విలువైన కంబైన్డ్ కూపన్‌లు, రూ.2,000 విలువైన క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అలా ఈ మొబైల్‌ని రూ.1,749కే.. కొనుగోలు చేయవచ్చన్న మాట.
కొత్త మోటో జీ04 మొబైల్‌లో 6.6-అంగుళాల హెచ్‌డీ ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌పే 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్, కెమెరా కటౌట్‌తో ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మోటో జీ04లో ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ వెనుక కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 5-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉన్నాయి. మైక్రో ఎస్‌డీ కార్డ్ స్లాట్ ద్వారా ఇంటర్నల్ స్టోరేజ్‌ను 1టీబీ వరకు పెంచుకోవచ్చు. కొత్త మోటో జీ04 మొబైల్ 10 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 ఎంహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ మొబైల్ మొత్తం బరువు 178.8 గ్రాములు.