Redmi నుంచి మరో స్మార్ట్ ఫోన్.. కళ్లు చెదిరే ఫీచర్లు.. ధర ఎంతంటే?

రెడ్ మీ స్మార్ట్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. బ్యాటరీ పనితీరు బాగుండడం.. క్రేజీ ఫీచర్లను కలిగి ఉండడం వల్ల రెడ్ మీ ఫోన్లు ఓ రేంజ్ లో సేల్ అవుతుంటాయి. మరో ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

రెడ్ మీ స్మార్ట్ ఫోన్లకు ఉండే క్రేజే వేరు. బ్యాటరీ పనితీరు బాగుండడం.. క్రేజీ ఫీచర్లను కలిగి ఉండడం వల్ల రెడ్ మీ ఫోన్లు ఓ రేంజ్ లో సేల్ అవుతుంటాయి. మరో ఫోన్ అందుబాటులోకి వచ్చింది.

స్మార్ట్ ఫోన్ ప్రియులకు మరో కొత్త స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. లేటెస్ట్ అప్ డేట్స్‌తో ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీ రెడ్ మీ రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. క్రేజీ ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ యూజర్లను ఇంప్రెస్ చేస్తోంది. కలర్, డిజైన్, మంచి ప్రాసెసర్ తో ఉన్న ఈ ఫోన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. అప్ డేటెడ్ వర్షన్ ఫోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఆప్షన్ గా చెప్పొచ్చు. రెడ్ మీ ఫోన్లకు ఎలాంటి డిమాండ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. రెడ్ మీ స్మార్ట్ ఫోన్లు హాట్ కేకుల్లా సేల్ అవుతుంటాయి. మొబైల్ మార్కెట్ లో రెడ్ మీ హవా కొనసాగుతోంది.

రెడ్ మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ మూడు కలర్స్ లో అందుబాటులో ఉండగా.. మరో కలర్ లోనూ రానుంది. ఆలీవ్ గ్రీన్ కలర్ ఆప్షన్ లో కూడా రానున్నది. ఇంతకుముందు అరోరా పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్, ఓషన్ టీల్ రంగుల్లో అందుబాటులో ఉంది. భారత్ మార్కెట్లో ఆర్కిటిక్ వైట్, కోరల్ పర్పుల్, మిడ్ నైట్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ ధర విషయానికి వస్తే.. రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 8జీబీ ర్యామ్.. 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.24,999, 8జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.26,999, 12 జీబీ ర్యామ్.. 256 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.28,999 ధరల్లో లభిస్తుంది.

రెడ్‌మీ నోట్ 13 ప్రో 5జీ ఫోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్, 1800 నిట్స్ పీక్ బ్రైట్ నెస్‌తోపాటు 6.67 అంగుళాల 1.5 కే (1220×2712 పిక్సెల్స్) రిజొల్యూషన్, కర్వ్డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్ అందించారు. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎంఐయూఐ 14 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సపోర్టుతో 200 -మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ కెమెరాతోపాటు ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. సెల్ఫీల కోసం 16-మెగా పిక్సెల్ కెమెరా అందించారు. 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ తో 5100 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

Show comments