Small Company Shocks Google: గూగుల్‌కి పోటీగా బరిలోకి అతి చిన్న కంపెనీ.. దెబ్బకు పడిపోయిన షేర్లు..

గూగుల్‌కి పోటీగా బరిలోకి అతి చిన్న కంపెనీ.. దెబ్బకు పడిపోయిన షేర్లు..

OpenAI Announced SearchGPT Search Engine Which Will Tough Competition To Google: గూగుల్ కి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిన్న కంపెనీ గూగుల్ కి భారీ షాక్ ఇచ్చింది.

OpenAI Announced SearchGPT Search Engine Which Will Tough Competition To Google: గూగుల్ కి వరుస పెట్టి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఆ మధ్య ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మరో చిన్న కంపెనీ గూగుల్ కి భారీ షాక్ ఇచ్చింది.

ఓలా సీఈఓ భవిష్ అగర్వాల్ గూగుల్ మ్యాప్స్ తో ఒప్పందాన్ని రద్దు చేసుకుని గూగుల్ కి ఏటా 100 కోట్ల నష్టాన్ని మిగిల్చి చావు దెబ్బ కొట్టారు. అక్కడితో ఆగకుండా యువ టెకీలను కూడా గూగుల్ మ్యాప్స్ బదులు ఓలా మ్యాప్స్ ని వాడండంటూ పిలుపునిచ్చారు. దీంతో గూగుల్ మ్యాప్స్ సర్వీస్ ఛార్జీలను భారీగా తగ్గించింది. తాజాగా గూగుల్ కి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. గూగుల్ కి పోటీగా అతి చిన్న కంపెనీ బరిలోకి దిగింది. చిన్న కంపెనీ ఇచ్చిన ధమ్కీతో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కంపెనీ షేర్లు పడిపోయాయి.

చాట్ జీపీటీ మాతృ సంస్థ ఓపెన్ ఏఐ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బాట్ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కంపెనీ కొత్త విభాగంలోకి అడుగుపెట్టింది. అడుగు పెట్టడం పెట్టడమే గూగుల్ కంపెనీకి స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చి పడేసింది. ‘సెర్చ్ జీపీటీ’ పేరుతో ఒక కొత్త సెర్చ్ ఇంజిన్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గూగుల్ గుత్తాధిపత్యానికి చెక్ పెట్టినట్టైంది. ప్రస్తుతం ఈ సెర్చ్ ఇంజిన్ ప్రోటోటైప్ స్టేజ్ లో ఉందని.. పరిమిత గ్రూప్, పబ్లిషర్స్ తో దీన్ని పరీక్షిస్తున్నామని ఓపెన్ ఏఐ పేర్కొంది. ఈ ఏఐ ఆధారిత ‘సెర్చ్ జీపీటీ’ సెర్చ్ ఇంజిన్ యూజర్లకు ఇంటర్నెట్ లోని రియల్ టైం డేటాను అందిస్తుంది. కాగా సెర్చ్ ఇంజిన్ విషయంలో గూగుల్ వాటా 91 శాతం ఉంది. అయితే ఎప్పుడైతే ఓపెన్ ఏఐ సెర్చ్ ఇంజిన్ ని తీసుకొస్తున్నామని ప్రకటించిందో అప్పుడే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు 3 శాతం మేర పడిపోయాయి.

గూగుల్, బింగ్ లాంటి సాధారణ సెర్చ్ ఇంజిన్లలా సమాచారాన్ని మాత్రమే ఇవ్వడం కాకుండా సంబంధిత లింక్ లను ఇస్తుంది ఈ సెర్చ్ జీపీటీ సెర్చ్ ఇంజిన్. అంటే ఏదైనా ఒక విషయం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు.. దాని పుట్టుపూర్వోత్తరాలు ఎక్కడ నుంచి వచ్చింది అనే లింక్ ని అందిస్తుంది. దీని వల్ల ఫేక్ కంటెంట్ కి చెక్ పెట్టినట్టు అవుతుంది. దీంతో ప్రధాన సెర్చ్ ఇంజిన్ కంపెనీలన్నీ తలపట్టుకున్నాయి. సెర్చ్ ఇంజిన్ లో ఏఐని భాగస్వామ్యం చేయడంలో బిజీగా ఉన్నాయి. ఇలాంటి క్రమంలో ఓపెన్ ఏఐ సెర్చ్ జీపీటీని తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కి చెందిన బింగ్, గూగుల్ సెర్చ్ ఇంజిన్లు ఓపెన్ ఏఐ టెక్నాలజీని వాడుకుంటున్నాయి. సెర్చ్ ఇంజిన్ విభాగంలోకి చాట్ జీపీటీ ఎంట్రీ ఎప్పటికైనా గూగుల్, బింగ్ కు గట్టి పోటీ ఇస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2500 మంది ఉద్యోగులు ఓపెన్ ఏఐలో పని చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. గూగుల్ కంపెనీలో లక్షా 80 వేలకు పైగా ఉద్యోగులు ఉన్నారు. అలాంటి అంత పెద్ద కంపెనీకి పోటీగా 2500 మంది ఉద్యోగులు ఉన్న చిన్న కంపెనీ ఎదురునిలబడింది. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

Show comments