Motorola MOTO G04 Features, Price: కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. 3 సిమ్‌ కార్డులు.. ధర 7 వేల లోపే..

కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. 3 సిమ్‌ కార్డులు.. ధర 7 వేల లోపే..

Motorola MOTO G04: బడ్జెట్‌ ధరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. అద్భుతమైన ఫీచర్లతో పాటు 3 సిమ్‌ కార్డ్స్‌ వాడుకునే సౌలభ్యం ఉన్న ఫోన్‌.. అది కూడా ఏడు వేల లోపే రానుంది. అదేంటో ఓ సారి చూడండి

Motorola MOTO G04: బడ్జెట్‌ ధరలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ కొనాలనుకునే వారికి అదిరిపోయే శుభవార్త. అద్భుతమైన ఫీచర్లతో పాటు 3 సిమ్‌ కార్డ్స్‌ వాడుకునే సౌలభ్యం ఉన్న ఫోన్‌.. అది కూడా ఏడు వేల లోపే రానుంది. అదేంటో ఓ సారి చూడండి

నేటి కాలంలో స్మార్ట్‌ ఫోన్‌ అనేది నిత్యవసరాల్లో ఒకటిగా మారింది. అసలు చేతిలో మొబైల్‌ లేకుండా కనీసం ఒక్క రోజు కూడా గడవదు. ఇక స్మార్ట్‌ ఫోన్‌ వచ్చాక మనిషి జీవితం మరింత సులువయ్యింది. షాపింగ్‌ మొదలు ప్రయాణాల వరకు.. అన్ని పనులను ఇంటి నుంచే చక్కపెట్టుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ఎంతో మందికి జీవానాధారంగా మారింది. అయితే దీని వల్ల లాభాలు ఎన్నో.. నష్టాలు అంతకు మించి ఉంటాయి. కనుక స్మార్ట్‌ ఫోన్‌ వాడకం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అదలా ఉంచితే.. బడ్జెట్‌ ధరలో.. ఎక్కువ ఫీచర్లు ఉండేలా కొత్త మొబైల్‌ కొనాలనుకునే వారికి ఓ టెలికాం కంపెనీ భారీ బంపారఫర్‌ ప్రకటించింది. మూడు సిమ్‌ కార్డులు వాడుకునే విధంగా.. అది కూడా బడ్జెట్‌ ధరలోనే ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. మరి మీలో ఎవరైనా కొత్త ఫోన్‌ కొనాలనుకుంటున్నారా.. అయితే దీనిపై ఓ లుక్కేయండి.

ఇంతకు ఈ బడ్జెట్‌ మొబైల్‌ను తీసుకొచ్చిన కంపెనీ ఏది అంటే మోటోరోలా. ఈ కంపెనీ తాజాగా బడ్జెట్‌ ధరలో వచ్చే మోటో జీ04 ఫోన్‌ను లాంచ్ చేసింది. మోటో జీ04 సరికొత్త ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ 14తో బడ్జెట్‌ ధరలో అనగా ఏడు వేల రూపాయల లోపే రాబోతుంది. మోటో జీ04 ఫీచర్ల విషయానికి వస్తే.. ఐపీ52 వాటర్ రిపెల్లెంట్ డిజైన్, 15 వాట్స్‌ ఛార్జర్‌తో కూడిన 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ స్పీకర్లతో వస్తోంది. క్వాడ్-పిక్సెల్ కెమెరా సిస్టమ్‌తో కూడిన 16-మెగాపిక్సెల్ ఏఐ కెమెరాతో వస్తుంది.

మోటో జీ04 స్మార్ట్‌ ఫోన్‌ కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ అనే నాలుగు రంగుల్లో లభిస్తుంది. ఇక స్టోరేజ్‌ విషయానికి వస్తే మోటో జీ04 4జీబీ, 8 జీబీ రామ్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ర్యామ్ బూస్ట్‌తో దీన్ని 16జీబీ వరకు విస్తరించుకోవచ్చని మోటోరోలా కంపెనీ వెల్లడించింది. అలానే 64 జీబీ, 128జీబీ రెండు స్టోరేజ్ ఆప్షన్‌లతో మైక్రో ఎస్‌డీ కార్డ్‌ని ఉపయోగించి స్టోరేజీని 1టీబీ వరకు పెంచుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. అన్నింటికన్నా ఆసక్తికరైమన అంశం ఏంటంటే.. దీనిలో ట్రిపుల్ సిమ్ కార్డ్ స్లాట్ కూడా ఉంది. రెండు మెమరీ వేరియంట్‌ల ధరలు రూ.6,999 అండ్ రూ.7,999గా ఉన్నాయి.

అయితే లాంచింగ్‌ ఆఫర్‌లో భాగంగా, కస్టమర్లు ఇతర ఫోన్‌ల ఎక్స్చేంజ్ పై రూ.750 అదనపు తగ్గింపుతో 4జీబీ+64జీబీ వేరియంట్‌ మోటో జీ04 ఫోన్‌ను ఏడు వేల లోపే అనగా రూ.6,249కి పొందవచ్చు. మోటో జీ04 ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్‌కార్ట్, మోటరోలా వెబ్‌సైట్ ఇంకా రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. కనుక బడ్జెట్‌ ధరలో మంచి ఫోన్‌ కావాలనుకునే వారు దీనిపై ఓ లుక్కేయొచ్చు.

Show comments