iPhone 16 సిరీస్ లీక్డ్ ఫీచర్స్ ఇవే! ధర మాత్రం 15 కంటే తక్కువే?

iPhone 16 Series: యాపిల్ కంపెనీ బిగ్ లాంచ్ ఈవెంట్ నుంచి తన న్యూ ఐఫోన్ 16 సిరీస్తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేసే అవకాశం వుంది. యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9 వ తేదీన రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవబోతోంది.

iPhone 16 Series: యాపిల్ కంపెనీ బిగ్ లాంచ్ ఈవెంట్ నుంచి తన న్యూ ఐఫోన్ 16 సిరీస్తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేసే అవకాశం వుంది. యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9 వ తేదీన రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవబోతోంది.

యాపిల్ కంపెనీ బిగ్ లాంచ్ ఈవెంట్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. యాపిల్ ఈ ఈవెంట్ నుంచి తన న్యూ ఐఫోన్ 16 సిరీస్తో పాటు మరిన్ని ప్రొడక్ట్స్ ని కూడా లాంచ్ చేసే అవకాశం వుంది. ఈ సంవత్సరం యాపిల్ ఈవెంట్ సెప్టెంబర్ 9 వ తేదీన భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు స్టార్ట్ అవబోతోంది. కాలిఫోర్నియాలోని క్యూపర్టినో లో ఉన్న యాపిల్ హెడ్ క్వార్టర్స్ లో ఈ గ్రాండ్ ఈవెంట్ జరుగబోతోంది. ఇక యాపిల్ ఈ ఈవెంట్ నుంచి ఐఫోన్ 16 సిరీస్ తో పాటు స్మార్ట్ వాచ్ ఇంకా మరిన్ని ప్రొడక్ట్స్ ను లాంచ్ చేస్తుందని సమాచారం తెలుస్తుంది. ముఖ్యంగా ఐఫోన్ 16 సిరీస్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొన్ని లీక్స్ ప్రకారం వీటి ఫీచర్ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.

ఇక లీక్స్ ప్రకారం.. ఐఫోన్ 16 మరియు ఐఫోన్ 16 ప్లస్ రెండు ఫోన్లు కూడా ఒకే చిప్ సెట్ తో రానున్నాయి. వీటిలో A18 బయోనిక్ చిప్ సెట్ ఉంటుంది. ఈ ఫోన్లు 8 జీబీ ర్యామ్ తో వస్తాయని తెలుస్తుంది. వీటిలో ఐఫోన్ 16 ఫోన్ 6.1 ఇంచెస్ స్క్రీన్ తో వస్తుందట. ఐఫోన్ 16 ప్లస్ ఫోన్ అయితే 6.7 ఇంచెస్ స్క్రీన్ తో వస్తుందని సమాచారం తెలుస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ కెమెరా డీటెయిల్స్ అయితే ముందు నుంచే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ రూమర్ల ప్రకారం, ఐఫోన్ 16 మరియు 16 ప్లస్ రెండు ఫోన్ లలో కూడా డ్యూయల్ రియర్ కెమెరాలు ఉంటాయట. వీటిలో 48MP రియర్ కెమెరా ఉంటుంది. దీనికి అల్ట్రా వైడ్ కెమెరా యాడయ్యి ఉంటుందని సమాచారం తెలుస్తుంది. ఐఫోన్ 16 ఫోన్ 3,561mAh బ్యాటరీతో వస్తుందట. అలాగే 16 ప్లస్ ఫోన్ లో 4,006 mAh బ్యాటరీ ఉంటుందని ఆన్లైన్ లీక్స్ ద్వారా తెలుస్తుంది.

ఇక ఐఫోన్ 16 సిరీస్ ప్రీమియం ఫోన్స్ ఐఫోన్ 16 ప్రో, 16 ప్రో మ్యాక్స్ ఫోన్స్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్స్ కూడా A18 Pro చిప్ సెట్ తో రావచ్చని లీక్స్ ద్వారా తెలుస్తుంది. ఈ ఫోన్ లలో ట్రిపుల్ రియర్ కెమెరా ఉంటుందట. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 5X ఆప్టికల్ జూమ్ కలిగిన 12MP టెలిఫోటో, 48MP అల్ట్రా వైడ్ కెమెరా ఉండవచ్చని తెలుస్తుంది. ఇక వీటి ధరల విషయానికి వస్తే.. వీటి ధరలు దాదాపు 799 డాలర్స్ నుండి స్టార్ట్ అవుతాయట. అంటే మన ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 67,000 నుండి ధర ప్రారంభమవుతుంది. తెలుస్తున్న ప్రకారం ఐఫోన్ 16 ప్లస్ రూ. 75,500, 16 ప్రో రూ. 92,300, ప్రో మ్యాక్స్ ధర రూ. 1,00,700 గా ఉంటాయని సమాచారం తెలుస్తుంది. ఇవి కేవలం సోషల్ మీడియాలో వచ్చిన లీక్స్ మాత్రమే. వీటి పూర్తి ఫీచర్లని, ధరల్ని యాపిల్ కంపెనీ త్వరలో అధికారికంగా ప్రకటించనుంది.

Show comments