Vinay Kola
Instagram: ఇన్స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లని తీసుకొస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ ని తీసుకొచ్చింది.
Instagram: ఇన్‌స్టాగ్రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన యూజర్ల కోసం ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఫీచర్లని తీసుకొస్తుంది. తాజాగా ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ సాంగ్ ఫీచర్ ని తీసుకొచ్చింది.
Vinay Kola
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. తాజాగా మరో ఫీచర్ ని తీసుకొచ్చింది. యూజర్లు తమ ప్రొఫైల్‌లో పాటను యాడ్ చేసుకునేలా కొత్త ఫీచర్‌ను ప్రకటించింది. ఇన్‌స్టాగ్రామ్ ప్రకారం.. యూజర్ తాను సెలెక్ట్ చేసుకున్న మ్యూజిక్ తన ప్రొఫైల్‌లోని బయో ఏరియాలో ప్లే అవుతుంది. యూజర్లు తమకు నచ్చినట్లు పాటను సెట్ చేసుకోవచ్చు. అలాగే తాము కోరుకున్న విధంగా పాటను తీసివేయవచ్చు. వేరే పాటను కూడా యాడ్ చేసుకోచ్చు. ఈ ఫీచర్ 2000ల ప్రారంభంలో మైస్పేస్‌లో ఉన్న ఫీచర్ లాగా ఉంది. అయితే ఈ ఇంస్టాగ్రామ్ ఫీచర్లో మాత్రం పాటలు ఆటొమ్యాటిక్ గా ప్లే చేయబడవు. యూజర్ తన ప్రొఫైల్ లో తనకు నచ్చిన విధంగా ప్లే చేసుకోవచ్చు.
ఈ ఫీచర్ ని ఎలా సెట్ చేసుకోవాలంటే.. ముందుగా మీరు ఇన్‌స్టాగ్రామ్ లో ‘ఎడిట్ ప్రొఫైల్’ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఆ తరువాత అందులో ‘యాడ్ మ్యూజిక్ టు యువర్ ప్రొఫైల్’ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత, మీరు ఇన్‌స్టాగ్రామ్ లైసెన్స్ పొందిన మ్యూజిక్ లైబ్రరీని ఓపెన్ చెయ్యాలి. అందులో నుండి మీకు నచ్చిన పాటను సెర్చ్ చేసుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు సెలెక్ట్ చేసుకున్న పాట లైబ్రరీ రీల్స్ ఇంకా పోస్ట్‌ల కోసం కూడా అందుబాటులో ఉంటుంది. ఈ మ్యూజిక్ డ్యూరేషన్ వచ్చేసి మొత్తం 30 సెకన్ల పాటు ఉంటుంది. ఈ లైబ్రెరీలో ఎక్కువగా ట్రెండింగ్ సాంగ్స్ ఉంటాయి. మీ ఫాలోవర్లు మీ ప్రొఫైల్ ఓపెన్ చేసి ప్లే బటన్‌ను నొక్కినప్పుడల్లా, మీరు సెట్ చేసుకున్న పాట ప్లే అవుతుంది.
ఈ ఫీచర్ తో మీరు మీ వ్యక్తిగత విషయాలను, అభిరుచులను పాట రూపంలో మీ ఫాలోవర్లతో షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ మీ మూడ్ ని తెలియజేస్తుంది. అంటే మీ ఫాలోవర్లకు మీ మూడ్ తెలియజేసేలా మీరు ఇందులో మ్యూజిక్ ని సెట్ చేసుకోవచ్చు. ఉదాహారణకు మీరు హ్యాపీగా ఉన్నారని చెప్పడానికి హ్యాపీ సాంగ్స్ పెట్టుకోవచ్చు. లేదా బాధగా ఉంటే స్యాడ్ సాంగ్స్ పెట్టుకోవచ్చు. ఈ ఫీచర్ కచ్చితంగా మీ ఫాలోవర్లని ఆకట్టుకుంటుంది. ఇది మీ ప్రొఫైల్‌ను మరింత అందంగా మారుస్తుంది. కాబట్టి మీరు కూడా ఒకసారి ఈ ఫీచర్ ని ట్రై చేసి చూడండి. ఒకవేళ మీరు ఈ ఫీచర్ ని వాడుతుంటే దీని గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.