కెమెరా, మనుషులు అవసరం లేదు.. నిమిషంలో ఫ్రీగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు

Create Free AI Videos Using Vidnoz In 1 Minute: కంటెంట్ ఉంది కానీ వీడియోలు చేయడానికి మంచి కెమెరా లేదు, సరైన మనిషి లేరు అని వీడియోలు చేయకుండా ఆగిపోయిన వారికి ఇదే మంచి అవకాశం. నిమిషంలో ఉచితంగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.

Create Free AI Videos Using Vidnoz In 1 Minute: కంటెంట్ ఉంది కానీ వీడియోలు చేయడానికి మంచి కెమెరా లేదు, సరైన మనిషి లేరు అని వీడియోలు చేయకుండా ఆగిపోయిన వారికి ఇదే మంచి అవకాశం. నిమిషంలో ఉచితంగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.

చాలా మంది దగ్గర కంటెంట్ ఉంది.. కానీ మ్యాన్ పవర్ లేక ఆగిపోతున్నారు. కెమెరా ఉండదు, ఫోన్ కెమెరా క్వాలిటీ ఉండదు. గ్రీన్ స్క్రీన్ ఎక్విప్ మెంట్, లైట్స్ వంటి సెటప్ ఉండదు. ఇవన్నీ ఉన్నా కానీ కంటెంట్ ని ప్రెజెంట్ చేసే మనుషులు ఉండాలి. చాలా మంది ఆగిపోయేది ఇక్కడే.. మనుషులు లేక. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియాల్లో వీడియోలకి రీచ్ ఉండాలంటే కంటెంట్ ఎంత ముఖ్యమో.. కంటెంట్ ప్రెజెంటర్ కూడా అంతే ముఖ్యం. చాలా మంది దగ్గర కంటెంట్ ఉన్నా కూడా కంటెంట్ ని ప్రెజెంట్ చేయడానికి ఆ స్కిల్స్ ఉండవు. వేరే వాళ్ళ మీద ఆధారపడదామన్నా డబ్బులతో కూడుకున్న వ్యవహారం కాబట్టి కుదరదు. అలాంటి వారి కోసమే ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. 

మీరు కేవలం టెక్స్ట్ ఇన్పుట్ ఇస్తే దానికి తగ్గట్టు వీడియో రెడీ అవుతుంది. మీ స్క్రిప్ట్ కి మీరు వాయిస్ ఇచ్చి అప్లోడ్ చేసినా దాన్ని ఏఐ అవతార్ చదువుతుంది. అంటే మీ కంటెంట్ కి, వాయిస్ కి మ్యాచ్ అయ్యే ఏఐ ఆర్టిస్ట్ ని ఎంచుకోవచ్చు. న్యూస్ వీడియోస్, ఫ్యాక్ట్స్ వీడియోస్, యాంకర్ వీడియోలు వంటివి చేసేవారికి ఈ వెబ్ సైట్ బాగా హెల్ప్ అవుతుంది. సింగిల్ పర్సన్ మాత్రమే కాకుండా ఇద్దరు వ్యక్తులు చర్చించుకునేలా కూడా ఒక ఆప్షన్ అందుబాటులో ఉంది. మీరు షార్ట్స్ కోసం వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. యూట్యూబ్ 16:9 రేషియోలో ల్యాండ్ స్కేప్ మోడ్ లో కూడా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు. మీ దగ్గర కంప్యూటర్ ఉంటే చాలు. కంప్యూటర్ లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉన్నా చాలు. ఈజీగా వీడియోలు క్రియేట్ చేసుకోవచ్చు.  

వీడియోలు ఎలా క్రియేట్ చేయాలి?:

  • ముందు మీరు విడ్నోజ్ వెబ్ సైట్ లోకి వెళ్ళాలి.   
  • క్రియేట్ ఫ్రీ వీడియో నవ్ మీద క్లిక్ చేయాలి. 
  • గూగుల్, ఫేస్ బుక్, లింక్డిన్, మైక్రోసాఫ్ట్ అకౌంట్ లతో లాగిన్ అవ్వాలి. లేదా ఈమెయిల్ తో సైనప్ అవ్వచ్చు. 
  • లాగిన్ అయ్యాక బ్రేకింగ్ న్యూస్, ఎక్స్ ప్లెయినర్, సోషల్ మీడియా ఇలా కొన్ని కేటగిరీలు ఉంటాయి. వీటిలో మీరు ఎలాంటి వీడియోలు చేయాలనుకుంటున్నారో ఆ కేటగిరీని ఎంపిక చేసుకోవాలి.  
  • కొన్ని డీఫాల్ట్ టెంప్లేట్స్ ఉంటాయి. వాటిలో ఒకదాన్ని ఎంచుకోవాలి. 
  • ల్యాండ్ స్కేప్, పోర్ట్రైట్ మోడ్ లో ఎలా కావాలంటే అలా వీడియోలు చేసుకోవచ్చు. 
  • ఏఐ అమ్మాయిలు, ఏఐ అబ్బాయిలతో ఏఐ అవతార్స్ ఉంటాయి. 
  • వీటిలో ఒక అవతార్ ని ఎంచుకోవాలి. ఈ అవతార్ ని ఎడిట్ చేసుకోవచ్చు. 
  • క్రియేట్ వీడియో మీద క్లిక్ చేస్తే స్పీచ్ టెక్స్ట్, కాన్వర్సేషన్, అప్లోడ్ వాయిస్, నో స్పీచ్ అనే ఆప్షన్స్ కనబడతాయి. 
  • స్పీచ్ టెక్స్ట్ లో మీరు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఏ భాష కంటెంట్ ని అయినా పేస్ట్ చేస్తే ఆ ఏఐ అవతార్ మాట్లాడుతుంది. 
  • ఆ తర్వాత జనరేట్ వీడియో మీద క్లిక్ చేస్తే వీడియో రెడీ అవుతుంది. 

అయితే ఫ్రీగా వాడుకోవాలంటే రోజుకు ఒక నిమిషం వీడియోనే చేసుకోవడానికి కుదురుతుంది. వెయ్యికి పైగా ఏఐ అవతార్స్ ని, వెయ్యికి పైగా టెంప్లేట్స్ ని, 170కి పైగా వాయిస్ లను ఫ్రీగా వాడుకోవచ్చు. అలానే 720 పిక్సెల్ వీడియో, ఒక సీన్ కి 2 వేల క్యారెక్టర్స్ ని, 20 ఏఐ స్క్రిప్ట్ లు వంటి ఫీచర్స్ ని ఫ్రీగా వాడుకోవచ్చు. కమర్షియల్ గా కూడా ఈ వీడియోస్ ని వాడుకోవచ్చు. ఇంకా ఎక్కువ నిముషాలు కావాలంటే కనుక స్టార్టర్, బిజినెస్, ఎంటర్ప్రైజ్ వంటి ప్లాన్స్ లో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. డైలీ ఒక నిమిషం షార్ట్ వీడియో పెట్టుకునేవారు అయితే ఫ్రీగా వాడుకోవచ్చు.

Show comments