Risk With HDMI Cables: HDMI కేబుల్స్‌ ద్వారా డేటా, పాస్వర్డ్‌ హ్యాక్.. పరిశోధనలో వెల్లడి

HDMI కేబుల్స్‌ ద్వారా డేటా, పాస్వర్డ్‌ హ్యాక్.. పరిశోధనలో వెల్లడి

Passwords Leak Through HDMI Cables: ఈ హెచ్డీఎంఐ కేబుల్స్ ని మీరు చూసే ఉంటారు. మీ కంప్యూటర్ మానిటర్ కో, టీవీకో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ కేబుల్ వల్ల ముప్పు పొంచి ఉందని పరిశోధకులు వెల్లడించారు.

Passwords Leak Through HDMI Cables: ఈ హెచ్డీఎంఐ కేబుల్స్ ని మీరు చూసే ఉంటారు. మీ కంప్యూటర్ మానిటర్ కో, టీవీకో కనెక్ట్ అయి ఉంటుంది. అయితే ఈ కేబుల్ వల్ల ముప్పు పొంచి ఉందని పరిశోధకులు వెల్లడించారు.

ఇప్పుడు చాలా మంది ఇళ్లలో ఉండే టీవీలకు, కంప్యూటర్లకు, ల్యాప్ టాప్ లకు హెచ్డీఎంఐ కేబుల్సే ఉంటున్నాయి. వీటిని ల్యాప్ టాప్ విజువల్స్ ని మానిటర్ లో కనిపించడం కోసం వాడతారు. అలానే సెట్ టాప్ బాక్స్ లో ఉన్న వీడియో అవుట్ పుట్ టీవీ స్క్రీన్ లోకి రావడానికి కూడా ఈ హెచ్డీఎంఐ కేబుల్ నే వాడతారు. అయితే ఇప్పుడు ఈ హెచ్డీఎంఐ కేబుల్స్ తోనే ముప్పు పొంచి ఉందని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏఐ, డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ లాంచ్ అయినప్పటి నుంచి అవి భద్రత మీద తీవ్ర ప్రభావం చూపుతాయని ఒక చర్చ అయితే నడుస్తోంది. దీని మీద సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో యూజర్లు భయపడే పరిస్థితి నెలకొంది.

ఎందుకంటే పాస్వర్డ్ లతో సహా సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు సులువుగా హ్యాక్ చేయగలిగే కొత్త మార్గాన్ని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్స్ కనుగొన్నారు. ల్యాప్ టాప్ లేదా కంప్యూటర్ కి, మానిటర్ కనెక్ట్ చేసే హెచ్డీఎంఐ కేబుల్ నుంచి ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీలని డీకోడ్ చేయడానికి.. ఆ సమాచారాన్ని స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ఏఐని వాడుకోవడం అనేది కొత్త పద్ధతిలో ఉందని తెలిపారు. ఈ హ్యాకింగ్ టెక్నిక్ ని తొలుత దక్షిణ అమెరికాలోని ఉరుగ్వేలో ఉన్న యూనివర్సిటీ ఆఫ్ రిపబ్లిక్ పరిశోధకులు కనుగొన్నారు. హ్యాకర్లు.. డిఫైన్డ్ రేడియో ఎక్విప్మెంట్ యూజ్ చేసి హెచ్డీఎంఐ కేబుల్స్ నుంచి వచ్చే ఎలక్ట్రో మాగ్నెటిక్ రేడియేషన్ సిగ్నల్స్ ని క్యాప్చర్ చేస్తారు.

ఆ తర్వాత ఈ సిగ్నల్స్ ని ఏఐ మరియు డీప్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్ ద్వారా కంప్యూటర్ స్క్రీన్ మీద ఉన్న దాన్ని పునర్నిర్మిస్తారు. ఈ రీకన్స్ట్రక్టడ్  సిగ్నల్స్ ద్వారా హ్యాకర్లు కంప్యూటర్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న ఇమేజెస్ ని, టెక్స్ట్ కంటెంట్ ని 70 శాతం హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు. పాస్వర్డ్ లు, సున్నితమైన డేటా, ఎన్క్రిప్టెడ్ కమ్యూనికేషన్ ని సైతం హ్యాక్ చేయగలరు. స్క్రీన్ లేదా డిస్ప్లే నుంచి రేడియేషన్ రూపంలో ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ అనేవి విడుదలవుతాయి. ఈ టెక్నిక్ ని వాడి యూజర్ల బ్యాంకు పాస్వర్డ్ లు వంటివి తెలుసుకుని డబ్బులు కాజేసే అవకాశాలు ఉన్నాయి.

ఈ పరిశోధనతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యూజర్ల సున్నితమైన సమాచారాన్ని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదంలో పడేస్తుందో అనే భయం ఇప్పుడు మొదలైంది. అయితే ఈ విషయంలో సాధారణ వినియోగదారులు చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ టెక్నిక్ ని యూజ్ చేసిన సున్నితమైన సమాచారాన్ని హ్యాండిల్ చేసే ప్రభుత్వ ఏజెన్సీలను, కార్పొరేషన్లను, పలు సంస్థలను మాత్రమే హ్యాకర్లు టార్గెట్ చేస్తారని చెబుతున్నారు. అయితే ఈ టెక్నిక్ హ్యాకర్లు అందరూ ఫాలో అయితే చిన్న చిన్న వారిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.                          

Show comments