గూగుల్ సంచలన నిర్ణయం.. త్వరలో ఆ సేవలు నిలిపివేత!

Google Podcasts: ప్రస్తుతం కాలంలో సాంకేతికంగా గూగుల్ లేకుండా ఏ పని కావడం లేదు. ముఖ్యంగా భారతీయులు గూగుల్ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. తాజాగా గూగుల్ సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

Google Podcasts: ప్రస్తుతం కాలంలో సాంకేతికంగా గూగుల్ లేకుండా ఏ పని కావడం లేదు. ముఖ్యంగా భారతీయులు గూగుల్ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. తాజాగా గూగుల్ సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.

గూగుల్.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఫోన్ లో కనిపించ ప్రత్యేక ఫీచర్ ఇది. ఈ గూగుల్ సంస్థ తన కస్టమర్లకు అనేక సేవలను అందిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లతో  వినియోగదారులను ఆకట్టుకుంటుంది. అలానే తరచూ ఏదో  ఒక కొత్త మార్పుకు శ్రీకారం చుట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. తాజాగా గూగుల్ సంస్థ ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో కొన్ని రకాల సేవలు నిలిచిపోనున్నాయి. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం కాలంలో సాంకేతికంగా గూగుల్ లేకుండా ఏ పని కావడం లేదు. ముఖ్యంగా భారతీయులు గూగుల్ సేవలను ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. టెక్నాలజీ పరంగా ఏ పని సాగాలన్ని గూగుల్ అవసరం ఎక్కువ అవుతుంది. ఈ క్రమంలోనే గూగుల్ సంస్థ సైతం అనేక ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. అలానే తరచూ వివిధ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా అలానే ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ టెక్ దిగ్గజం అధికారికంగా మరో సేవను మూసివేయనంది. గూగుల్ పాడ్ కాస్ట్ యాప్ ను బంద్ చేయడానికి సిద్ధమైంది. వచ్చే నెల 23నుంచి పాడ్ కాస్ట్ యాప్ నిలిపివేయబడుతుందని గూగుల్ ప్రకటించింది.

ఇప్పటికే నిర్ధిష్ట పాడ్ క్యాస్ట్ లకు సబ్ స్క్రిప్షన్ కలిగి ఉన్న వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంది. పాడ్ క్యాస్ట్ సబ్ స్క్రిప్షన్  కలిగిన యూజర్లకు యూట్యూబ్ మ్యూజిక్ లోకి మారాల్సి ఉంటుందని సంస్థ స్పష్టం చేసింది. సబ్‌స్క్రిప్షన్‌లను ఎంపికతో మార్చుకోవడం అనేది ఇమెయిల్‌ను పంపడం ద్వారా వినియోగదారులకు తెలియజేస్తోంది.

గతేడాది యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌లో పాడ్‌క్యాస్ట్-సంబంధిత ఫీచర్‌లను ఏకీకృతం చేయడం ప్రారంభించింది టెక్ దిగ్గజం గూగుల్. తాజాగా ఆ పనిని కంపెనీ ఇప్పుడు పూర్తి చేయనుంది. ఇప్పుడు కస్టమర్లు యూఎస్ వంటి మార్కెట్‌లలో ఒక యాప్‌లోనే సంగీతం, పాడ్‌క్యాస్ట్‌లను యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంది. ఇది అతి త్వరలో ఇతర మార్కెట్‌లకు విస్తరింపజేయనున్నారు. అయితే గూగుల్ కు చెందిన పాడ్ కాస్ట్ యాప్ ఇప్పటికీ యాప్ స్టోర్, ప్లే స్టోర్ లో అందుబాటులో ఉంది.

ఇప్పటి వరకు దీనిని వినియోగించినా…జూన్ 23 తర్వాత వినియోగించలేరని పేర్కొంది. గూగుల్ ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్ లో పాడ్ కాస్ట్ యాప్ 500 మిలియన్లకు పైగా డౌన్ లోడ్ జరిగింది. ఎడిసన్ నివేదిక ప్రకారం, పాడ్‌క్యాస్ట్‌లను కస్టమర్లలో 23 శాతం మంది యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌ను ఇష్టపడుతున్నారు. కేవలం 4 శాతం మంది కస్టమర్లు మాత్రమే పాడ్‌క్యాస్ట్ యాప్‌ను ఇష్టపడుతున్నారు. ఈ  నేపథ్యంలోనే మొత్తం సంగీత కంటెంట్ వినియోగాన్ని ఒకే ప్లాట్‌ఫారమ్‌ పైకి తేవాలని గూగుల్ చూస్తోంది.

గూగుల్ యూట్యూబ్ మ్యూజిక్ యాప్‌కి పాడ్‌క్యాస్ట్ సంబంధించి మరిన్ని ఫీచర్‌లను జోడిస్తోంది. ఇందులో ఆర్ఎస్ఎస్ ఫీడ్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. అంతేకాక కస్టమర్లకు వారి ఓపీఎంఎల్ ఫైల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఇస్తుంది. అయితే ఒక ఏడాది పాటు యూజర్ల పాడ్‌క్యాస్ట్ డేటా గూగుల్ టేకౌట్ ద్వారా అందుబాటులో ఉంటుందని కంపెనీ భరోసా ఇచ్చింది. ముందుగా ఏప్రిల్ లోనే పాడ్ కాస్ట్ యాప్ ను నిలిపి వేస్తామని ప్రకటించారు. కానీ వివిధ కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. చివరకు జూన్ 23 తర్వాత సేవలు బంద్ చేయన్నారు. మరి.. గూగుల్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments