Keerthi
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. తాజాగా భారత టెక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. ఇకపై క్రెడిట్ కార్డు, డిబిట్ కార్డు వినియోగించే యూజర్లకు ఆ టెన్షన్ అవసరం లేదు.
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. తాజాగా భారత టెక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. ఇకపై క్రెడిట్ కార్డు, డిబిట్ కార్డు వినియోగించే యూజర్లకు ఆ టెన్షన్ అవసరం లేదు.
Keerthi
ప్రస్తుత కాలంలో డిజిటల్ పేమెంట్స్ తో పాటు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులను వినియోగించే యూజర్ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ఎక్కడకి వెళ్లలన్నా, ఏ వస్తువలను కొనుగోలు చేయాలన్నా.. ఈ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అనేది తప్పనిసరి. ముఖ్యంగా షాపింగ్ చేయాలన్న, ట్రవలింగ్ టికెట్స్ బుక్ చేసుకోవాలన్నా.. ఇలా ఏదీ చేయలనుకున్న వీటి అవసరం ఎంతగానో ఉంటుంది. అయితే అన్ని వేళలో ఈ క్రెడిట్ కార్డు,డిబిట్ కార్డులు అనేవి మన దగ్గర లేకపోవచ్చు. కొన్నిసార్లు బయటకు వెళ్లే సమయంలో వీటిని మార్చిపోవచ్చు. ఇప్పటికే అలాంటి సమస్యలు చాలామంది ఎదుర్కొంటున్నారు. అయితే అలాంటి వారిని దృష్టిలో పెట్టుకున్న ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా ఓ కీలక ప్రకటన చేసింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రపంచ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్.. తాజాగా భారత టెక్ ప్రియులకు ఓ గుడ్ న్యూస్ ను అందించింది. కొత్తగా గూగుల్ డిజిటల్ వాలెట్ యాప్ గూగుల్ వాలెట్ ను భారత్ లో కూడా లాంఛ్ చేసింది. కాగా, ఈ ప్రైవేట్ డిజిటల్ వాలెట్లో యూజర్లు.. తమ ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ ను స్టోర్ చేసుకోవడానికి వీలుంటుంది. అంతేకాకుండా.. వీటిలో క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులు, లాయల్టీ కార్డులు, టికెట్స్, పాస్‌లు, ఇతర ఐడీ కార్డులు, గిఫ్ట్ కార్డులు వంటి వాటిని చాలా సురక్షితంగా స్టోర్ చేసుకోవచ్చు. పైగా గూగుల్ నుంచి అందుబాటులో ఉన్న ఈ యూపీఐ పేమెంట్స్ యాప్ గూగుల్ పేపై.. ప్రస్తుతం తీసుకొచ్చిన గూగుల్ వాలెట్ ఎలాంటి ప్రభావం చూపదని స్పష్టం చేసింది. అయితే ఈ యాప్ అనేది ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లకు అందుబాటులో తీసుకొచ్చారు.
అయితే గూగుల్ వాలెట్ వెబ్ సైట్ FAQ ప్రకారం.. గూగుల్ వాలెట్ అనేది సెక్యూర్ అండ్ ప్రైవేట్ డిజిటల్ వాలెట్. అనగా గూగుట్ పే కంటే భిన్నమైన సేవల్ని అందిస్తుంది. ఇక గూగుల్ పేతో మనం కేవలం ఆన్ లైన్ పేమెంట్స్ మాత్రమే చేయగలుగుతాం. కాగా, గూగుల్ వాలెట్ అనేది మాత్రం ఇక్కడ పేమెంట్ యాప్ కాదు. ఇది డిజిటల్ వెర్షన్‌లో ఆయా కార్డుల్ని స్టోర్ చేసుకునేందుకు ఉపయోగించుకొనే ఓ యాప్ మాత్రమే. ముఖ్యంగా ఈ యాప్ వలన క్రెడిట్, డెబిట్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సిన పని లేదు. కేవలం ఇందులో డిజిటల్‌గా స్టోర్ అయి ఉంటే చాలు. అనగా గూగుల్ వాలెట్ ను నాన్ పేమెంట్ యూజ్ యాప్ గా తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఇక ఈ గూగుల్ వాలెట్ యాప్ అనేది ఇప్పటికే అమెరికాతో సహా ఇతర దేశాల్లో అందుబాటులో ఉందనే విషయం తెలిసిందే. కాగా, దీనిని అక్కడ పేమెంట్లు చేసేందుకు వినియోగిస్తారు. అయితే భారత్ లో లాంఛ్ చేసే ఈ యాప్ లో మాత్రం.. పేమెంట్స్ ఫీచర్ కాకుండా.. ఇతరత్రా వాటిని ఆఫర్ చేస్తోంది. ఇక పేమెంట్లు చేసేందుకు గూగుల్ నుంచి.. గూగుల్ పే ఉన్నందున వాలెట్లో మాత్రం పేమెంట్స్ కు ప్రస్తుతానికి అనుమతించడం లేదు. ఇకపోతే ఈ గూగుల్ వాలెట్ సేవల్ని ఎప్పటినుంచో తీసుకొస్తారని వార్తలు వచ్చాయి కానీ, అధికారికంగా ఇది లాంఛ్ కాకముందే.. చాలా మంది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా గూగుల్ వాలెట్ సేవల్ని పొందుతున్నారు. అయితే ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా ఈ సేవల్ని తీసుకొచ్చింది. మరి, ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తీసుకొచ్చిన ఈ గూగుల్ వాలెట్ యాప్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.