రూ.30వేల బడ్జెట్​‌లో బెస్ట్​ స్మార్ట్ ఫోన్లు.. ఫీచర్స్ అదుర్స్!

Best Smartphones: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే లెక్క.

Best Smartphones: స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు వచ్చాయి. స్మార్ట్ ఫోన్.. ఇంటర్నెట్ ఉంటే చాలు ప్రపంచం మన అరచేతిలో ఉన్నట్లే లెక్క.

టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నారు. ఒక్క స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మన గుప్పిట్లో ఉన్నట్లే. ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో కంపెనీలు వచ్చాయి.. కొత్త కొత్త ఫీచర్స్ లో స్మార్ట్ ఫోన్లు వస్తున్నాయి. అయితే మీ బడ్జెట్ లో కొత్త స్మార్ట్ కొనాలని చూస్తున్నారా? ఇప్పుడు ఇండియా మర్కెట్ లో తక్కువ బడ్జెట్ తో అద్భుతమైన ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఏ కంపెనీ? ఫీచర్స్ ఎంటీ? ఎంత బడ్జెట్? అన్న విషయాల గురించి తెలుసుకుందాం. దేశంలో ఇప్పుడు పట్టణాల్లోనే కాదు.. గ్రామాల్లో సైతం స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. ఎప్పటికప్పడు మార్కెట్ లో కొత్త ఫీచర్స్ తో స్మార్ట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి కంపెనీలు. మీ బడ్జెట్ తో కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? మీ బడ్జెట్ రూ.30 లోపు ఉంటే మీ కోసం ది బెస్ట్ ఫోన్స్ ఇండియా మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చాయి. వాటి గురించిన పూర్తి వివరాలు మీకోసం..

రియల్ మీ జీటీ 6 టీ : ఈ స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచులు 3డీ అమో ఎల్ఈడీ డిస్ ప్లే కలిగి ఉంంది. 120 హెర్ట్జ్ రి ఫ్రెష్ రేట్.. 1000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంది. 120 వాట్స్ చార్జింగ్ సపోర్ట్ కలిగి 5500 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో పొందుపర్చారు. దీని వల్ల వేగవంతంగా రీచార్జ్ అవుతుంది. రియల్ మీ జీటీ 6 టీ స్మార్ట్ ఫోన్ 4 ఎన్ఎం క్వాల్కమ్ స్నా ప్డ్రాగన్ 7+ జెన్ ప్రాసెసర్, ఆన్ -డివైజ్ జనరేటీవ్ AI సామర్థ్యాలు కలిగి ఉన్నాయి. 50 మెగా పిక్సెల్ ఓఐఎస్ లైట్ – 600 కెమెరా, 8 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 355 వైడ్ యాంగిల్ కలిగిన కెమెరా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 32 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 సెల్ఫీ కెమెరా కూడా ఇందులో పొందుపర్చింది సంస్థ.

వన్ ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ : మార్కెట్ లో ఈ ఫోన్ కి మంచి డిమాండ్ ఉంది.కొత్తగా వస్తున్న ఈ ఫోన్ 6.7 ఇంచులు కలిగి ఉండి.. ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లేతో వస్తుంది. క్వాల్కం స్నాప్​డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ కలిగి ఉంది. 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 3.1 సపోర్టు తో నార్డ్ సీఈ 4 లో 50 మెగా పిక్సెల్ కెమెరా, 8 మెగా పిక్సెసల్ అల్ట్రా వైడ్ డ్యూయెల్ కెమెరా ఉంది. 16 మెగా పిక్సల్ సెల్ఫీ షూటర్ ఫ్రంట్ సైడ్ అందించారు. 100 వాట్స్ తో చార్జింగ్ సపోర్ట్ చేసే 5500 ఎంఏహెచ్ బ్యాటీరీ అందిస్తున్నారు.

ఇన్ఫీ నిక్స్ జీటీ 20 ప్రో : ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టీమేట్ ఎస్ఓసీ తో పనిచేస్తుంది. ఇందులో 8 జీబీ, 12 జీబీ LPDDR5X ర్యామ్ కలిగి ఉంది. 5 ఈ ఫోన్ పిక్సెల్ వర్క్స్ ఎక్స్ 5 టర్బో గేమింగ్ ఆడేందుకు చిప్ సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ లో జీటీ 20 ప్రో స్మార్ట్ ఫోన్ 6.78 ఇంచ్ ఎల్టీ పీఎస్ అమోఎల్ ఎల్ ఈడీ డిస్ ప్లే కలిగి ఉంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్.. 1300 నిట్స్ పిక్ బ్రైట్ నెస్ కలిగి ఉంది. 5000 ఎంఏ‌హెచ్ బ్యాటరీ, 45 వాట చార్జింగ్ సపోర్ట్ కలిగి ఉంది. 108 మెగా పిక్సల్ శాంసంగ్ హెచ్ఎం6 సెన్సార్, 2 మెగా పిక్సెల్ సెకండరీ సెన్సార్ కూడా కలిగి ఉంది. ముందు వైపు 32 మెగా పిక్సల్ కెమెరా కలిగి ఉంది

 

Show comments