iPhone వాడుతున్నారా? అయితే మీకు కేంద్రం నుంచి షాకింగ్ న్యూస్!

Apple: యాపిల్ ప్రోడక్ట్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. ఐఫోన్ లకి ఉండే క్రేజ్ వేరు.

Apple: యాపిల్ ప్రోడక్ట్స్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ అంతా ఇంత కాదు. ఐఫోన్ లకి ఉండే క్రేజ్ వేరు.

మీరు యాపిల్ ప్రోడక్ట్స్ వాడుతున్నారా ? అయితే మీకో షాకింగ్ న్యూస్. యాపిల్ కి చెందిన ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు పంపింది. ఇంతకీ ఏమైంది? పూర్తి వివరాల్లోకి వెళితే.. దేశంలో చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువ అవుతున్నాయి. మన ఫోన్లు చాలా ఈజీగా హ్యాక్ అవుతున్నాయి. ఇక తాజాగా యాపిల్ ప్రోడక్ట్స్ సాఫ్ట్‌వేర్లలో కూడా లోపాలున్నాయట. అందువల్ల అనధికారికంగా డేటాను దొంగతనం చేసే వీలుందని ఇండియన్‌ కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ తెలిపింది. హ్యాకర్లు దీనిని తమకు అనువుగా మార్చుకునే ఛాన్స్ కచ్చితంగా ఉందని అందువల్ల జాగ్రత్త పడాలని హెచ్చరికలు చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ షాకింగ్ న్యూస్ గా మారింది. ఎందుకంటే సెక్యూరిటీ విషయంలో యాపిల్ కంపెనీ టాప్ లో ఉంటుంది. అలాంటి యాపిల్ ఫోన్లు ఇలా హ్యాక్ అవ్వడం మాత్రం కచ్చితంగా ఆందోళన కలిగించే అంశం. అయితే అన్నీ వెర్షన్ లు హ్యాక్ కి గురవ్వవు. కేవలం కొన్ని వెర్షన్లు మాత్రమే హ్యాక్ కి గురయ్యే ప్రమాదం ఉంది.

ఇక ఆ వెర్షన్లు ఏమిటంటే.. యాపిల్‌ ఐవోఎస్‌, ఐపాడ్‌ ఓఎస్‌లలో 18.1.1కి ముందు వెర్షన్లు, 17.7.2 ముందు వెర్షన్లు, యాపిల్‌ మ్యాక్‌ఓఎస్‌ సుక్వోయా 15.1.1 వెర్షన్లకు ముందువి కచ్చితంగా హ్యాక్ కి గురయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ వెర్షన్ వాడే యూజర్లు వెంటనే తన IOS ను అప్డేట్ చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. లేదంటే పర్సనల్ డేటా చోరీకి గురయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కొన్నేళ్ల నుంచి కేంద్ర ప్రభుత్వం తరచూ యాపిల్‌ ఫోన్ల సెక్యూరిటీ విషయంలో యూజర్లకు హెచ్చరికలు పంపుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ ఏడాది ఏప్రిల్‌లో కూడా ఇలాంటి హెచ్చరిక ఒకటి జారీ చేసింది. అలాగే ఆగస్ట్ నెలలో కూడా కేంద్ర ప్రభుత్వం యాపిల్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది.

అప్పుడు ఐఓఎస్‌, ఐప్యాడ్‌ ఓఎస్‌ 17.4.1, 16.7.7 కంటే ముందు వెర్షన్ల, సఫారీ 17.4.1, మ్యాక్‌ఓఎస్‌ వెంట్యురా 13.6.6, మ్యాక్‌ఓఎస్‌ సొనోమా 14.4.1, యాపిల్‌ విజన్‌ ఓఎస్‌ 1.1.1 కంటే ముందు వెర్షన్లలో ఈ లోపాలను గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. కాబట్టి మీరు మీ ఐఫోన్ లను కచ్చితంగా అప్ డేట్ చేయండి. లేదంటే కచ్చితంగా మీ పర్సనల్ డేటాతో పాటు మీ బ్యాంక్ బ్యాలెన్స్ కూడా హ్యాకర్లు దోచుకునే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments