అంధులకు దారి చూపించే AI కళ్ళజోడు! దీని ఫీచర్స్ తెలిస్తే వావ్ అనాల్సిందే!

AI Spects: AI బాగా డెవలప్ అవుతుంది. తాజాగా అంధులకు ఉపయోగపడే కళ్ళజోడు వచ్చింది.

AI Spects: AI బాగా డెవలప్ అవుతుంది. తాజాగా అంధులకు ఉపయోగపడే కళ్ళజోడు వచ్చింది.

టెక్నాలజీ అనేది ఒక వరం. మనిషి సృష్టించిన అద్భుతం.. దీన్ని సరిగ్గా వాడుకుంటే ఎన్నో మంచి పనులు చేయవచ్చు. ఈ టెక్నాలజీ యుగంలో డెవలప్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎన్నో రకాల అద్భుతాలు చేయవచ్చు. ఏఐ టెక్నాలజీతో ఎన్నో అసాధ్యమైన పనులను సుసాధ్యం చేయవచ్చు. కళ్ళు లేని వారికి కూడా దారి చూపించవచ్చు. అంధుల కోసం AI కళ్లద్దాలు వస్తున్నాయి. వీటి ద్వారా ఎంత దూరమైన కూడా చాలా ఈజీగా నడిచి వెళ్లిపోవచ్చు. ఇంకా అంతే కాదు చదవడం, రాయడం కూడా సులభంగా నేర్చుకోవచ్చు. ఇవి పూర్తిగా అందుబాటులోకి వస్తే అంధులు ఎవరి సాయం లేకుండా ఎక్కడికైనా ఈజీగా వెళ్ళవచ్చు. ఇక ఈ AI కళ్ళజోడు గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

అంధులు బయటకు వెళ్లేందుకు ఈ కళ్లద్దాలు దారి చూపిస్తాయి. అంతేకాకుండా.. టెక్స్ట్‌ టు స్పీచ్‌ సాయంతో అక్షరాలను కూడా ఈ అద్దాలు చదివి వినిపిస్తాయి.కిమ్స్‌ ఫౌండేషన్, డీఆర్‌డీవో మాజీ శాస్త్రవేత్త డాక్టర్‌ వి.భుజంగరావు ఆధ్వర్యంలో ఈ కళ్లద్దాలను డిజైన్ చేశారు.. తాజాగా వీటిని లాంచ్ చేశారు. మొదటి విడతలో 100 మంది అంధ విద్యార్థులకు వీటిని డిస్ట్రిబ్యూట్ చేశారు. త్వరలో మరింత టెక్నాలజీతో వీటిని డిజైన్ చేయనున్నట్లు తెలిపారు. ఇక ఈ కళ్లద్దాల ఒక్కో జతని తయారు చేయడానికి రూ.10,000 దాకా ఖర్చు అయిందని తెలిసింది.ఈ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్మార్ట్ కళ్లద్దాల్లో కంప్యూటర్ విజన్, మెషీన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ వాడారు. అలాగే ఇందులో USB, బ్యాటరీ ఫిక్స్ చేశారు. వీటి ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. దీని కోసం స్పెషల్ గా ఒక యాప్‌ కూడా ఉంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకోని ఈ స్పెట్స్ ని వాడాలి. వీటిలో ఒక చిప్ సెట్ ని ఫిక్స్ చేశారు. అందులో వ్యక్తుల ముఖాలు, ముఖ్యమైన ప్రదేశాలు, ఇంటి చిరునామా వంటి ఇన్‌ఫర్మేషన్ ముందుగానే మనం అప్‌లోడ్ చేసుకోవాలి. దాదాపు 400 మంది ముఖాలను USB మెమోరీలో పేర్లతో స్టోర్ చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు ఇలా అందరి పేర్లు, ముఖాలను స్టోర్ చేసుకోవచ్చు. అందువల్ల అంధులు ఎప్పుడైనా గుర్తించలేనపుడు ఈ కళ్లద్దాలు ఎదురుగా ఉన్న వ్యక్తులను గుర్తిస్తాయి.

ఈ కళ్లద్దాలు యాప్‌లో ఉన్న టెక్స్ట్ టు స్పీచ్ రీడింగ్ అసిస్టెంట్ టెక్నాలజీ ద్వారా బుక్‌లోని టెక్స్ట్‌ను చదివి వినిపిస్తాయి. అంతేకాకుండా దూర ప్రాంతాలు వెళ్లినపుడు అక్కడ ఉండే బోర్డులని కూడా చదివి వినిపిస్తాయి. అయితే ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే ముందుగానే ఎక్కడ నుంచి ఎక్కడకు వెళ్లాలని అనుకుంటున్నారో అక్కడి ప్రదేశాలను స్టోర్ చేసుకోవాలి. ఈ విధంగా ఈ AI కళ్ళజోడు అంధులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నిజంగా అద్భుతం కదూ.. ఇక ఈ స్మార్ట్ కళ్లజోడు గురించి మీరేమి అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments