ఈ రెండు కోర్సులు నేర్చుకున్నారంటే Job పక్కా.. లక్షల్లో జీతం!

Job: ఈ రోజుల్లో చాలా మంది కూడా నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నారు. సరైన స్కిల్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణమే.

Job: ఈ రోజుల్లో చాలా మంది కూడా నిరుద్యోగ సమస్యతో బాధ పడుతున్నారు. సరైన స్కిల్ లేకపోవడం కూడా దీనికి ప్రధాన కారణమే.

ప్రస్తుతం దేశంలో నిరుద్యోగ సమస్య ఏ రకంగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంవత్సరానికి ఎన్నో లక్షల మంది గ్రాడ్యుయేట్లు కాలేజీల నుంచి బయటకి వస్తున్నారు. ఉద్యోగాలు రాక ఖాళీగా ఉంటున్నారు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా కానీ చాలా మంది కూడా తాము చదువుకున్న కోర్స్ లకు సంబంధించి జాబ్స్ చేయట్లేదు. వేర్వేరు రంగాలలో ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది తక్కువ జీతాలకే పని చేస్తున్నారు. చాలీ చాలనీ జీతాలతో అవస్థలు పడుతున్నారు. అలాగే చాలా మంది కూడా చదువయ్యాక ఏదోక సాఫ్ట్ వేర్ కోర్స్ నేర్చుకొని సాఫ్ట్ వేర్ జాబ్స్ చేసుకుంటున్నారు. కానీ సాఫ్ట్ వేర్ రంగంలో కూడా ఎక్కువ కాలం పని చేయలేకపోతున్నారు. దానికి కారణం సరైన స్కిల్ లేకపోవడం. అలాగే చాలా కంపెనీల్లో కూడా లే ఆఫ్స్ ఎక్కువైపోతున్నాయి. అయితే టెక్నాలజీకి అనుగుణంగా కొన్ని కోర్సులు వచ్చాయి. అవి నేర్చుకుంటే మీ లైఫ్ సెట్ ఐనట్టే. ఇంతకీ ఆ కోర్సులు ఏంటి? వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

మనందరికీ తెలిసిందే.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది.అలాగే మెషీన్ లెర్నింగ్ కూడా దూసుకుపోతుంది. ఈ రెండు కోర్సులు నేర్చుకున్నారంటే మీకు ప్రపంచంలో ఎక్కడైనా కూడా జాబ్ వస్తుంది. ఈ కోర్సుల్లో పట్టు సాధించిన వారికి చాలా కంపెనీలు కూడా పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నాయి. లక్షల్లో జీతాలు ఇస్తున్నాయి. ఏఐ, మెషిన్ లెర్నింగ్ (AI/ML) టెక్నాలజీతో కూడిన వైట్ కాలర్ జాబ్స్‌ అక్టోబర్ లో 10 శాతం పెరిగాయని నౌక్రి జాబ్‌ స్పీక్ ఇండెక్స్ తెలిపింది. అందుకే ఏఐ, మిషన్ లెర్నింగ్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇంటర్మీడియట్ అయిపోయాక సరిగ్గా అవగాహన లేకుండా తిక మక పడుతున్నారు. వారు ఈ కోర్సులు నేర్చుకుంటే ఫ్యూచర్ లో బాగా సెటిల్ అవ్వొచ్చు. మనకు హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూతో పాటు కొన్ని కాలేజీలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగంలో బీఈ, బీటెక్ కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి. అలాగే ఐఐటీ, ఎన్‌ఐటీ వంటి కాలేజీలు ఏఐ, మెషిన్ లెర్నింగ్ లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. అలాగే ప్రైవేట్ వర్చువల్ యూనివర్సిటీలు కూడా మెషీన్ లెర్నింగ్, ఏఐకి సంబంధించిన కోర్సులను అందిస్తున్నాయి. తమిళనాడులోని అన్నా యూనివర్సిటీ ఇంకా దాని కింద రన్ అయ్యే కొన్ని కాలేజీల్లో బీఈ, బీటెక్ కోర్సులలో ఏఐ సంబంధిత సబ్జెక్టులను నేర్పిస్తున్నారు.

రాబోయే కాలంలో ఏఐ, మెషీన్ లెర్నింగ్ అవసరం చాలా ఉంటుంది కాబట్టి.. నిరుద్యోగులు ఈ కోర్సులను నేర్చుకుంటే చాలా మంచిది. బయట కూడా ఈ కోర్సులను నేర్పించే చాలా ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ఉన్నాయి. మనం ఆన్లైన్ లో కూడా నేర్చుకోవచ్చు. ఈ కోర్సులను నేర్చుకోవడం వల్ల ఫ్రీ లాన్సర్ గా కూడా అవకాశాలు ఉంటాయి. గూగుల్ లో freelancer.in అని టైప్ చేస్తే freelancer వెబ్ సైట్ ఓపెన్ అవుతుంది. మీరు AI, మెషీన్ లెర్నింగ్ కోర్సుల్లో పట్టు సాధిస్తే ఇందులో ఈజీగా జాబ్ పొందవచ్చు. ఇంకా లింక్డ్ ఇన్, నౌక్రీ వంటి వెబ్ సైట్లలో కూడా మంచి ప్యాకేజ్ ఇచ్చే కంపెనీలు దొరుకుతాయి. దాంతో మీరు ఈజీగా జాబ్ సంపాదించవచ్చు. కానీ ఈ కోర్సులపై గట్టి పట్టు ఉండాలి. ఇదీ సంగతి. ఇక ఈ సమాచారం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments