SNP
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో దుమ్మరేపాడు. అయితే.. జైస్వాల్ ఈ స్థాయికి ఇంత త్వరగా వచ్చేందుకు ఓ వ్యక్తి ఉన్నాడు. జైస్వాల్ జీవితానికి అతను దేవుడిలాంటోడు. ఆ వ్యక్తి గురించి, జైస్వాల్ పడిన కష్టాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో జైస్వాల్ అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీతో దుమ్మరేపాడు. అయితే.. జైస్వాల్ ఈ స్థాయికి ఇంత త్వరగా వచ్చేందుకు ఓ వ్యక్తి ఉన్నాడు. జైస్వాల్ జీవితానికి అతను దేవుడిలాంటోడు. ఆ వ్యక్తి గురించి, జైస్వాల్ పడిన కష్టాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
SNP
యశస్వి జైస్వాల్.. టీమిండియాకు దొరికిన ఒక వజ్రాయుధం. భారత క్రికెట్ భవిష్యత్తుగా కనిపిస్తున్న ఆశాదీపం. ఈ కుర్రాడి పేరు ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో మారుమోగిపోతుంది. ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో తన విశ్వరూపం చూపిస్తున్నాడీ యంగస్టర్. ఇప్పటికే జరిగిన మూడు టెస్టుల్లో ఏకంగా రెండు డబుల్ సెంచరీలు బాది ఔరా అనిపించాడు. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లోనూ 80 పరుగులు చేసి మంచి ఇన్నింగ్స్ ఆడాడు. మొత్తంగా ఈ టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా ఉన్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లాంటి సీనియర్ స్టార్ క్రికెటర్లు లేకపోయినా.. టీమిండియాకు నేనున్నానంటూ రెచ్చిపోతున్నాడు. అతని ఆటకు భారత క్రికెట్ అభిమానులే కాదు.. యావత్ ప్రపంచమే ఫిదా అయిపోతోంది.
22 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పుడే ఇలా ఆడుతుంటే.. ఇంకాస్త అనుభవం వస్తే.. బౌలర్లకు నిద్రలేకుండా చేస్తాడంటూ మాజీ క్రికెటర్లు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. జైస్వాల్ ఈ స్థాయికి రావడానికి పడిన కష్టాలు, చేసిన శ్రమ అంతా ఇంతా కాదు. చిన్న వయసులోనే జీవితానికి సరిపడా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కానీ, అవన్నీ దాటి క్రికెట్ లోకం మొత్తం తనకు దాసోహం అయ్యేలా చేసుకుంటున్నాడు. జైస్వాల్ జర్నీలో ఎంతో మంది అతనికి సాయం అందించారు. కానీ, ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కారణంగా జైస్వాల్ తలరాతే మారిపోయింది. ఇంత తక్కువ టైమ్‌లో జైస్వాల్ టాలెంట్ ఈ ప్రపంచానికి తెలిసిందంటే.. అతని వల్లే. అందుకే ఆయనే జైస్వాల్ జీవితంలో దేవుడు. ఆ వ్యక్తి పేరు జుబిన్ భారుచా. పూర్తి స్టోరీని ఇప్పుడు తెలుసుకుందాం..
ఉత్తర్ ప్రదేవ్‌లో పుట్టిన జైస్వాల్‌కు చిన్నతనంలోనే క్రికెట్ అవ్వాలనే కోరిక అతని మనసులో బలంగా నాటుకుపోయింది. పెద్ద క్రికెటర్‌ని అవ్వాలని జైస్వాల్ కలలు కనేవాడు. సచిన్ అంత పెద్ద క్రికెట్ అవ్వాలంటే.. ఇక్కడుంటే కుదరదని, ముంబై వెళ్లి మంచి ట్రైనింగ్ తీసుకోవాలని స్నేహితులు చెప్పిన మాటతో జైస్వాల్ ఇంటినుంచి పారిపోయి.. ముంబై మహానగరానికి చేరుకున్నాడు. ఇక్కడి నుంచి జైస్వాల్‌కు కష్టాలు మొదలయ్యాయి. అప్పటి వరకు ఇంట్లో తల్లిచాటు బిడ్డలా ఎంతో గారాబంగా పెరిగిన జైస్వాల్‌కు ముంబైలో ఎవరూ తెలియదు. ఎక్కడుండాలో అర్థం కాలేదు. కానీ, క్రికెట్ అవ్వాలనే అతని సంకల్పం ముందు అవన్నీ చిన్న చిన్న సమస్యలానే కనిపించాయి.
ఏదో ఒక విధంగా క్రికెట్ ప్రాక్టీస్‌తో పాటు.. పొట్టకూటి కోసం డెయిరీ ఉత్పత్తులు విక్రయించే షాపులో రాత్రి పూట పనికి కుదిరాడు. ముంబైలోని ప్రపంచ ప్రఖ్యాత అజాద్ మైదానంలో రోజంతా క్రికెట్ ప్రాక్టీస్ చేసి.. రాత్రిపూట ఆ డెయిర్ షాప్‌లో పనిచేసేవాడు. అలా పొద్దంతా క్రికెట్ ప్రాక్టీస్‌తో అలసిపోయి పనిపై దృష్టిపెట్టలేకపోవడంతో ఆ డెయిరీ షాపు యజమాని జైస్వాల్‌ను పనిలో నుంచి తీసేశాడు. ‘కనీసం ఈ రాత్రికి నన్ను ఇక్కడ పడుకోనివ్వండి’ అంటూ జైస్వాల్ అతన్ని వేడుకున్నాడు. గుండెల్ని పిండేసే ఇలాంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి జైస్వాల్ జీవితంలో. అయితే.. ఆ మరుసటి రోజు తన కోచ్‌కు ఫోన్ చేసి.. జరిగిన విషయం చెప్పడంతో ఆయన తన ఇంటికి పిలిపించుకున్నారు. అక్కడే ఓ రెండు మూడు నెలలు ఉన్నాడు జైస్వాల్. ఆ తర్వాత క్రికెట్ క్లబ్‌లో గ్రౌండ్‌మెన్‌తో కలిసి ఉండే అవకాశం వచ్చింది. ఒక చిన్న టెంట్‌లో జైస్వాల్ చాలా కాలం గడిపాడు. ఇంటికి ఫోన్ చేసినా.. తన ఇబ్బందుల గురించి చెప్పేవాడు కాదు. ఇక్కడంతా బాగానే ఉందని అమ్మతో కూడా అబద్ధం చెప్పేవాడు.
ఇలా ఎన్నో కష్టాలు పడుతూ.. దేశవాళి క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. కానీ, జైస్వాల్ స్టోరీలో ఊహించని మలుపు మాత్రం జుబిన్ భారుచా రాకతో చోటు చేసుకుంది. ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ టీమ్‌కు డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా ఉన్న భారుచా.. యంగ్ క్రికెట్ టాలెంట్ హంట్‌లో భాగంగా జైస్వాల్‌ను చూశారు. ట్రైయల్స్ కోసం వచ్చిన జైస్వాల్.. తొలి బంతినే ఎక్రాస్ ది స్టంప్స్ వచ్చి స్క్వైర్ వెనుక నుంచి అద్భుతమైన ఫ్లిక్ షాట్ ఆడాడు. ఆ ఒక్క షాట్ చూసి.. భాచురా ఫిదా అయిపోయాడు. అంతే.. జైస్వాల్ తలరాతే మారిపోయింది. రాజస్థాన్ రాయల్స్ కోసం జైస్వాల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టి, అతనికి స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించి.. అతని నాచుర్యల్ టాలెంట్‌కు మరింత పదునుపెట్టించారు. ఒక్కో షాట్‌ను 300 సార్లు ప్రాక్టీస్ చేయించి, 100 మీటర్ల దూరం కొట్టేలా జైస్వాల్‌ను ట్రైన్ చేసి.. రాజస్థాన్ రాయల్స్ తరుఫున 2020 సీజన్‌లో బరిలోకి దింపారు.
అక్కడి నుంచి జైస్వాల్ ఆట ఏంటో మనమంతా చూస్తున్నాం. భారత ఫస్ట్ క్లాస్ క్రికెటర్ అయినా భారుచా 2008 నుంచి 2015 వరకు రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. తిరిగి 2018 నుంచి డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా కొనసాగుతున్నారు. ఆయన కారణంగా జైస్వాల్ ఐపీఎల్‌లోకి చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చాడు. పైగా అద్భుతమైన ట్రైనింగ్‌ను పొందాడు. ప్రస్తుతం జైస్వాల్ ఈ రేంజ్‌లో రాణిస్తున్నాడంటే.. జుబిన్ భారుచా దేవుడి రూపంలో అతని జీవితంలోకి రావడమే. మరి జైస్వాల్ సక్సెస్‌తో పాటు అతని జర్నీలో జుబిన్ భారుచా రోల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
JAISWAL SMASHED 3 CONSECUTIVE SIXES AGAINST ANDERSON 🔥🇮🇳pic.twitter.com/HsAoK1XpTt
— Johns. (@CricCrazyJohns) February 18, 2024