14 ఏళ్ల క్రితం భారత తరఫున వరల్డ్‌ కప్‌ ఆడి.. ఇప్పుడు పాక్‌ను ఓడించాడు! ఎవరీ సౌరభ్‌?

14 ఏళ్ల క్రితం భారత తరఫున వరల్డ్‌ కప్‌ ఆడి.. ఇప్పుడు పాక్‌ను ఓడించాడు! ఎవరీ సౌరభ్‌?

టీ 20 వరల్డ్ కప్ అట్టహాసంగా సాగిపోతున్నది. గురువారం అమెరికా, పాక్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో యూఎస్ఏ పాక్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో సౌరభ్ చేసిన అద్భుతమైన బౌలింగ్ యూఎస్ఏకు సంచలన విజయాన్ని అందించింది.

టీ 20 వరల్డ్ కప్ అట్టహాసంగా సాగిపోతున్నది. గురువారం అమెరికా, పాక్ జట్ల మధ్యన జరిగిన మ్యాచ్ లో యూఎస్ఏ పాక్ ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ లో సౌరభ్ చేసిన అద్భుతమైన బౌలింగ్ యూఎస్ఏకు సంచలన విజయాన్ని అందించింది.

ఐపీఎల్ జోష్ తగ్గక ముందే క్రికెట్ లవర్స్ కు టీ20 వరల్డ్ కప్ ఫుల్ కిక్ ఇస్తోంది. జూన్ 04న ప్రారంభమైన ఈ టోర్నీ హోరాహోరీగా సాగుతోంది. టీ20 ప్రపంచకప్ లో సంచలన విజయాలు నమోదవుతున్నాయి. చిన్న జట్లు పెద్ద జట్లకు గట్టిపోటీనిస్తూ విజయదుందిభి మోగిస్తున్నాయి. టోర్నీలో భాగంగా గురువారం అమెరికా, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టు అమెరికా పాక్ ను మట్టికరిపించింది. అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కనబర్చిన యూఎస్ఏ పాక్ ను చిత్తు చేసింది. అయితే అమెరికా విజయంలో కీలకపాత్ర పోషించాడు యువ క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్. నిప్పులు చెరిగే బౌలింగ్ తో పాక్ కు ముచ్చెమటలు పట్టించి అమెరికాకు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు.

టీ 20 వరల్డ్ కప్ లో అమెరికా విజయంతో సౌరభ్ నేత్రవల్కర్ పేరు క్రికెట్ ప్రపంచంలో మారుమ్రోగుతోంది. నిన్న జరిగిన మ్యాచ్ లో నేత్రవల్కర్ పొదుపుగా బౌలింగ్ చేస్తూ పాక్ తక్కువ స్కోర్ చేయడంలో కీలకంగా మారాడు. నిర్ణీత 20 ఓవర్లలో పాక్, యూఎస్ఏ జట్ల స్కోర్లు సమం అయ్యాయి. దీంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. సూపర్ ఓవర్ లో నేత్రవల్కర్ సూపర్ బౌలింగ్ తో అమెరికా పాక్ ను చిత్తుగా ఓడించి చారిత్రాత్మక విజయాన్నందుకుంది. సూపర్ ఓవర్‌లో 19 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను ఒక వికెట్ తీసి 13 పరుగులకే పరిమితం చేశాడు. ఈ మ్యాచ్ లో 04 ఓవర్లు వేసిన నేత్రవల్కర్ 18 రన్స్ ఇచ్చి పాక్ బ్యాటర్లు రిజ్వాన్, ఇఫ్తికార్ అహ్మద్‌ వికెట్లను పడగొట్టాడు. సంచలన బౌలింగ్ తో అద్భుతం చేసిన నేత్రవల్కర్ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారాడు. దీంతో సోషల్ మీడియాలో నేత్రవల్కర్ ఎవరా అని నెటిజన్లు జల్లెడపడుతున్నారు. అయితే సౌరభ్‌ ముంబై క్రికెటర్. ఇతడు గతంలో భారత్ తరఫున అండర్-19 ప్రపంచ కప్ లో పాల్గొన్నాడు.

2010 అండర్-19 ప్రపంచ కప్ కోసం భారత్ సౌరభ్‌ను ఎంపిక చేసింది. అండర్ -19 వరల్డ్ కప్‌లో సౌరభ్.. 6 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టాడు. అప్పుడు పాకిస్థాన్‌తో క్వార్టర్ ఫైనల్లో భారత్ ఓడి.. సెమీస్‌కు చేరుకోలేకపోయింది. ఆ మ్యాచ్ లో భారత జట్టు తొలుత 114 రన్స్ చేయగా.. పాక్ 22.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. అప్పుడు నేత్రవల్కర్ 5 ఓవర్లలో వికెట్ తీసి 16 పరుగులు చేశాడు. అప్పుడు ఇండియాను గెలిపించలేకపోయిన సౌరభ్.. ఇప్పుడు 14 ఏళ్ల తర్వాత అమెరికా తరఫున ఆడి పాక్‌ను ఓడించడు. కాగా అప్పుడు పాక్ జట్టులో ఆడిన బాబర్ అజామ్ ప్రస్తుతం పాక్ కెప్టెన్‌గా ఉండటం గమనార్హం. అండర్-19 ప్రపంచ కప్ తర్వాత సౌరభ్‌ పై చదువుల కోసం అమెరికాకు వెళ్లి ప్రస్తుతం అమెరికా క్రికెట్ టీమ్‌కు ఎంపికై మెరుగైన ఆటతో రాణిస్తున్నాడు.

Show comments