అద్బుత రికార్డుతో అరంగేట్రం చేసిన జైస్వాల్! ఆ లిస్ట్ లో..

  • Author Soma Sekhar Published - 04:47 PM, Thu - 13 July 23
  • Author Soma Sekhar Published - 04:47 PM, Thu - 13 July 23
అద్బుత రికార్డుతో అరంగేట్రం చేసిన జైస్వాల్! ఆ లిస్ట్ లో..

వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా టీమిండియాలోకి అరంగేట్రం చేశారు యంగ్ ప్లేయర్స్ యశస్వీ జైశ్వాల్, ఇషాన్ కిషన్. వికెట్ కీపర్ గా ఇషాన్ కిషన్, ఓపెనర్ గా జైశ్వాల్ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక తొలి మ్యాచ్ లోనే తన సూపర్ హిట్టింగ్ తో అదరగొట్టాడు జైశ్వాల్. కెప్టెన్ రోహిత్ శర్మకు జోడీగా దిగిన జైశ్వాల్.. అతడి కంటే ధాటిగా ఆడాడు. అయితే అరంగేట్రంలోనే అద్భుతమైన రికార్డును నెలకొల్పాడు యశస్వీ జైస్వాల్. ఈ రికార్డు టీమిండియా దిగ్గజాలకు సైతం సాధ్యం కాలేదనే చెప్పాలి.

యశస్వీ జైస్వాల్.. 2023 ఐపీఎల్ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ తరపున అద్బుతమైన ప్రతిభ కనబరిచాడు. దాంతో సెలక్టర్లు అతడికి టీమిండియాలో చోటు కల్పించారు. వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ ద్వారా భారత్ తరపున అరంగేట్రం చేశాడు ఈ యంగ్ ప్లేయర్. అయితే ఎంట్రీతోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు జైస్వాల్. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అత్యధిక సగటుతో టీమిండియాలోకి అడుగుపెట్టిన మూడో ప్లేయర్ గా నిలిచాడు జైస్వాల్. 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 26 ఇన్నింగ్స్ లు ఆడిన జైస్వాల్.. మెుత్తం 1845 పరుగులు చేశాడు. వాటిలో 9 శతకాలతో పాటుగా.. 2 అర్ద శతకాలు కూడా ఉన్నాయి. ఈ మ్యాచ్ ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు జైస్వాల్.

ఈ జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు టీమిండియా మాజీ ఆటగాడు వినోద్ కాంబ్లీ. అతడు 27 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ ల్లో 88.37 సగటుతో టీమిండియాలోకి అరంగేట్రం చేశాడు. అతడి తర్వాత ప్రవీణ్ అమ్రే 23 ఫస్ల్ క్లాస్ మ్యాచ్ ల్లో 81.23 సగటుతో భారత జట్టులోకి ప్రవేశించాడు. జైస్వాల్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో తుపాన్ బ్యాటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తనదైన ఎటాకింగ్ గేమ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించగలడు ఈ బక్కపలచని కుర్రాడు.

ప్రస్తుతం విండీస్ పై కూడా అదే ఎటాకింగ్ గేమ్ ను ఆడుతున్నాడు జైస్వాల్. విండీస్ తో మ్యాచ్ లో తొలిరోజు ఆట ముగిసే సరికి 40 పరుగులతో క్రీజ్ లో ఉన్నాడు. తొలి వికెట్ కు రోహిత్ తో కలిసి ఇప్పటికే 80 పరుగులు జోడించాడు జైస్వాల్. మరి రాబోయే రోజుల్లో టీమిండియాకు జైస్వాల్ వెన్నముకగా మారతాడన్న వాదనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: విరాట్ కోహ్లీని టీజ్ చేసిన ఇషాన్ కిషన్! వీడియో వైరల్..

Show comments