Yashasvi Jaiswal: జైస్వాల్ ఆశలు వదిలేసుకోవాలి.. దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

భారత యువ కెరటం యశస్వి జైస్వాల్​ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. అయితే అతడు ఆశలు వదిలేసుకోవాలని అంటున్నాడు సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్.

భారత యువ కెరటం యశస్వి జైస్వాల్​ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. అయితే అతడు ఆశలు వదిలేసుకోవాలని అంటున్నాడు సీనియర్ క్రికెటర్ దినేష్ కార్తీక్.

భారత యువ కెరటం యశస్వి జైస్వాల్​ తనకు దొరికిన ప్రతి ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాడు. ఛాన్స్ ఇస్తే చాలు చెలరేగి తానేంటో నిరూపించుకుంటున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్​తో జరిగిన టెస్ట్ సిరీస్​లోనూ పరుగుల వరద పారించాడు. ఆ ఫార్మాట్, ఈ ఫార్మాట్ అనే తేడాల్లేకుండా ఎందులో అవకాశం వచ్చినా బౌలర్లను చీల్చి చెండాడుతున్నాడు. టీమిండియా ఫ్యూచర్​ స్టార్​గా పేరు తెచ్చుకున్న జైస్వాల్.. టీ20లు, టెస్టుల్లో జట్టులో సెట్ అయ్యాడు. కానీ వన్డేల్లో మాత్రం అతడు ఇంకా పర్మినెంట్ ప్లేయర్​ కాలేదు. రోహిత్ శర్మకు జతగా శుబ్​మన్ గిల్ రూపంలో సాలిడ్ ఓపెనర్ అందుబాటులో ఉండటంతో జైస్వాల్​కు అవకాశాలు దక్కడం లేదు. గిల్​ వైస్ కెప్టెన్ కావడంతో టీమ్​లో నుంచి తీసేయడానికి లేదు. ఇది జైస్వాల్​కు ఇబ్బందికరంగా మారింది.

బైల్యాటరల్ సిరీస్​ల్లోనే టీమ్​లో చోటు దక్కించుకోలేకపోతున్న జైస్వాల్.. ఛాంపియన్స్ ట్రోఫీ లాంటి బడా టోర్నమెంట్​లో టీమ్​లోకి ఎలా వస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఫుల్ కాంపిటీషన్ మధ్య ఓపెనింగ్ స్పాట్​ను ఎలా దక్కించుకుంటాడనేది చూడాలి. ఈ విషయంపై భారత మాజీ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ రియాక్ట్ అయ్యాడు. ఇంక జైస్వాల్ ఆశలు వదులుకోవాలని అన్నాడు. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీలో అతడ్ని ఓపెనర్​గా ఆడించడం కుదిరే పని కాదన్నాడు. అయితే బ్యాకప్ ఓపెనర్​గా జైస్వాల్​ టీమ్​లో ఉంటాడని.. హిట్​మ్యాన్​తో కలసి ఓపెనింగ్ చేయడం మాత్రం కుదరదన్నాడు. గిల్ దారుణంగా విఫలమైతే తప్ప జైస్వాల్ ఆ టోర్నీలో ఓపెనర్​గా రావడం సాధ్యమయ్యే పనికాదన్నాడు. అయినా రోహిత్-గిల్ బాగా ఆడుతున్నందున వాళ్లనే కంటిన్యూ చేయాలని తెలిపాడు.

‘రోహిత్ శర్మ-శుబ్​మన్ గిల్ జోడీ బాగుంది. వీళ్లది మంచి కాంబినేషన్. జైస్వాల్​ను బ్యాకప్ ఓపెనర్​గా ఆడించొచ్చు. ఒకవేళ గిల్ ఫెయిలైతే హిట్​మ్యాన్​కు జతగా జైస్వాల్​ను మరో ఓపెనర్​గా దింపాలి. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు పెద్దగా వన్డేలు లేవు. భారత్​కు కేవలం మూడు మ్యాచ్​లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్​-గిల్ ఓపెనింగ్ చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి’ అని కార్తీక్ చెప్పుకొచ్చాడు. ఇక, వన్డేల్లో ఓపెనింగ్ తప్పితే జైస్వాల్​ ఆడేందుకు మరో స్పాట్ లేదు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ తర్వాతి పొజిషన్లలో ఆడతారు. కాబట్టి గిల్ ఫెయిలైతే తప్ప జైస్వాల్​ టీమ్​లోకి రాడు. ఈ గ్యాప్​లో ఎక్కువ వన్డేలు జరిగి అతడు ప్రూవ్ చేసుకుంటే ఛాన్స్ వచ్చేదేమో.  కానీ భారత్ మూడు వన్డేలు మాత్రమే ఆడనుంది. మరి.. రోహిత్​కు జతగా గిల్, జైస్వాల్​లో ఎవరు ఓపెనర్​గా వస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments