ఆ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉంటా! రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

  • Author singhj Published - 01:33 PM, Wed - 15 November 23

న్యూజిలాండ్​తో నాకౌట్ మ్యాచ్​కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉంటానన్నాడు. హిట్​మ్యాన్ అసలు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూజిలాండ్​తో నాకౌట్ మ్యాచ్​కు ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉంటానన్నాడు. హిట్​మ్యాన్ అసలు ఏమన్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 01:33 PM, Wed - 15 November 23

కొన్ని వారాలుగా క్రికెట్ ఆడియెన్స్​ను ఎంతగానో అలరిస్తున్న వన్డే వరల్డ్ కప్-2023 ఆఖరి దశకు చేరుకుంది. భారత్-న్యూజిలాండ్, ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా నడుమ నాకౌట్ పోరు జరగనుంది. సెమీస్​లో గెలిచే టీమ్స్ క్రికెట్​లో అత్యంత ప్రతిష్టాత్మకమైన కప్పు కోసం తుదిపోరులో తలపడతాయి. ఫస్ట్ సెమీఫైనల్​లో భాగంగా టీమిండియా, న్యూజిలాండ్​ల మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇవాళ మ్యాచ్ జరగనుంది. ఈ వరల్డ్ కప్​లో భారత్​ తరఫున ఎందరో హీరోలుగా నిలిచారు. అయితే ఈ మ్యాచ్​లో ఎవరు బాగా ఆడి టీమ్​ను విజేతగా నిలుపుతారనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్​కు అద్భుతమైన స్టార్టింగ్ ఇస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మ్యాచ్​లో కీలకం కానున్నాడు. అతడు ఎప్పటిలాగే మంచి స్టార్ట్ ఇస్తే భారత్​కు తిరుగుండదనే చెప్పాలి.

మెగా టోర్నీలో 500 పరుగుల మార్కును దాటేసిన రోహిత్ శర్మ.. బౌలర్లు, ఫీల్డర్లకు విలువైన సూచనలు ఇస్తున్నాడు. కరెక్ట్ టైమ్​లో డేరింగ్ డెసిజన్స్ తీసుకుంటూ టీమ్​ను ముందుండి నడిపిస్తున్నాడు హిట్​మ్యాన్. యంగ్ ఓపెనర్​ శుబ్​మన్ గిల్​తో కలసి అతడు మంచి ఆరంభాలు ఇస్తున్నాడు కాబట్టే ఆ తర్వాత వస్తున్న విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్​లు మరింత స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నారు. ఒకవేళ కింగ్ కోహ్లీ ఔటైనా ఆఖరి వరకు నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు రోహిత్. ఈ వరల్డ్ కప్​లో పలుమార్లు సెంచరీ చేసే ఛాన్స్ వచ్చినా టీమ్ కోసం వేగంగా ఆడే క్రమంలో ఔటయ్యాడు హిట్​మ్యాన్. స్వార్థం చూసుకోకుండా జట్టు కోసం ఆడుతూ కెప్టెన్ అంటే ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు. అలాంటి రోహిత్ నాకౌట్ మ్యాచ్​కు ముందు తన కెరీర్ గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ తర్వాత క్రికెట్​కు దూరంగా ఉంటానన్నాడు.

‘నాకు ఓ ఫ్యామిలీ ఉంది. క్రికెట్​తో పాటు నా కుటుంబం గురించీ ఆలోచిస్తుంటా. ఇది చాలా మంచి విషయమని అనుకుంటున్నా. హోటల్ రూమ్​లో ఉన్నప్పుడు నేను క్రికెట్​కు పూర్తిగా దూరంగా ఉంటా. నా ఫ్యామిలీతో కలసి వేరే విషయాలు డిస్కస్ చేస్తా. క్రికెట్​ గురించి ఆలోచించడంలో తప్పు లేదు. నేను గేమ్ గురించి ఆలోచిస్తుంటా. కానీ టైమ్ దొరికినప్పుడు మాత్రం క్రికెట్ గురించి ఆలోచించకూడదు. ఆట గురించి ఆలోచించకుండా ఉండేందుకు సమయం దొరికితే అదే పని చేయాలి. ఎందుకంటే.. మీరు రోజు మొత్తం క్రికెట్ గురించి ఆలోచించినా జరిగేదేమీ లేదు. కాబట్టి ఆ టైమ్​లో ఇతర విషయాల వైపు ఫోకస్ చేయడం బెటర్’ అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఎక్కువ ఆలోచిస్తే ఒత్తిడి పెరుగుతుందని.. అందుకే అప్పుడప్పుడు ఆలోచించకపోవడమే మంచిదన్నాడు హిట్​మ్యాన్. మరి.. ఖాళీ టైమ్​లో క్రికెట్​కు దూరంగా ఉంటానంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న సచిన్ కుమార్తె.. కన్ఫర్మ్ చేసిన క్రికెటర్!

Show comments