Mohammed Shami Success Secret: కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే చేస్తున్నా.. అందుకే ఇంత సక్సెస్: షమి

కెరీర్ స్టార్టింగ్ నుంచి అదే చేస్తున్నా.. అందుకే ఇంత సక్సెస్: షమి

  • Author singhj Published - 09:16 PM, Fri - 3 November 23

వరల్డ్ కప్​లో ఆడింది మూడే మ్యాచులు. వాటిల్లో ఏకంగా 14 వికెట్లు తీశాడు షమి. అతడి బౌలింగ్​ను ఫేస్ చేయాలంటేనే బ్యాటర్లు భయపడుతున్నారు. అలాంటి షమి సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్ కప్​లో ఆడింది మూడే మ్యాచులు. వాటిల్లో ఏకంగా 14 వికెట్లు తీశాడు షమి. అతడి బౌలింగ్​ను ఫేస్ చేయాలంటేనే బ్యాటర్లు భయపడుతున్నారు. అలాంటి షమి సక్సెస్ సీక్రెట్ ఇప్పుడు తెలుసుకుందాం..

  • Author singhj Published - 09:16 PM, Fri - 3 November 23

వన్డే వరల్డ్ కప్​-2023లో టీమిండియా వరుస విజయాలతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. రోహిత్ సేనతో మ్యాచ్ అంటేనే అవతలి జట్లు గజగజలాడుతున్నాయి. మెగా టోర్నీలో భారత్ విజయాల్లో బ్యాటర్ల కృషి ఎంతుందో బౌలర్ల కాంట్రిబ్యూషన్ కూడా అంతే ఉంది. జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమి, కుల్దీప్ యాదవ్​లు ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడేస్తున్నారు. రన్స్ ఇవ్వకుండా ప్రెజర్ పెంచి తమ వలలో చిక్కేలా చేస్తున్నారు. ముఖ్యంగా భారత పేస్ అటాక్ అద్భుతంగా రాణిస్తోంది. మొదట్లో స్వింగ్, ఆ తర్వాత సీమ్​ను రాబడుతూ వికెట్ల మీద వికెట్లు తీస్తున్నారు పేసర్లు.

ఈ వరల్డ్ కప్​లో బుమ్రా, సిరాజ్ ఫస్ట్ మ్యాచ్ నుంచి ఆడుతున్నారు. కానీ షమి మాత్రం లేట్​గా ఎంట్రీ ఇచ్చాడు. హార్దిక్ పాండ్యాకు గాయమవ్వడంతో టీమ్​లోకి వచ్చిన షమి వికెట్ల మీద వికెట్లు తీస్తూ టీమ్​ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు. జట్టులో చోటు కష్టం అనుకున్న ప్లేయర్ ఇప్పుడు మ్యాచ్ విన్నర్​గా మారాడు. ఇప్పటికే మెగాటోర్నీలో 14 వికెట్లు తీసిన షమి.. ఆఖరి వరకు ఆడితే ఇంకెన్ని వికెట్లు తీస్తాడనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. తన సక్సెస్ సీక్రెట్ ఏంటనేది లంకతో మ్యాచ్ తర్వాత రివీల్ చేశాడు షమి. తాను ఇంత బాగా రాణించడం వెనుక రాకెట్ సైన్స్ ఏమీ లేదన్నాడు. నిలకడగా లైన్ అండ్ లెంగ్త్​కు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్లే మంచి రిజల్ట్స్​ వస్తున్నాయని షమి తెలిపాడు.

కెరీర్ స్టార్టింగ్ నుంచి తాను ఒకే సూత్రాన్ని పాటిస్తున్నానని.. అదే లైన్ అండ్ లెంగ్త్ అన్నాడు షమి. బాల్​ను కరెక్ట్ ప్లేస్​లో పిచ్ చేసి రిథమ్​ను దొరకబుచ్చుకోవడానికి ప్రయత్నిస్తానన్నాడు. ‘ఫస్ట్ మ్యాచ్​ నుంచి లెంగ్త్​తో బాల్స్​ను వేస్తున్నా. ఆ ట్రిక్ వర్కౌట్ అయింది. అందుకే దాన్నే రిపీట్ చేస్తున్నా. వైట్ బాల్ క్రికెట్​లో లైన్ అండ్ లెంగ్త్ చాలా ముఖ్యం. అప్పుడే పిచ్ నుంచి మద్దతు కూడా లభిస్తుంది. నేను సక్సెస్ కావడానికి కారణం కూడా అదే. అయితే ఇలా పెర్ఫార్మ్‌ చేయడానికి మంచి ఫుడ్ తీసుకోవడంతో పాటు మానసికంగానూ ఫిట్​గా ఉండాలి’ అని షమి చెప్పుకొచ్చాడు. మరి.. వరల్డ్‌ కప్​లో షమి బౌలింగ్​ మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమ్ కంటే అదే ఇంపార్టెంటా? అంత వెంపర్లాట అవసరమా విరాట్​?

Show comments