వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎక్కువగా క్రెడిట్ ఇస్తున్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌలర్లకు కూడా మంచి పేరు వస్తోంది. కానీ ఈ క్రమంలో ఒక ప్లేయర్‌ను మాత్రం అందరూ మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.
వరల్డ్ కప్‌లో టీమిండియా వరుస విజయాలకు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి ఎక్కువగా క్రెడిట్ ఇస్తున్నారు. విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న బౌలర్లకు కూడా మంచి పేరు వస్తోంది. కానీ ఈ క్రమంలో ఒక ప్లేయర్‌ను మాత్రం అందరూ మర్చిపోతున్నట్లు కనిపిస్తోంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే వరల్డ్ కప్-2023లో భారత్‌కు ఎదురే లేకుండా పోయింది. మెగా టోర్నీలో ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ వస్తున్న టీమిండియా.. ఫేవరెట్లలో ఒకటైన ఇంగ్లండ్‌నూ మట్టికరిపించింది. లక్నో వేదికగా బట్లర్ సేనతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 100 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అకౌంట్లో వేసుకుంది. ఆఫ్ఘానిస్థాన్ చేతుల్లో ఓడిన ఇంగ్లండ్.. భారత్‌పై తమ ప్రతాపం చూపిస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఇంగ్లీష్ టీమ్ మాత్రం ఏ విభాగంలోనూ రోహిత్ సేన ముందు నిలబడలేకపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ ఇంగ్లండ్ గెలుస్తుందనిపించలేదు.
ఇంగ్లండ్‌పై విజయంతో వరల్డ్ కప్ పాయింట్స్ టేబుల్లో భారత్ మొత్తం 12 పాయింట్లతో ఫస్ట్ ప్లేస్‌కు చేరుకుంది. తద్వారా ఈసారి మెగా టోర్నీలో సెమీస్‌కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. అయితే భారత్ వరుస విజయాలకు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు బౌలర్లకే ఎక్కువ క్రెడిట్ దక్కుతోంది. రోహిత్ బ్యాటుతో రాణించడమే గాక కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకుంటూ టీమ్‌ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. కోహ్లీ విన్నింగ్ నాక్స్ ఆడుతూ టీమ్‌కు ఎదురే లేకుండా చేస్తున్నాడు. బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ ఇందులో ఒక ప్లేయర్‌కు మాత్రం కాస్త అన్యాయం జరుగుతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ వాపోతున్నారు.
టీమిండియా వరుస విజయాలకు కారకుల్లో వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఒకడు. భారత్ ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింట్లో రాహుల్ కీలక పాత్ర పోషించాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో 2 రన్స్‌కు 3 వికెట్లు పడిన టైమ్‌లో క్రీజులోకి వచ్చాడు. విరాట్ కోహ్లీతో కలసి 165 రన్స్ పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. ఆ మ్యాచ్‌లో 97 రన్స్ చేసిన రాహుల్ కొంచెంలో సెంచరీ మిస్సయ్యాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో కోహ్లీతో కలసి 83 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. కివీస్‌తో మ్యాచ్‌లోనూ విరాట్‌తో కలసి 54 పరుగులు జోడించాడు. ఆదివారం ఇంగ్లండ్‌తో పోరులోనూ కెప్టెన్ రోహిత్‌తో కలసి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.
టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి వికెట్లను కాపాడుతూనే.. స్కోరు బోర్డుపై ఒక్కో రన్ చేర్చుతూ టీమ్ గెలుపులో కీలక పాత్ర పోషిస్తున్నాడు కేఎల్ రాహుల్. అలాగే కీపింగ్‌లోనూ అద్భుతంగా డైవ్‌లు చేస్తూ క్యాచులు పడుతున్నాడు. ఆరు మ్యాచుల్లో రెండుసార్లు అతడు బెస్ట్ ఫీల్డర్ మెడల్స్ గెలుచుకున్నాడు. కెప్టెన్ రోహిత్‌కు ఫీల్డ్ ప్లేస్‌మెంట్స్, బౌలింగ్ ఛేంజెస్‌లో సలహాలు ఇస్తున్నాడు. భారత్ గెలుపులో ఇంత కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ రాహుల్‌కు మాత్రం క్రెడిట్ ఇచ్చినట్లు కనిపించడం లేదు. 2011 వరల్డ్ కప్‌లో ఇలాగే టీమిండియాను గెలిపించిన గంభీర్‌కు అంతగా పేరు రాలేదు. దీంతో గంభీర్‌లాగే ఈసారి అన్సంగ్ హీరోగా రాహుల్ మిగిలిపోతాడేమోనని ఫ్యాన్స్ భయపడుతున్నారు. మరి.. సక్సెస్ క్రెడిట్లో రాహుల్‌ను మర్చిపోవడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: బౌలింగ్‌లో రెచ్చిపోతున్న టీమిండియా.. భారత బౌలర్ల సక్సెస్ సీక్రెట్ ఏంటంటే..!
KL Rahul has been vital for India in making important partnerships in World Cup 2023:
– 165 runs with Kohli vs AUS.
– 83* runs with Kohli vs BAN.
– 54 runs with Kohli vs NZ.
– 91 runs with Rohit vs ENG. pic.twitter.com/hc2y4uc40o— Johns. (@CricCrazyJohns) October 30, 2023