అన్ని గేమ్స్లాగే క్రికెట్ కూడా. జెంటిల్మన్ గేమ్‌లో ఇంజ్యురీస్ అనేవి చాలా కామన్. అయితే గాయాలపాలైన ప్లేయర్లు కొన్నిసార్లు తక్కువ గ్యాప్‌లో మళ్లీ టీమ్‌లోకి వస్తే.. ఇంకొన్ని సార్లు మాత్రం చాలా టైమ్ తీసుకుంటారు. గాయాల తర్వాత కమ్‌బ్యాక్ ఇవ్వడం గొప్ప విషయం కాదు. కానీ మునుపటి స్థాయిలో ఆడటం, ఫిట్‌గా ఉండటం, ఫోకస్డ్గా కెరీర్‌ను మలుచుకోవడం అంత ఈజీ కాదు. రీఎంట్రీలో ఫెయిలై రేసులో వెనుకబడిపోయిన ప్లేయర్లు చాలా మందే ఉన్నారు. క్యాన్సర్ రాకముందు వరకు వరల్డ్ కప్‌తో పాటు పలు టోర్నీల్లో అదరగొట్టిన లెజెండరీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్.. మహమ్మారి నుంచి కోలుకొని తిరిగొచ్చాక మాత్రం ఆ స్థాయిలో ఆడలేకపోయాడు.
గాయాల నుంచి కోలుకొని రీఎంట్రీ ఇచ్చాక కూడా దాని ప్రభావం కొనసాగుతుంది. మళ్లీ ఇంజ్యురీ అవుతుందేమోననే భయం వెంటాడి.. గేమ్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంటుంది. రెస్ట్ తర్వాత తిరిగి గాడిన పడేందుకు ఇబ్బంది పడుతుంటారు క్రికెటర్స్. కానీ భారత స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ స్టోరీ మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. ఇంజ్యురీ కారణంగా ఐదు నెలల పాటు క్రికెట్‌కు దూరమైన రాహుల్.. కమ్‌బ్యాక్‌లో రెచ్చిపోయి ఆడుతున్నాడు. కెరీర్ బెస్ట్ ఫామ్‌తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. రీఎంట్రీలో ఆడిన 8 వన్డేల్లో 402 రన్స్, 100.50 యావరేజ్, ఒక సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో అదరగొట్టాడు.
ఆసియా కప్‌తో పాటు వరల్డ్ కప్ మొదటి మ్యాచ్‌లో రాహుల్ తన ఫామ్‌ను కంటిన్యూ చేశాడు. ఆసీస్‌పై కీలక దశలో బ్యాటింగ్‌కు దిగిన రాహుల్ తన ఎక్స్‌పీరియెన్స్ మొత్తాన్ని బయటకు తీసి ఆడాడు. మొదట్లో సింగిల్స్, డబుల్స్‌తో స్ట్రైక్ రొటేట్ చేసిన ఈ స్టార్ బ్యాటర్.. ఛాన్స్ వచ్చినప్పుడల్లా బంతుల్ని బౌండరీకి తరలించాడు. కోహ్లీతో కలసి భారత్‌ను కష్టాల కడలి నుంచి బయటపడేశాడు. విన్నింగ్ షాట్ కొట్టే వరకు అతడు క్రీజును వదల్లేదు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించిన రాహుల్ (97 నాటౌట్) కొద్దిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. ఇంతకుముందు నిలకడ లేదని.. స్ట్రైక్ రేట్ విషయంలోనూ విమర్శలు ఎదుర్కొన్న రాహుల్.. ఇప్పుడు ఆ విషయంలోనూ గాడిన పడ్డాడు. రీఎంట్రీలో అతడి స్ట్రైక్ రేట్ 92.41గా ఉంది.
ఐపీఎల్లో ఆడుతూ గాయపడిన రాహుల్ కమ్‌బ్యాక్‌లో ఇంతగా రెచ్చిపోవడం వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇంజ్యురీతో బాధపడుతున్న రాహుల్ తనకు దొరికిన రెస్ట్‌ను పూర్తిస్థాయిలో వాడుకున్నాడు. ఫిట్నెస్ను మరింత మెరుగుపర్చుకున్నాడు. గంటల తరబడి కీపింగ్ చేయడంతో పాటు సుదీర్ఘంగా బ్యాటింగ్ చేసేందుకు ఫిట్నెస్ ఇంపార్టెన్స్ ఎంత ఉందో అతడు అర్థం చేసుకున్నట్లు కనిపిస్తోంది. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరిగెత్తడంతో పాటు వికెట్ల వెనుక కీపింగ్‌లోనూ సత్తా చాటుతున్నాడు. అలాగే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను కూడా రాహుల్ స్వల్పంగా మార్చుకున్నట్లు కనిపిస్తోంది.
మ్యాచ్ పరిస్థితులను బట్టి అవసరమైతే హిట్టింగ్ లేదంటే డిఫెన్స్, స్ట్రైక్ రొటేషన్‌కు రాహుల్ ప్రాధాన్యం ఇస్తుండటాన్ని గమనించొచ్చు. అనవసర షాట్లు ఆడి వికెట్ పారేసుకోకుండా క్రీజులో పాతుకుపోవడంపై రాహుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఇలా తనకు దొరికిన విరామాన్ని అతడు బాగా వాడుకున్నాడు. ఫిట్నెస్, గేమ్‌పై ఫోకస్, టెక్నిక్ మెరుగుపర్చుకోవడంపై అతడు వర్క్ చేయడం టీమిండియాకు కలిసొస్తోంది. గాయంతో బాధపడుతూ నిరాశలో కూరుకుపోకుండా దొరికిన గ్యాప్‌ను ఇంప్రూవ్మెంట్ కోసం వాడుకోవడమే రాహుల్ సీక్రెట్ అని క్రికెట్ అనలిస్టులు కూడా అంటున్నారు. మరి.. రాహుల్ కమ్‌బ్యాక్‌లో ఇంతగా రెచ్చిపోవడానికి ఏది కారణమని మీరు భావిస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: మ్యాంగో మ్యాన్ నవీన్ కోసం కోహ్లీ చేసిన పని వైరల్!