Narendra Modi: వరల్డ్‌ కప్‌ను ముట్టుకోని ప్రధాన మంత్రి! కారణం ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా స్వదేశానికి చేరుకుని.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. ఈ భేటీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ కప్ ను మోదీ పట్టుకోలేదు. మరి దానికి కారణం ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ సాధించిన టీమిండియా స్వదేశానికి చేరుకుని.. ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యింది. ఈ భేటీలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ కప్ ను మోదీ పట్టుకోలేదు. మరి దానికి కారణం ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ ను సాధించిన టీమిండియా.. విజయోత్సాహంతో స్వదేశానికి చేరుకుంది. ఇక ప్రపంచ కప్ ఛాంపియన్స్ కు ఘన స్వాగతం లభించింది. గురువారం ఉదయమే ఢిల్లీకి చేరుకున్న ఆటగాళ్లకు ఎయిర్ పోర్ట్ లో ఘన స్వాగతం లభించింది. అభిమానులు ఛాంపియన్స్ కు అద్భుతమైన స్వాగతం పలికారు. అనంతరం ప్లేయర్లు ఐటీసీ మౌర్య హోటల్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ప్రధాని మోదీతో భేటి అయ్యారు. మోదీతో కలిసి ఆటగాళ్లంతా బ్రేక్ ఫాస్ట్ చేశారు. అయితే ఈ భేటీలో ఓ ఆసక్తికర విషయం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ కప్ ను ప్రధాని మోదీ ముట్టుకోలేదు. దానికి కారణం ఏంటంటే?

టీ20 వరల్డ్ కప్ టైటిల్ తో స్వదేశానికి చేరుకున్న భారత జట్టుకు అపూర్వమైన స్వాగతం లభించింది. అనంతరం ఆటగాళ్లంతా ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ప్రధాని నివాసానికి వెళ్లి ఆయనతో కలిసి అల్పాహారం సేవించారు. ఆ తర్వాత మోదీ ప్రతీ ఒక్క క్రికెటర్ ను ఆప్యాయంగా పలకరించి.. అభినందించారు. ఈ క్రమంలో వరల్డ్ కప్ ను మోదీకి అందించారు టీమిండియా క్రికెటర్లు. ఇక్కడే ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ప్రపంచ కప్ ను మోదీ ముట్టుకోలేదు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ ప్రపంచ కప్ ను పట్టుకుంటే.. ప్రధాని వరల్డ్ కప్ ను పట్టుకోకుండా.. కేవలం రోహిత్, ద్రవిడ్ చేతులనే పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

దాంతో ప్రధాని ఎందుకు వరల్డ్ కప్ ను ముట్టుకోలేదు? అన్న ప్రశ్నను లేవనెత్తుతున్నారు నెటిజన్లు. అయితే ప్రపంచ కప్ ను పట్టుకోకపోవడానికి కారణం పెద్దగా ఏమీ లేదని, ఆటగాళ్లు, కోచ్ కష్టపడి సాధించినది కాబట్టి.. ఆ ట్రోఫీని వాళ్లు పట్టుకుంటేనే కరెక్ట్ అని ఆయన భావించి ఉంటారు. అందుకే ఇలా చేశారు అంటూ కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రాసుకొస్తున్నారు. ప్రధానితో భేటీ తర్వాత టీమిండియా ప్లేయర్లు ముంబైకి బయలుదేరారు. సాయంత్ర 5 గంటలకు ముంబైలో రోడ్ షో ఉంటుంది. అది ముగిసిన వెంటనే వాంఖడే స్టేడియంలో ప్లేయర్లు సన్మానం నిర్వహించనుంది బీసీసీఐ. మరి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ కప్ ను పట్టుకోకపోవడానికి కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments