IPL 2024: IPL.. ఆటగాళ్ల రిలీజ్‌ ప్రక్రియ తర్వాత.. ఏ టీమ్‌ బలం ఎలా ఉంది?

IPL.. ఆటగాళ్ల రిలీజ్‌ ప్రక్రియ తర్వాత.. ఏ టీమ్‌ బలం ఎలా ఉంది?

గుజరాత్‌ టైటాన్స్‌కు తొలి సీజన్‌లోనే కప్పు అందించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. ఆ జట్టును వదిలేసి ముంబై ఇండియన్స్‌కు మారిపోయాడు. ఇలాంటి మార్పులు మరికొన్ని జరిగాయి.. మరి ఈ మార్పుల తర్వాత ఏ టీమ్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఇప్పుడు చూద్దాం..

గుజరాత్‌ టైటాన్స్‌కు తొలి సీజన్‌లోనే కప్పు అందించిన కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా.. ఆ జట్టును వదిలేసి ముంబై ఇండియన్స్‌కు మారిపోయాడు. ఇలాంటి మార్పులు మరికొన్ని జరిగాయి.. మరి ఈ మార్పుల తర్వాత ఏ టీమ్‌ ఎంత స్ట్రాంగ్‌గా ఉందో ఇప్పుడు చూద్దాం..

ధనాధన్‌ క్రికెట్‌ హంగామా.. రెండు నెలల పాటు క్రికెట్‌ అభిమానులను ఆట మత్తులో ముంచెత్తే ఐపీఎల్‌ 2024 సీజన్‌కు ఇంకా చాలా సమయం ఉన్నా.. ప్రస్తుతం క్రికెట్‌ వర్గాల్లో ఐపీఎల్‌ గురించే చర్చ జరుగుతోంది. ఆటగాళ్ల ఇంటర్నల్‌ ట్రేడింగ్‌, రిలీజ్‌, రీటెన​్‌ ప్రక్రియనే అందుకు కారణం. అందులో కూడా గుజరాత్‌ టైటాన్స్‌కు సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న హార్ధిక్‌ పాండ్యా తిరిగి తన మొదటి టీమ్‌కి మారిపోవడంతో ఐపీఎల్‌ ప్రస్తుతం హాట్‌ టాపిక్‌గా మారింది. అయితే.. ఈ ఆటగాళ్ల మార్పులు చేర్పులతో ప్రస్తుతం ఏ జట్టు బలపడింది? ఏ టీమ్‌ బలహీన పడిందో ఇప్పుడు చూద్దాం..

ముంబై ఇండియన్స్‌..
గుజరాత్‌ టైటాన్స్‌ నుంచి హార్ధిక్‌ పాండ్యాను, లక్నో నుంచి షెపర్డ్‌ను తీసుకోవడంతో ముంబై ఇండియన్స్‌ మరింత బలంగా కనిపిస్తోంది. అయితే.. ఆ జట్టు భారీ ధర పెట్టి కొన్న కామెరున్‌ గ్రీన్‌ను ఆర్సీబీకి ఇచ్చేసింది. అలాగే అర్షద్‌ ఖాన్‌, రమన్‌దీప్‌ సింగ్‌, హృతిక్ షోకీన్, రాఘవ్ గోయల్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టన్ స్టబ్స్, డువాన్ జాన్సెన్, ఝే రిచర్డ్‌సన్, రిలే మెరెడిత్, క్రిస్ జోర్డాన్, సందీప్ వారియర్ లాంటి ఆటగాళ్లను వదిలేసింది. అయినా కూడా ముంబై చాలా స్ట్రాంగ్‌గా ఉంది. రోహిత్‌ శర్మ, ఇషాన్‌ కిషన్‌, తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, బుమ్రా, హర్ధిక్‌ పాండ్యా లాంటి స్టార్లతో ముంబై డేంజరస్‌గా ఉంది.

ఆర్సీబీ..
ఇప్పటికే విరాట్‌ కోహ్లీ, డుప్లెసిస్‌, మ్యాక్స్‌వెల్‌, సిరాజ్‌ వంటి స్టార్లతో బలంగా ఉన్న ఆర్సీబీ.. ఇప్పుడు కామెరూన్‌ గ్రీన్‌ చేరికతో మరింత స్ట్రాంగ్‌ అయిందనే చెప్పాలి. మిడిల్డార్‌లో ఆర్సీబీకి గ్రీన్‌ లాంటి బ్యాటర్‌ అవసరం ఉంది. కాగా.. ఆర్సీబీ రిలీజ్‌ చేసిన ఆటగాళ్ల లిస్ట్‌ ఒకసారి చూస్తే.. వనిందు హసరంగా, హర్షల్ పటేల్, ఫిన్ అలెన్, జోష్ హేజిల్‌వుడ్, మైఖేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోను యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేధార్ జాదవ్ లను ఆర్సీబీ వదిలేసింది. మొత్తం మీద ప్రస్తుతం ఆర్సీబీలో డుప్లెసిస్‌, విరాట్‌ కోహ్లీ, రజత్‌ పటీదార్‌, అనుజ్‌ రావత్‌, దినేష్‌ కార్తీక్‌, కామెరున్‌ గ్రీన్‌, ప్రభుదేశాయ్‌, విల్‌ జాక్స్‌, మ్యాక్స్‌వెల్‌, మహిపాల్‌, కరణ్‌ శర్మ, మనోజ్‌, షాబాజ్‌ అహ్మద్‌, ఆకాశ్‌దీప్‌, సిరాజ్‌, రీస్‌ టోప్లీ, హిమాన్షు శర్మ, రాజన్‌కుమార్‌, విజయ్‌ కుమార్‌ ఉన్నారు. వీళ్లతో పాటు వేలంలో మరికొంతమంది జాయిన్‌ అవుతారు. అన్ని టీమ్స్‌ కంటే ఆర్సీబీ వద్దే ఎక్కువ డబ్బు ఉంది వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు. మరి ఈ సారైనా ఆర్సీబీ మంచి టీమ్‌తో కప్పు కొడుతోందేమో చూడాలి.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌..
కొన్ని సీజన్లుగా చెత్త ప్రదర్శన చేస్తున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌.. ఐపీఎల్‌ 2024లో సత్తా చాటాలనే గట్టి పట్టుదలతో ఉంది. అయితే… ఐపీఎల్‌ 2023 వేలంలో భారీ ధర పెట్టి కొన్న హ్యారీ బ్రూక్‌ను రిలీజ్‌ చేసింది ఎస్‌ఆర్‌హెచ్‌. మరి వేలంలో ఎలాంటి ఆటగాళ్లను కొనుగోలు చేస్తుందనే దానిపైనే వారి విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఇక మిగతా జట్లలో పెద్దగా మార్పులు జరగలేదు. చెన్నై సూపర్‌ కింగ్స్‌ బెన్‌ స్టోక్స్‌ను వదిలేయడం మినహా.. మిగతా జట్ల నుంచి ఊహించనంత పెద్ద రిలీజ్‌లు ఏం జరగలేదు. అయితే.. ఐపీఎల్‌ 2024కు ముందు జరిగే వేలంలో ఆటగాళ్లను కొనుగోలు చేసిన తర్వాత.. అన్ని జట్లు పూర్తి బలాబలాలు అంచనా వేయడానికి వీలుంటుంది. మరి ఇప్పటి వరకు జరిగిన ట్రేడింగ్‌, రిలీజ్‌లతో ఏ జట్టు లాభపడిందో? ఏ జట్టు నష్టపోయిందో? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments