Asia Cup: భారత్‌-పాక్‌ మ్యాచ్‌ రద్దు అయితే ఎవరికి నష్టం?

ఆసియా కప్‌ 2023లో భాగంగా భారత్‌-పాక్‌ మధ్య ఆదివారం కొలంబో వేదికగా ప్రారంభమైన మ్యాచ్‌ వర్షం కారణంగా నిలిచిపోయిన విషయం తెలిసిందే. టోర్నీ సూపర్‌ 4 దశకు చేరుకోవడంతో ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌కు రిజర్వ్‌డే కేటాయించారు. దీంతో మళ్లీ మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఆదివారం మ్యాచ్‌ ఎక్కడవరకైతే జరిగిందో.. ఇవాళ అక్కడి నుంచే మొదలుకానుంది. నిన్న తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 24.1 ఓవర్ల పాటు ఆడి.. 2 వికెట్ల నష్టానికి 147 పరుగులు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్‌ అక్కడితో ఆగిపోయింది.

ఇవాళ రిజర్వ్‌ డే ఉండటంతో మ్యాచ్‌ జరుగుతుందని క్రికెట్‌ అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోగా.. ఈ రోజు కూడా కొలంబోలు కుండపోత వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ జరగడం ప్రశ్నార్థకంగానే మారింది. ఈ రోజు కూడా వర్షం ఆగకపోతే.. మ్యాచ్‌ను రద్దు చేసిన ఇరు జట్లకు చెరో పాయింట్‌ ఇస్తారు. లీగ్‌ దశలో కూడా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ మధ్యలోనే రద్దయిన విషయం తెలిసిందే. మళ్లీ ఇప్పుడు కూడా మ్యాచ్‌ రద్దు దిశగా సాగుతుండటంతో క్రికెట్‌ అభిమానులు నిరాశచెందుతున్నారు.

ఎవరికి నష్టం..?
మ్యాచ్‌ జరగడం లేదనే నిరాశతో పాటు భారత క్రికెట్‌ అభిమానులను ఒక భయం కూడా వెంటాడుతోంది. కీలకమైన సూపర్‌ ఫోర్‌లో టీమిండియా పాక్‌, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్‌తో ఒక్కో మ్యాచ్‌ చొప్పున మూడు మ్యాచ్‌లు ఆడునుంది. ఇప్పుడు పాక్‌తో జరుగుతున్న తొలి మ్యాచ్‌ రద్దు అయితే భారత్‌ ఖాతాలో ఒక్క పాయింట్‌ మాత్రమే చేరుతుంది. కానీ, పాక్‌.. బంగ్లాదేశ్‌పై సూపర్‌ 4లో తొలి మ్యాచ్‌ నెగ్గి ఉండటంతో పాక్‌ ఖాతాలో 3 పాయింట్లు చేరుతాయి. టీమిండియా తర్వాతి మ్యాచ్‌ల్లో అనూహ్య ఫలితాలు వచ్చినా.. వర్షం కారణంగా రద్దు అయినా.. ఫైనల్‌ వేళ్లే అవకాశాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. పాక్‌, భారత్‌, లంక, బంగ్లాదేశ్‌లలో టాప్‌ 2లో నిలిచిన జట్లు ఆసియా కప్‌ ఫైనల్‌ ఆడతాయి. మరి టీమిండియా టాప్‌ 2లో ఉండాలంటే మ్యాచ్‌లు జరిగి, గెలవాల్సి ఉంటుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: భారత్​కు రిజర్వ్ డే ఫోబియా! గతమంతా బ్యాడ్ సెంటిమెంట్!

Show comments