Shamar Joseph: విండీస్ సంచలనం షమర్ జోసెఫ్​కు బంపరాఫర్.. IPLలో ఆడే ఛాన్స్!

వెస్టిండీస్ పేస్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్​కు బంపరాఫర్ దక్కింది. అతడు ఐపీఎల్​-2024లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఏ టీమ్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

వెస్టిండీస్ పేస్ బౌలింగ్ సంచలనం షమర్ జోసెఫ్​కు బంపరాఫర్ దక్కింది. అతడు ఐపీఎల్​-2024లో ఆడే ఛాన్స్ దక్కించుకున్నాడు. ఏ టీమ్ తరఫున అతడు బరిలోకి దిగనున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియన్ ప్రీమియర్ లీగ్​లో ఆడాలనేది చాలా మంది క్రికెటర్ల డ్రీమ్. డొమెస్టిక్ ప్లేయర్స్ నుంచి ఇంటర్నేషనల్ క్రికెటర్స్ వరకు అందరూ ఈ క్యాష్ రిచ్​ లీగ్​లో ఆడే ఛాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటారు. ఆ అవకాశం దొరికితే మాత్రం అస్సలు వదులుకోరు. రూ.కోట్లకు రూ.కోట్లు డబ్బులు.. పేరు, ప్రతిష్టలు రావడంతో పాటు నేషనల్ టీమ్​లో ప్లేస్​ను ఖరారు చేసుకోవడానికి ఐపీఎల్ మంచి వేదికగా ఉపయోగపడుతోంది. దీంతో ఐపీఎల్ అవకాశం కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు ప్లేయర్లు. అయితే ఒక్కోసారి ఇంటర్నేషనల్ లెవల్లో దుమ్మురేపిన ఆటగాళ్లకు కూడా ఈ లీగ్​లో చోటు దక్కదు. కానీ కొందరికి మాత్రం అనూహ్యంగా ఆడే అవకాశం దక్కుతుంది. ఇప్పుడో క్రికెటర్ ఇలాగే లక్కీ ఛాన్స్ కొట్టేశాడు. అతడే విండీస్ నయా సంచలనం షమర్ జోసెఫ్.

వెస్టిండీస్ పేస్ సెన్సేషన్ షమర్ జోసెఫ్ అద్భుతమైన అవకాశాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్​-2024లో బరిలోకి దిగే ఛాన్స్​ అతడ్ని వరించింది. లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ తరఫున ఆడనున్నాడీ విండీస్ స్టార్. ఈ సీజన్​లో ఆడేందుకు అతడికి రూ.3 కోట్లు చెల్లించనుంది లక్నో యాజమాన్యం. ఇంగ్లండ్ స్టార్ ఆల్​రౌండర్ మార్క్ వుడ్ తప్పుకోవడంతో షమర్ జోసెఫ్​కు ఊహించని అదృష్టం వరించింది. వుడ్ స్థానంలో అతడ్ని టీమ్​లోకి తీసుకుంది లక్నో. దీంతో అతడు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ఇంటర్నేషనల్ క్రికెట్​లో అరంగేట్రం చేసిన ఏడాదే ఐపీఎల్ ఛాన్స్ దక్కడంతో పట్టరాని సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు.

లక్నో సూపర్ జెయింట్స్ ఫ్యాన్స్ కూడా షమర్ జోసెఫ్ రాకపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీకర పేస్​తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టే పేసర్ టీమ్​లోకి రావడంతో వాళ్లు సంతోషంలో మునిగిపోయారు. జోసెఫ్​ కనుక క్లిక్ అయితే లక్నోకు తిరుగుండదని.. ప్రత్యర్థి బ్యాటర్లకు అతడు సింహస్వప్నంలా మారతాడని కామెంట్స్ చేస్తున్నారు. లక్నో టీమ్ వుడ్​ ప్లేస్​లో షమర్​ను తీసుకొని మంచి పని చేసిందని.. క్వాలిటీ పేసర్​ను తీసుకోవడం తెలివైన నిర్ణయమని అభిమానులు మెచ్చుకుంటున్నారు. కాగా, గబ్బా వేదికగా ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్​లో జోసెఫ్ ఒకే ఇన్నింగ్స్​లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్​లో వెస్టిండీస్ చారిత్రక విజయంలో కీలకపాత్ర పోషించాడు. అతడి పేస్, స్వింగ్​కు ఆసీస్ బ్యాటర్లు హడలిపోయారు. షమర్ బంతుల్ని ఎదుర్కోవాలంటేనే వణికిపోయారు. అలాంటోడు ఇప్పుడు ఐపీఎల్​లో ఆడేందుకు రెడీ అవుతున్నాడు. మరి.. ఐపీఎల్​లోకి జోసెఫ్​ ఎంట్రీ ఇవ్వనుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Alana King: వీడియో: నో బాల్​కు సిక్స్, హిట్ వికెట్.. ఈ బ్యాటర్ ఔటా? నాటౌటా?

Show comments