Nidhan
వరల్డ్ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియాను వాళ్లు గడగడలాడించారు. తమకు ఎదురు లేదని బడాయికి పోయిన కంగారూల పొగరును అణిచారు ఆ లెజెండ్స్.
వరల్డ్ క్రికెట్‌ను ఏలిన ఆస్ట్రేలియాను వాళ్లు గడగడలాడించారు. తమకు ఎదురు లేదని బడాయికి పోయిన కంగారూల పొగరును అణిచారు ఆ లెజెండ్స్.
Nidhan
క్రికెట్‌ను ఆస్ట్రేలియా ఏలుతున్న రోజులవి. బై లాటరల్ సిరీస్ నుంచి వరల్డ్ కప్ వరకు.. వన్డేల నుంచి టెస్టుల దాకా అన్నింటా కంగారూలదే హవా. లాంగ్ ఫార్మాట్లో గెలుపు కాదు కదా.. వాళ్ల చేతిలో ఓడకుండా డ్రా చేసుకోవడమే చాలా టీమ్స్ టార్గెట్‌గా ఉండేది. అంతగా ఆసీస్ హవా చూపించిన కాలం అది. రికీ పాంటింగ్, మాథ్యూ హేడెన్, మార్క్ వా, స్టీవ్ వా, జస్టిన్ లాంగర్, ఆడమ్ గిల్‌క్రిస్ట్ లాంటి హేమాహేమీ బ్యాటర్లకు తోడు షేన్ వార్న్, జేసన్ గిలెస్పీ, గ్లెన్ మెక్‌గ్రాత్ వంటి కాకలు తీరిన బౌలర్లతో టీమ్ పవర్‌ఫుల్‌గా ఉండేది. అయితే ఓటమి అనేదే లేకుండా దూసుకెళ్లిన కంగారూల పొగరును ఇద్దరు భారత లెజెండ్స్ అణిచారు. ఓడిపోతే ఉండే బాధ ఎలా ఉంటుందో ఆస్ట్రేలియన్లకు రుచి చూపించారు. ఈడెన్ గార్డెన్స్‌లో ఆ ఇద్దరు దిగ్గజ బ్యాటర్లు ఆ రోజు అసాధారణంగా ఆడిన తీరును ఎవరూ అంత ఈజీగా మర్చిపోలేరు.
భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా ఫుల్ జోష్‌లో ఉంది. ఆ టీమ్‌తో మ్యాచ్ అంటేనే అందరూ భయపడే పరిస్థితి. రెండో టెస్టుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన కంగారూలు 445 పరుగులకు ఆలౌట్ అయ్యారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 171 పరుగులకే కుప్పకూలింది. దీంతో మన జట్టును త్వరగా ఆలౌట్ చేసి మ్యాచ్‌ను ముగిద్దామనుకున్న ఆసీస్.. ఫాలో ఆన్‌కు పిలిచింది. అయితే ఇక్కడే ఓ అద్భుతం చోటుచేసుకుంది. టెస్టు క్రికెట్ హిస్టరీలోనే ఎవర్‌గ్రీన్‌గా నిలిచిపోయే ఓ పార్ట్నర్షిప్ నమోదైంది. సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ (281) డబుల్ సెంచరీతో చెలరేగాడు. మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రవిడ్ 180 పరుగులతో సత్తా చాటాడు.
లక్ష్మణ్-ద్రవిడ్ కలసి ఐదో వికెట్‌కు ఏకంగా 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వీళ్లిద్దరి పార్ట్నర్షిప్ కారణంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 657 పరుగుల భారీ స్కోరుకు చేరుకుంది. ఆ స్కోరు ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన ఆసీస్‌ను టర్బనేటర్ హర్భజన్ సింగ్ (6/73) ఆఫ్ స్పిన్ మాయతో తిప్పేశాడు. అతడికి బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ 3 వికెట్లు తీసి మంచి సహకారాన్ని అందించాడు. దీంతో 212 పరుగులకే కుప్పకూలింది ఆసీస్. 171 పరుగుల తేడాతో విక్టరీ కొట్టింది భారత్. ఓటమి కోరల్లో చిక్కుకున్న జట్టు, ఫాలో ఆన్‌కు దిగి ఇలా భారీ స్కోరు చేసి ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో అంతా షాకయ్యారు. ద్రవిడ్-లక్ష్మణ్ దెబ్బకు స్పిన్ లెజెండ్ వార్న్ ఏకంగా 152 పరుగులు సమర్పించుకున్నాడు. మెక్‌గ్రాత్, గిలెస్పీ, కాస్ప్రోవిచ్ బౌలింగ్‌లోనూ సగటున 100కు పైగా పరుగులు పించుకున్నారు ద్రవిడ్-లక్షణ్. బ్యాటింగ్‌లో వీళ్లిద్దరూ విధ్వంసం సృష్టిస్తే.. బౌలింగ్‌లో భజ్జీ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌కు 23 ఏళ్లు పూర్తయ్యాయి. దీంతో ఆ రోజును ఫ్యాన్స్ గుర్తుచేసుకుంటున్నారు. వీళ్ల స్ఫూర్తితో టీమిండియా తదుపరి సిరీస్‌ల్లోనూ ఇలాగే ఆడాలని అంటున్నారు.
ఇదీ చదవండి: వీడియో: కెమెరాను చూసి జడుసుకున్న బాబర్ ఆజం.. భయంతో పరిగెడుతూ..!
One of the most iconic pictures. 🇮🇳
VVS Laxman and Rahul Dravid batted throughout the day on this day 23 years ago at the Eden Gardens. pic.twitter.com/z74gWhYHuq
— Mufaddal Vohra (@mufaddal_vohra) March 14, 2024