IND vs SA: సౌతాఫ్రికాను ఓడించాలంటే అతడే కీలకం.. అదొక్కటే మార్గం: కల్లిస్

  • Author Soma Sekhar Published - 08:44 PM, Mon - 11 December 23

టీమిండియా సఫారీ టీమ్ పై టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించాలంటే అతడొక్కడే కీలకమని, అదొక్కటే మార్గమని చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

టీమిండియా సఫారీ టీమ్ పై టెస్ట్ సిరీస్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించాలంటే అతడొక్కడే కీలకమని, అదొక్కటే మార్గమని చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Published - 08:44 PM, Mon - 11 December 23

టీమిండియా ఎన్నో కఠిన సవాళ్లను ఎదుర్కొని ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లాంటి దేశాలను వారి సొంత గడ్డపైనే ఓడించింది. కానీ.. సౌతాఫ్రికాను మాత్రం టెస్టుల్లో వారి గడ్డపై ఓడించలేకపోయింది. ఇది భారత జట్టుతో పాటుగా అభిమానులకు ప్రస్తుతం ఉన్న అతిపెద్ద లోటు. ఇప్పటి వరకు సఫారీ గడ్డపై 8 టెస్టు సిరీస్ లు ఆడిన టీమిండియా 2010-11లో ధోని సారథ్యంలో సిరీస్ ను 1-1తో డ్రాగా ముగించింది. ఇదే టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనగా నిలిచింది. అయితే టీమిండియా ఈ సిరీస్ ను గెలుచుకుని చరిత్ర సృష్టించాలంటే అతడొక్కడే కీలకమని, అదొక్కటే మార్గమని చెప్పుకొచ్చాడు సౌతాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కల్లీస్. మరి ఆ ప్లేయర్ ఎవరు? ఆ మార్గం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

దక్షిణాఫ్రికా గడ్డపై టెస్టు సిరీస్ గెలవడం అన్నది టీమిండియాకు ఇంకా అందని ద్రాక్షగానే మిగిలి ఉంది. సుదీర్ఘ టెస్ట్ ఫార్మాట్ లో ఈసారైనా సిరీస్ గెలిచి.. చరిత్ర సృష్టించాలని భావిస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికాపై విజయం సాధించాలంటే భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కీలకమని చెప్పుకొచ్చాడు. కోహ్లీ రాణిస్తేనే టీమిండియాకు విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని కల్లీస్ చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ గురించి జాక్వెస్ కల్లిస్ మరింతగా మాట్లాడుతూ..”ప్రపంచ క్రికెట్ లో విరాట్ కోహ్లీ గొప్ప ప్లేయర్. ఏ గడ్డపైనైనా సరే విరాట్ అద్భుతంగా ఆడతాడు. అదీకాక సఫారీ పిచ్ లపై ఆడిన అపార అనుభవం అతడి సొంతం. ఈ అనుభవాన్నంత కోహ్లీ తన సహచర, యువ ఆటగాళ్లకు చెప్పుతూ వెళ్తే అది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇక్కడి పరిస్థితులను యంగ్ ప్లేయర్లకు వివరిస్తే.. వారు వాటిని అర్థం చేసుకుని ఆడితేనే సౌతాఫ్రికా టీమ్ ను ఓడించగలరు” అంటూ కల్లిస్ తన అభిప్రాయాన్ని తెలియపరిచాడు.

ఇక విరాట్ ప్రోటీస్ గడ్డపై 14 ఇన్నింగ్స్ ల్లో 51.36 సగటుతో 719 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు,మూడు అర్ధ శతకాలు ఉన్నాయి. అదీకాక తాజాగా ముగిసిన వరల్డ్ కప్ లో దుమ్మురేపుతూ.. పరుగులు వరద పారించాడు ఈ రన్ మెషిన్. ఈ మెగాటోర్నీలో 11 మ్యాచ్ ల్లో 765 రన్స్ చేసి.. లీడింగ్ స్కోరర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. కాగా.. డిసెంబర్ 26 నుంచి సౌతాఫ్రికాతో తొలి టెస్ట్ ప్రారంభం అవుతుంది. మరి టెస్ట్ సిరీస్ లో విరాట్ కోహ్లే కీలకం అన్న కల్లిస్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments