Virat Kohli- Top Indian Celebrity List: మరోసారి కింగ్ అని నిరూపించుకున్న కోహ్లీ.. టాప్ ఇండియన్ సెలబ్రిటీగా

మరోసారి కింగ్ అని నిరూపించుకున్న కోహ్లీ.. టాప్ ఇండియన్ సెలబ్రిటీగా

Virat Kohli- Top Indian Celebrity List: విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రపంచానికి పరిచయాలు అక్కర్లేదు. మైదానంలో పరుగుల యంత్రంగా పేరు గాంచిన ఈ కింగ్ కోహ్లీ.. అటు బ్రాండ్ వ్యాల్యూలో కూడా టాప్ అని నిరూపించుకున్నాడు.

Virat Kohli- Top Indian Celebrity List: విరాట్ కోహ్లీ గురించి క్రికెట్ ప్రపంచానికి పరిచయాలు అక్కర్లేదు. మైదానంలో పరుగుల యంత్రంగా పేరు గాంచిన ఈ కింగ్ కోహ్లీ.. అటు బ్రాండ్ వ్యాల్యూలో కూడా టాప్ అని నిరూపించుకున్నాడు.

ఒక్క ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులకు కింగ్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మైదానంలోకి దిగితే పరుగుల యంత్రంగా మారిపోతాడు. క్రికెట్ ప్రపంచంలో ఉన్న టాప్ ప్లేయర్స్ లో కింగ్ కోహ్లీ తన పేరును సుస్థిరం చేసుకున్నాడు. తనకంటూ కొన్ని పేజీలను రాసుకున్నాడు. విరాట్ కోహ్లీకి ఉన్న అభిమాన గణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నెట్టింట వాళ్లు చూపించే అభిమానం అంతా ఇంతా కాదు. అయితే ఇప్పుడు ఆ అభిమానం కోహ్లీని ఏ స్థాయికి తీసుకెళ్లింది అంటే.. ఇండియాలోనే టాప్ సెలబ్రిటీగా నిలబెట్టింది. అది కూడా క్రికెట్ లో కాదండోయ్.. బ్రాండ్ వ్యాల్యూలో. మరి.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

టాప్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ వచ్చేసింది. ఈ లిస్ట్ లో హేమాహేమీలను దాటేసి.. విరాట్ కోహ్లీ టాప్ ప్లేస్ లో నిల్చున్నాడు. ఆ లిస్టులో అమితాబ్, కింగ్ ఖాన్, ఎంఎస్ ధోనీ, సచిన్ టెండుల్కర్, రణ్ వీర్ సింగ్ ఉండటం విశేషం. ఇండియాలోనే టాప్ సెలబ్రిటీస్ లిస్ట్ లో విరాట్ కోహ్లీ 227.9 మిలియన్ డాలర్స్ బ్రాండ్ వ్యాల్యూతో టాప్ ప్లేస్ లో ఉన్నాడు. విరాట్ కోహ్లీ ఏకంగా 40 బ్రాండ్స్ కి అంబాసిడర్ గా ఉన్నాడు. 2022 తర్వాత విరాట్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ ఏకంగా 51 మిలియన్ డారల్స్ పెరగడం విశేషం. విరాట్ కోహ్లీ తర్వాత రణ్ వీర్ సింగ్ ఆ లిస్టులో ఉన్నాడు. 203.1 మిలియన్ డాలర్స్ బ్రాండ్ వ్యాల్యూతో రెండో స్థానాన్ని ఈ బాలీవుడ్ బిగ్ షాట్ కైవసం చేసుకున్నాడు.

ఆ తర్వాత లిస్టులో 120.7 మిలియన్ డాలర్స్ బ్రాండ్ వ్యాల్యూతో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ఉన్నాడు. షారుక్ తర్వాత 111.7 మిలియన్ డాలర్స్ తో అక్షయ్ కుమార్ ఉన్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ 101.1 మిలియన్ డాలర్స్ తో 5వ స్థానాన్ని సొంతం చేసుకుంది. దీపికా పదుకొణె 96 మిలియన్ డాలర్స్ బ్రాండ్ వ్యాల్యూతో 6వ స్థానంలో ఉంది. ఆ తర్వాత ఎంఎస్ ధోనీ 95.8 మిలియన్ డాలర్స్ తో ఏడవ స్థానం, 91.3 మిలియన్ డాలర్స్ తో క్రికెట్ గాడ్ సచిన్ టెండుల్కర్ ఉన్నారు.

9వ స్థానంలో 83.6 మిలియన్ డాలర్స్ బ్రాండ్ వ్యాల్యుతో అమితాబ్ బచ్చన్ ఉన్నారు. ఇంక సల్మాన్ ఖాన్ 81.7 మిలియన్ డాలర్స్ తో పదో స్థానాన్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఈ గణాంకాలు నెట్టింట వైరల్ గా మారాయి. కింగ్ కోహ్లీ బ్రాండ్ వ్యాల్యూ చూసి అభిమానులు. ఇది సార్ మా కింగ్ కోహ్లీ రేంజ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి.. టాప్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో కోహ్లీ అగ్రస్థానంలో నిలవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments