ఆ టీమ్​తో మ్యాచ్ అంటే ఇష్టం.. నా ఫేవరెట్ రైవల్రీ వాళ్లతోనే: కోహ్లీ

Virat Kohli On His Favorite Rivalry: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూస్తే అన్ని జట్లు భయపడతాయి. అతడితో పెట్టుకోవాలంటే వెనుకంజ వేస్తాయి. అలాంటి కోహ్లీకి ఒక జట్టుతో మ్యాచ్ అంటే మాత్రం బాగా ఇష్టమట.

Virat Kohli On His Favorite Rivalry: టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూస్తే అన్ని జట్లు భయపడతాయి. అతడితో పెట్టుకోవాలంటే వెనుకంజ వేస్తాయి. అలాంటి కోహ్లీకి ఒక జట్టుతో మ్యాచ్ అంటే మాత్రం బాగా ఇష్టమట.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీని చూస్తే అన్ని జట్లు భయపడతాయి. అతడితో పెట్టుకోవాలంటే వెనుకంజ వేస్తాయి. అతడు క్రీజులో ఉన్నాడంటే మ్యాచ్​పై ఆశలు వదిలేసుకుంటాయి. కింగ్​ను గెలికితే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అందుకే అతడ్ని సాధ్యమైనంతగా కూల్​గా ఉంచేందుకు ప్రయత్నిస్తాయి. అయితే విరాట్ మాత్రం తన పని తాను చేసుకుపోతుంటాడు. మ్యాచ్​ గెలిపించడం మీదే ఫోకస్ చేస్తుంటాడు. తనకు అప్పజెప్పిన టాస్క్​ను ఫినిష్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. ఆ టీమ్, ఈ టీమ్ అనేమీ లేదు.. ఎవరు ఎదురొచ్చినా బుల్డోజర్​లా తొక్కుకుంటూ వెళ్లిపోతాడు. బౌలర్లను ఊచకోత కోస్తాడు. అయితే అతడికి ఓ ఫేవరెట్ రైవల్రీ ఉందట.

ఒక జట్టుతో మ్యాచ్ అంటే కోహ్లీకి బాగా ఇష్టమట. అందుకోసం బాగా వెయిట్ చేస్తుంటాడట. అయితే ఇది ఇంటర్నేషనల్ టీమ్ అనుకుంటే పొరపాటే. ఇండియన్ ప్రీమియర్ లీగ్​లోని కోల్​కతా నైట్ రైడర్స్​ జట్టుతో మ్యాచ్ అంటే తనకు ఇష్టమని కోహ్లీ తెలిపాడు. తనకు అసలైన ప్రత్యర్థి అదే జట్టని అన్నాడు. అంతర్జాతీయ క్రికెట్​లోకి విరాట్ డెబ్యూ ఇచ్చి 16 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో అతడికి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి అంతే ఇంట్రెస్టింగ్​గా టాప్ బ్యాటర్ ఆన్సర్ ఇచ్చాడు. ముంబై, కోల్​కతా జట్లలో ఏది ఫేవరెట్ రైవల్రీ అనే ప్రశ్నకు వెంటనే కోల్​కతా అని కోహ్లీ జవాబిచ్చాడు. ఫ్లిక్, కవర్​ డ్రైవ్​లో ఏది ఇష్టమైన షాట్ అని అడగ్గా.. కవర్ డ్రైవ్ అన్నాడు.

ఎంఎస్ ధోని, ఏబీ డివిలియర్స్​లో ఎవరు ఎక్కువ ఇష్టం అనే ప్రశ్నకు ఇద్దరూ అని జవాబిచ్చాడు కోహ్లీ. ఆస్ట్రేలియాలోని అడిలైడ్ కంటే భారత్​లోని చిన్నస్వామి స్టేడియం అంటేనే ఇష్టమని. అది తన ఫేవరెట్ వెన్యూ అని తెలిపాడు. కరీబియన్ వీరుడు క్రిస్ గేల్ మోస్ట్ ఫన్ క్రికెటర్ అని పేర్కొన్నాడు. ఢిల్లీలో పుట్టి పెరిగిన విరాట్.. ఇప్పుడు ముంబైలో సెటిల్ అయ్యాడు. ఈ నేపథ్యంలో రెండింట్లో ఏది సొంత నగరంగా అనిపిస్తోందనే క్వశ్చన్​కు ప్రస్తుతం ముంబైనే హోమ్ ఫీలింగ్ ఇస్తోందన్నాడు కింగ్. అరిజిత్ సింగ్ తన ఫేవరెట్ సింగర్ అన్నాడు. కార్డియో కంటే వెయిట్ ట్రెయినింగ్ చేసేందుకు మొగ్గు చూపుతానని చెప్పాడు. పొద్దున అర్లీగా లేవడం అలవాటైందన్నాడు. ఇష్టమైన పండుగ దీపావళి అని వివరించాడు. ఇక, బంగ్లాదేశ్​తో సిరీస్​కు ముందు లాంగ్ గ్యాప్ దొరకడంతో లండన్​లో ఫ్యామిలీతో కలసి వెకేషన్​ను ఎంజాయ్ చేస్తున్నాడు కోహ్లీ.

Show comments