వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కు మరికొన్ని గంటల్లో తెరలేవబోతోంది. అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 14న ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ జరగబోతోంది. ఇక ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి ఫుల్ జోష్ లో ఉంది టీమిండియా. ఇదే జోరును దాయాదిపై కూడా చూపించాలని ఆరాటపడుతోంది. అటు పాక్ జట్టు సైతం అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు వెన్నముకగా ఉన్న కోహ్లీ.. ఇప్పుడు టీమిండియాకే టెన్షన్ గా మారాడు. అదేంటి? విరాట్ జట్టుకు టెన్షన్ గా ఎందుకు మారాడని మీకు అనుమానం రావొచ్చు. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవే ఇప్పుడు కోహ్లీ ఫ్యాన్స్ తో పాటు టీమిండియా అభిమానులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరల్డ్ కప్ లో ఇప్పటికే రెండు అర్దశతకాలు బాది తానెంత ప్రమాదకారో మరోసారి ప్రత్యర్థి జట్లకు హెచ్చరికలు జారీ చేశాడు. ఇక వరల్డ్ కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ కోసం ప్రేక్షకులతో పాటు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అహ్మదాబాద్ వేదికగా ఇండియా-పాక్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో సత్తా చాటాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే టీమిండియాకు విరాట్ కోహ్లీ రూపంలో ఓ టెన్షన్ పట్టుకుంది. పాక్ తో మ్యాచ్ అనగానే చెలరేగిపోవడం విరాట్ కు ఆనవాయితి. కానీ అది విదేశాల్లో. స్వదేశానికి వచ్చే సరికి విరాట్ కోహ్లీకి పాక్ పై చెప్పుకోదగ్గ రికార్డులు కనిపించడం లేదు. గత కొన్ని సంవత్సరాలుగా విరాట్ స్వదేశంలో పాక్ పై ఆడిన ఇన్నింగ్స్ లు చూస్తే.. మీకే ఆ విషయం అర్దమవుతుంది.
2011 నుంచి విరాట్ ఇప్పటి వరకు పాక్ పై నాలుగు మ్యాచ్ లు ఆడగా.. అందులో అతడి అత్యధిక స్కోర్ 9. 2011లో మెుహాలీలో జరిగిన మ్యాచ్ లో 21 బంతుల్లో కేవలం 9 రన్స్ మాత్రమే చేశాడు. మిగతా మ్యాచ్ ల్లో వరుసగా 0, 6, 7 పరుగులు మాత్రమే చేసి.. ఇండియా గడ్డపై చెత్త రికార్డులను నమోదు చేశాడు. విరాట్ 4 ఇన్నింగ్స్ ల్లో 5.50 యావరేజ్ తో 22 పరుగులే చేశాడు. ఇక అతడి స్ట్రైక్ రేట్ వచ్చేసి 42.31 అంటే ఆశ్చర్యం వేయకమానదు. ఈ గణాంకాలే ఇప్పుడు టీమిండియాను భయపెడుతున్నాయి. వరల్డ్ క్లాస్ బౌలింగ్ దళానికి పెట్టింది పేరుగా పాక్ టీమ్ ఉండగా.. విరాట్ రికార్డులు భారత ఫ్యాన్స్ ను కలవరపెడుతున్నాయి. మరి ఈ గణాంకాలను దాటుకుని విరాట్ కోహ్లీ రాణిస్తాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Virat Kohli’s Odi records against Pakistan at home
9 (21) in Mohali 2011
0 (5) in Chennai 2012
6 (9) in Eden Gardens 2013
7 (17) in Delhi 2013Innings 4
Scored 22
Average 5.50
Strike rate 42.31 pic.twitter.com/JU0u1oC1sn— Definitely A H K (@AkhtrHaytKhan) October 12, 2023