Virat Kohli: నిజంగా ఇతను కోహ్లీనేనా? అంతా షాక్‌ అయ్యారుగా..!

టీమిండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ.. దాదాపు 14 నెలల గ్యాప్‌ తర్వాత టీ20 బరిలోకి దిగినా.. తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేని నిరూపిస్తూ.. ఒక మంచి ఇంటెంట్‌తో అందర్నిని ఆశ్చర్యానికి గురిచేశాడో. మరి కోహ్లీ బయటపెట్టిన ఆ కొత్త యాంగిల్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా సూపర్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లీ.. దాదాపు 14 నెలల గ్యాప్‌ తర్వాత టీ20 బరిలోకి దిగినా.. తనలో ఏ మాత్రం సత్తా తగ్గలేని నిరూపిస్తూ.. ఒక మంచి ఇంటెంట్‌తో అందర్నిని ఆశ్చర్యానికి గురిచేశాడో. మరి కోహ్లీ బయటపెట్టిన ఆ కొత్త యాంగిల్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

విరాట్‌ కోహ్లీ బ్యాటింగ్‌ గురించి క్రికెట్‌ అభిమానులకు కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. కొన్ని ఏళ్లుగా అతని సొగసైన బ్యాటింగ్‌ విన్యాసాలతో క్రికెట్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అయితే.. కోహ్లీ ఎలాంటి పరిస్థితుల్లోనైనా బ్యాటింగ్‌ చేయగలడనే విషయం అందరికి తెలిసిందే. టెస్టుల్లో వికెట్లు పడుతుంటే.. ఒక్కటే నిలబడి ఇన్నింగ్స్‌ను నడిపించగలడు. ఇక వన్డేల్లో ఒక యాంకర్‌ రోల్‌ పోషిస్తూ.. మ్యాచ్‌ చివరి వరకు నిలబడగలడు. ఛేజింగ్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కోహ్లీకి ఇప్పటికే ఛేజ్‌ మాస్టర్‌ అనే బిరుదు ఉండనే ఉంది. కానీ, టీ20ల్లో కోహ్లీకి ఒక ట్యాగ్‌ లేదు. ఎందుకంటే.. కోహ్లీ అంచనాలకు అందని ఒక విలువైన ఆటగాడు. సాధారణంగా టాపార్డర్‌లో బ్యాటింగ్‌ చేసే కోహ్లీ.. మ్యాచ్‌ ముగించడంలో మాస్టర్‌.

అయితే.. తొలుత బ్యాటింగ్‌ చేయాల్సిన వచ్చినప్పుడు మాత్రం కోహ్లీ మ్యాచ్‌ పరిస్థితులకు తగ్గట్లుగా ఆడుతుంటాడు. ఆరంభంలో ఓపెనర్లు మంచి స్టార్ట్‌ ఇస్తే.. దాన్ని కంటిన్యూ చేస్తాడు. లేదా ఓపెనర్లలో ఏ ఒక్కరైనా త్వరగా అవుటైతే.. ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేస్తాడు. అయితే.. ఆదివారం ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా టీమిండియా ఫస్ట్‌ ఓవర్‌లోనే డేంజరస్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ వికెట్‌ను కోల్పోయింది. తొలి మ్యాచ్‌లో దురదృష్టవశాత్తు పరుగులేమీ చేయకుండా రనౌట్‌ అయిన రోహిత్‌.. రెండో మ్యాచ్‌లో గోల్డెన్‌ డక్‌ అయ్యాడు. ఆఫ్ఘాన్‌ బౌలర్‌ ఫారుఖీ వేసిన తొలి ఓవర్‌ ఐదో బంతికి క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. దీంతో.. కోహ్లీ తొలి ఓవర్‌లోనే క్రీజ్‌లోకి రావాల్సి వచ్చింది.

అప్పటికే రోహిత్‌ శర్మ అవుటై ఉండటంతో కోహ్లీ కాస్త స్లోగా ఆడుతూ.. వికెట్లు పడకుంటా చూసుకుంటూ పవర్‌ ప్లేలో పరుగులు చేసే అవకాశం యువ ఓపెనర్‌ జైస్వాల్‌కు ఇస్తాడని అంతా భావించారు. కానీ, కోహ్లీ అందరికీ ఊహించని షాక్‌ ఇస్తూ.. వచ్చీ రావడంతోనే ఆఫ్ఘాన్‌ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌ వేసిన రెండో ఓవర్‌లో ఏకంగా రెండు ఫోర్లతో తన హిట్టింగ్‌ మొదలుపెట్టాడు. ఇక తన బెస్ట్‌ ఫ్రెండ్‌ నవీన్‌ ఉల్‌ హక్‌ బౌలింగ్‌ను అయితే.. చీల్చిచెండాలనే కసితో కోహ్లీ బ్యాటింగ్‌ చేస్తున్నట్లు కనిపించాడు. కేవలం 16 బంతుల్లోనే 5 ఫోర్లతో 29 పరుగులు చేసి కోహ్లీ అవుట్‌ అయ్యాడు. ఒక వికెట్‌ పడినా కోహ్లీ ఇంత అగ్రెసివ్‌గా ఆడటం బహుషా ఇదే తొలి సారి ఏమో అంటూ క్రికెట్‌ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

ఈ మ్యాచ్‌కి ముందు కోహ్లీ టీ20 మ్యాచ్‌ ఆడి 14 నెలలు అవుతుంది. వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత కోహ్లీ, రోహిత్‌ టీ20 క్రికెట్‌ కెరీర్‌పై పలువురు అనుమానాలు వ్యక్తం చేశారు. అసలు వీరిద్దరూ టీ20లు ఆడతారా? లేదా అంటూ అసందర్భమైన కామెంట్స్‌ చేశారు. కానీ, అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ.. బీసీసీఐ ఆఫ్ఘాన్‌తో రోహిత్‌ కోహ్లీలను ఎంపిక చేసింది. అయితే.. వారంద్దరికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాలని కోహ్లీ ఫిక్స్‌ అయినట్లు అతని బ్యాటింగ్‌ స్టైల్‌ చూస్తేనే అర్థం అవుతుంది. తొలి బంతి నుంచే అగ్రెసివ్‌గా బ్యాటింగ్‌ చేయాలని కోహ్లీ ఫిక్స్‌ అయినట్లు తెలుస్తుంది. అందుకే ఆదివారం జరిగిన మ్యాచ్‌లో.. రోహిత్‌ త్వరగా అవుటైనా.. నిదానంగా ఆడకుంటా అగ్రెసివ్‌ బ్యాటింగ్‌ రెచ్చిపోయాడు. కోహ్లీ ఆడింది చిన్న ఇన్నింగ్సే అయినా.. చాలా ఇంప్యాక్ట్‌ చూపింది. జైస్వాల్‌, దూబే చెలరేగి ఆడేందుకు తోడ్పాటు అందించింది. మరి కోహ్లీ ఇంత అగ్రెసివ్‌గా ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments