SNP
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో అందరి దృష్టి ఈ సిరీస్‌పై పడింది. పైగా వరల్డ్ కప్ ఓటమి తర్వాత రోహిత్-కోహ్లీ జంట బరిలోకి దిగుతున్నారు. మరి వీరిద్దరికి సౌతాఫ్రికాలో ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతుండటంతో అందరి దృష్టి ఈ సిరీస్‌పై పడింది. పైగా వరల్డ్ కప్ ఓటమి తర్వాత రోహిత్-కోహ్లీ జంట బరిలోకి దిగుతున్నారు. మరి వీరిద్దరికి సౌతాఫ్రికాలో ఎలాంటి రికార్డ్స్ ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
SNP
సౌతాఫ్రికాతో టెస్ట్ సిరీస్ నేపథ్యంలో టీమిండియాను ఓ భారీ రికార్డు ఊరిస్తోంది. అదేంటంటే.. ఇండియాకు ఇప్పటి వరకు సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచిన చరిత్ర లేదు. సఫారీలను వాళ్ల దేశంలో ఓడించడం అంటే అంత సులువైన విషయం కాదు. సౌతాఫ్రికా పిచ్‌లు పేస్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. వాళ్ల పేసర్లు నిప్పులు చిమ్ముతుంటే.. తట్టుకుని నిలబడి బ్యాటింగ్ చేయడం కత్తిమీద సాము లాంటిది. అందుకే ఇప్పటి వరకు టీమిండియాకు సౌతాఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలవడం సాధ్యం కాలేదు. కానీ, ఈ సారి మాత్రం పరిస్థితులు వేరేలా ఉన్నాయి.
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా ఎంతో పటిష్టంగా ఉంది. పైగా జట్టు బ్యాటింగ్ లైనప్‌కు మూలస్తంభమైన విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. అలాగే బౌలింగ్ విభాగం, బ్యాటింగ్ మిడిల్డార్, స్పిన్ విభాగం అంతా ఎంతో బలంగా ఉన్నాయి. మరో వైపు సౌతాఫ్రికా సైతం బలంగానే ఉన్నా.. టీమిండియానే ఎక్కువ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్ చెలరేగితే.. సొంత పిచ్‌లపై ఆడటం సౌతాఫ్రికా బ్యాటర్లకు అంతా తేలికైన విషయం కాదు. పేస్‌తో పాటు కాస్త స్వింగ్ లభిస్తే.. బుమ్రా, సిరాజ్‌ను అడ్డుకోలేరు. అలాగే టీమిండియా బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ, జైస్వాల్, గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జడేజా ఇలా.. యంగ్ అండ్ సీనియర్ ఆటగాళ్లంతో ఎంతో పటిష్టంగా ఉంది.
అయితే.. ప్రస్తుతం టీమిండియాలో ఇద్దరు స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపైనే ఎక్కువ జట్టు ఆధారపడటం మాత్రం ఖాయం. ఎందుకంటే.. ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత ఫామ్‌లో ఉన్నా.. సౌతాఫ్రికా పిచ్‌లపై ఆడాలంటే కాస్త అనుభవం ఉండాల్సిందే. కాగా, సౌతాఫ్రికాలో కోహ్లీ, రోహిత్ రికార్డులను ఒకసారి పరిశీలిస్తే.. కోహ్లీ రికార్డు అద్భుతంగా ఉంటే, రోహిత్ శర్మకు చెత్త రికార్డు ఉంది. కోహ్లీ సౌతాఫ్రికాలో 14 ఇన్నింగ్స్‌ల్లో 51.35 సగటుతో 719 పరుగులు చేశాడు. అందులో రెండు సెంచరీలు, ఐదు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ 4 టెస్టుల్లో 15.37 సగటుతో కేవలం 123 పరుగులు మాత్రమే చేశాడు. ఈ రికార్డులు చూస్తుంటే కోహ్లీపైనే ఎక్కువ భారం పడనుంది. కానీ, హిట్‌మ్యాన్ సైతం ఫామ్‌లోకి వస్తే.. టీమిండియాను అడ్డుకోవడం సౌతాఫ్రికా తరం కాదు. మరి టెస్టు సిరీస్‌లో కోహ్లీ తన ట్రాక్ రికార్డును కొనసాగిస్తాడని, రోహిత్ తన బ్యాడ్ రికార్డును మార్చకుంటాడని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
South Africa won the toss & decided to bowl first. pic.twitter.com/AVlX7PAwfk
— Johns. (@CricCrazyJohns) December 26, 2023