Kohli-Rohit: రోహిత్ శర్మతో గొడవలు.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన విరాట్ కోహ్లీ!

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇద్దరికి పడటం లేదని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించాడు రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ.

విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇద్దరికి పడటం లేదని గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించాడు రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ.

సౌతాఫ్రికా పర్యటనలో ఉన్న టీమిండియా అద్భుతంగా రాణిస్తోంది. టీ20 సిరీస్ ను సమం చేసుకుని, ఆ తర్వాత జరిగిన వన్డే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఇదే జోరును రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో కూడా చూపించాలని భావిస్తోంది భారత జట్టు. కాగా.. టెస్ట్ సిరీస్ కోసం టీమ్ లో చేరారు సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ. ఈ క్రమంలోనే ఓ వార్త ఫ్యాన్స్ ను ఆందోళన పరుస్తోంది. అదేంటంటే? విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మల మధ్య మనస్పర్థలు ఉన్నాయని, ఇద్దరికి పడటం లేదని ఆ న్యూస్ సారాంశం. ఈ నేపథ్యంలో తాజాగా ఈ విషయంపై స్పందించాడు రన్ మెషిన్ కింగ్ విరాట్ కోహ్లీ. టెస్ట్ సిరీస్ అధికారిక బ్రాడ్ కాస్టర్ లో ఈ వార్తలపై మాట్లాడాడు కోహ్లీ. మరి గొడవలపై ఏం క్లారిటీ ఇచ్చాడో ఇప్పుడు చూద్దాం.

సౌతాఫ్రికాతో జరిగే టెస్ట్ సిరీస్ కోసం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతో పాటుగా మరికొందరు సీనియర్ ప్లేయర్లు జట్టులో చేరారు. ఇక మ్యాచ్ కు ముందు రోహిత్ కు తనకు మనస్పర్థలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు విరాట్ కోహ్లీ. ఈ క్రమంలోనే మ్యాచ్ అధికారిక బ్రాడ్ కాస్టర్ తో మాట్లాడాడు. “గేమ్ పట్ల రోహిత్, నా ఆలోచనలు ఒకే విధంగా ఉంటాయి. నేను బ్యాటర్ గా ఏ సలహాలు, సూచనలు ఇవ్వాలనుకున్నా ఎలాంటి మెుహమాటం లేకుండా రోహిత్ కు ఇస్తాను. అలాగే రోహిత్ సైతం నాతో ఏ విషయాన్ని అయినా చర్చిస్తాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు, మనస్పర్థలు లేవు” అంటూ విరాట్ కోహ్లీ క్లారిటీ ఇచ్చాడు.

ఈ సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం గురించి కూడా చెప్పుకొచ్చాడు. టీమ్ లో ఉన్న ప్లేయర్లందరూ డ్రెస్సింగ్ రూమ్ లో స్నేహపూర్వకంగానే ఉంటారని కోహ్లీ తెలిపాడు. ఇలాంటి వాతావరణం జట్టులో ఉన్నప్పుడు దేశం కోసం ఏదైనా సాధించాలనే తపన ఆటగాళ్లలో ఉంటుందని విరాట్ పేర్కొన్నాడు. రోహిత్, నేను దేశాన్ని ఎప్పుడూ గెలిపించాలని కోరుకుంటాం, ప్రస్తుతం మా ఫ్రెండ్షిప్ సాఫీగా సాగుతోంది.. దయచేసి మా ఇద్దరి మధ్య గొడవలు సృష్టించకండి అంటూ విరాట్ చెప్పుకొచ్చాడు. కాగా.. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. సౌతాఫ్రికాతో సెంచూరియన్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ మంగళవారం(డిసెంబర్ 26) ప్రారంభం కానుంది. మరి దక్షిణాఫ్రికాలో ఊరిస్తున్న టెస్ట్ సిరీస్ రికార్డును ఈసారైనా టీమిండియా బ్రేక్ చేస్తుందో? లేదో? చూడాలి మరి. మరి రోహిత్ తో గొడవలు లేవంటూ కోహ్లీ ఇచ్చిన క్లారిటీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments