ఆ టీమిండియా ప్లేయరే తన ఫేవరేట్‌ క్రికెటర్‌: కేన్‌ విలియమ్సన్‌

ప్రస్తుతం ఉన్న మోడ్రన్‌ గ్రేట్‌ క్రికెటర్లలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఒకడు. అలాంటి ఆటగాడు టీమిండియాలోని ఓ ఆటగాడు తన ఫేవరేట్‌ క్రికెటర్‌ అంటూ పేర్కొన్నాడు. మరి కేన్‌ మామ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రస్తుతం ఉన్న మోడ్రన్‌ గ్రేట్‌ క్రికెటర్లలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఒకడు. అలాంటి ఆటగాడు టీమిండియాలోని ఓ ఆటగాడు తన ఫేవరేట్‌ క్రికెటర్‌ అంటూ పేర్కొన్నాడు. మరి కేన్‌ మామ ఫేవరేట్‌ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌కు వాళ్ల దేశంలో ఎంత ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉందో తెలియదు కానీ, మన దేశంలో బీభత్సమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది విలియమ్సన్‌కు. అది ఎంతలా అంటే.. మన తెలుగు రాష్ట్రాల్లో విలియమ్సన్‌ను ముద్దుగా కేన్‌ మామ అంటూ ఎంతో ఓన్‌ చేసుకుని మరి పిలుచుకుంటారు. అంతలా విలియమ్సన్‌ ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు దగ్గరైపోయాడు. చాలా కాలం పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడటం, వివాద రహితుడిగా పేరుడుంటం, ఎంత పెద్ద ఓటమి ఎదురైనా ముఖంపై చిరునవ్వు చిరిగిపోనివ్వకుండా ఉండటంతో విలియమ్సన్‌ను చాలా మంది అభిమానిస్తుంటారు. అయితే.. తాజాగా విలియమ్సన్‌ ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో తన అభిమాన ఆటగాడు ఎవరో ప్రకటించాడు.

టీమిండియా స్టార్‌ క్రికెటరే తన ఫేవరేట్‌ క్రికెటర్‌ అంటూ పేర్కొన్నాడు కేన్‌ మామ. అయితే.. ఆ క్రికెటర్‌ ఎవరో తెలుసుకోవాలని ఉంది కదా.. అతనెవరో కాదు.. టీమిండియా మాజీ కెప్టెన్‌, స్టార్‌ బ్యాటర్‌, ఛేజ్‌ మాస్టర్‌, రన్‌ మెషీన్‌.. ది కింగ్‌ కోహ్లీ. ప్రస్తుతం ఉన్న క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీనే తన ఫేవరేట్‌ క్రికెటర్‌ అంటూ విలియమ్సన్‌ పేర్కొన్నాడు. వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో భాగంగా న్యూజిలాండ్‌ గురువారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో శ్రీలంకతో ఎంతో కీలకమైన మ్యాచ్‌ ఆడుతుంది. సెమీ ఫైనల్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో లంకను ఢీకొట్టనుంది కివీస్‌. కాగా, ఈ మ్యాచ్‌కి ముందు కేన్‌ మామ తన ఫేవరేట్‌ క్రికెటర్‌ గురించి వెల్లడించాడు.

అయితే.. ఈ వరల్డ్‌ కప్‌లో విలియమ్సన్‌ గాయంతో కొన్ని మ్యాచ్‌లకు దూరమైన విషయం తెలిసిందే. చేతి బొటనవేలికి గాయం కావడంతో కేన్‌ మామ రెస్ట్‌ తీసుకున్నాడు. కానీ, గాయం నుంచి తిరిగొచ్చిన తర్వాత సూపర్‌ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. ఇక మరోవైపు కేన్‌ మామ ఫేవరేట్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ అయితే నెక్ట్స్‌ లెవెల్‌ ఫామ్‌లో దూసుకెళ్తున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలు కూడా బాదేశాడు విరాట్‌ కోహ్లీ. ఈ వరల్డ్‌ కప్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఎంతో కీలకమైన ఇన్నింగ్స​ ఆడి కోహ్లీ.. అక్కడి నుంచి వెనుకకు తిరిగి చూడలేదు. బంగ్లదేశ్‌పై అలాగే సౌతాఫ్రికాపై కోహ్లీ సెంచరీలు సాధించాడు. మరి కేన్‌ విలియమ్సన్‌ లాంటి మోడ్రన్‌ గ్రేట్‌ ప్లేయర్‌ మరో గ్రేట్‌ క్రికెటర్‌ కోహ్లీని తన ఫేవరేట్‌ క్రికెటర్‌గా పేర్కొనడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments